English | Telugu
ఆమ్లెట్ టీ షర్ట్ తో వేణు స్వామి రీల్..మీలో ఈ యాంగిల్ కూడా ఉందా!
Updated : Apr 1, 2024
ఆమ్లెట్ టీషర్ట్ తో సోషల్ మీడియాలో తెగ వైరల్ ఐపోయాడు వేణు స్వామి. ఐతే వేణు స్వామి కూడా రీల్స్ కి వ్యతిరేకం కాదు అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో స్టార్స్ కి జ్యోతిష్యం చెప్తూ అప్పుడప్పుడు సెలెబ్రిటీస్ ఇళ్లల్లో పూజలు చేస్తూ వేణు స్వామి బాగా ఫేమస్ అయ్యాడు. ఆయనతో పూజలు చేయించుకోవడానికి చాలామంది క్యూలు కడుతున్నారు కూడా. ఇప్పుడు అలాంటి ఒక వీడియోతో ఫుల్ వైరల్ గా మారాడు. జ్యోతిష్యం దెప్పడంలో నోరు తిరగడమే కాదు ఇప్పుడు రీల్స్ లో కూడా ఆయన క్రేజ్ అలా టర్న్ ఐపోయింది.
వీణాశ్రీవాణి -వేణు స్వామి ఇద్దరూ కలిసి ప్రభాస్ నటించిన మిర్చి మూవీలో ఒక ఫేమస్ డైలాగ్ కి రీల్ చేసారు. "ఇట్లాంటి అమ్మాయే కావాలని కోరికలు ఉన్నాయా" అనే అనుష్క డైలాగ్ ని వీళ్ళిద్దరూ కలిసి చేసి చూపించారు. ఇక నెటిజన్స్ ఐతే తిట్టేవాళ్ళు తిడుతున్నారు..పొగిడేవాళ్లు పొగుడుతున్నారు. "మిర్చి 2 , ఈ కళలు ఉన్నాయా మీలో దొర, ఎన్ని రోజులు అయింది ఇలా మీ ఇద్దరినీ చూసి, మంచి యాక్టర్ దొరికేసాడు సూపర్ అండి, అప్పుడప్పుడూ ఇలా ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఉండాలి, ప్రభాస్ ను డామినేట్ చేస్తున్నాడు, వేణు స్వామి గారు షష్టిపూర్తి ఎప్పుడు, గురుగారిలో ఈ యాంగిల్ కూడా ఉందా" అని అంటున్నారు. వేణు స్వామి యాక్టర్ ఏమీ తక్కువ కాదు అని ఈ రీల్ ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే కుమారి ఆంటీ బుల్లితెర మీద సీరియల్స్ లో ఈవెంట్స్ లో మెరిసింది. ఇక వేణు స్వామికి ఎలాగో ఇండస్ట్రీతో బాగా టచ్ ఉంది. ఏమో రేపు సీరియల్స్ లో ఆయన కోసం డైరెక్టర్స్ క్యారెక్టర్స్ కూడా సృష్టించవచ్చేమో...చూడాలి. అష్షురెడ్డి వేణుస్వామితో చాలా సార్లు పూజలు కూడా చేయించుకుంది.