English | Telugu
ఆ పనిలో లేజీ కాదు.. అసలు విషయం చెప్పేసిన సంధ్య
Updated : Mar 31, 2024
నీతోనే డాన్స్ ఈ వారం అసలైన రౌండ్ స్టార్ట్ అయ్యింది. ఇక ప్రతీ శనివారం తగ్గేదేలే టీమ్, ఆదివారం తస్సాదియ్యా టీమ్ వస్తుంది అని చెప్పింది శ్రీముఖి. తగ్గేదేలే టీమ్ నుంచి బ్రిట్టో-సంధ్య, మానస్ నాగులపల్లి - శుభశ్రీ రాయగురు, శిశిర్-షిరిన్, కుమార్ సాయి - శ్వేతా, నితిన్ - అక్షిత్. ఇక స్టార్టింగ్ బ్రిట్టో-సంధ్య ఇద్దరూ వచ్చి మంచి పెర్ఫార్మెన్స్ చేశారు.
సాంగ్ తర్వాత వీళ్లకు ఒక టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. "ఇద్దరిలో ఎవరు ఎక్కువగా లేజీగా ఉంటారు" అని అడిగితే ఇద్దరం అని చెప్పారు.. "ఎవరు ముందు గొడవ స్టార్ట్ చేస్తారు" "సంధ్య" అనే బ్రిట్టో చెప్పాడు .. ఆమె కూడా తానే అని చెప్పుకుంది. యూనివర్సల్ గా గొడవ అంటే ఆడవాళ్లే స్టార్ట్ చేస్తారు అని చెప్పింది శ్రీముఖి. "ప్రేమించేటప్పుడు ఫుల్ ప్రేమ చూపిస్తారు పెళ్లయ్యాక కొంచెమే చూపిస్తారు..అందుకే అటెన్షన్ కోసం గొడవ పడుతూ ఉంటాం" అని చెప్పింది సంధ్య. "ఎవరు రొమాన్స్ లో ముందు.." అని అడగడంతో ఇద్దరం అని చెప్పారు. తర్వాత సంధ్యా బ్రిట్టోని గట్టిగా ముద్దు పెట్టేసుకుంది .."మరి నువ్వేలా రొమాన్స్ చేస్తావో చూపించు" అని శ్రీముఖి బ్రిట్టోని అడిగింది " నేను పబ్లిక్ లో అవన్నీ చూపించలేను" అని చెప్పేసాడు. "ఎనిమిది నెలలే అయ్యింది మీ పెళ్ళై" అని శ్రీముఖి అనేసరికి తెలుగు అర్ధం కానీ బ్రిట్టో "ఎనిమిది నెలలా" అని అనుమానంతో సంధ్యను అడిగాడు. తర్వాత శ్రీముఖి క్లారిటీ ఇచ్చింది. ఇంతలో రాధ ఎంట్రీ ఇచ్చి అందుకే లేజీ, లేజీ అన్నారు అంటూ నవ్వేసింది. ఇక సంధ్య వచ్చి "లేదు లేదు.. ఆ విషయంలో లేజీ కాదు" అని చెప్పేసరికి "అందరికీ అన్ని విషయాలు చెప్పకూడదు" అని బ్రిట్టో ఆమెను ఆపేసాడు. ఇక తరుణ్ మాస్టర్ ఆ టాపిక్ ని వేరేగా మార్చేశారు. "పగలు మాత్రమే బ్రిట్టో లేజీగా ఉంటాడు" అని కవర్ చేశారు.