English | Telugu
టీఆర్పీలో బ్రహ్మముడి సీరియల్ ప్రభంజనం.. వరుసగా నాలుగోసారి నెంబర్ వన్!
Updated : Apr 1, 2024
స్టార్ మా టీవీ సీరియళ్ళలో అత్యధిక టీఆర్పీ పొందుతున్న సీరియల్ గా 'బ్రహ్మముడి' నిలిచింది. రెండవ స్థానంలో 'నాగపంచమి', మూడవ స్థానంలో 'కృష్ణ ముకుంద మురారి' ఉండగా.. నాల్గవ స్థానంలో ' కార్తీక దీపం 2' ఉంది. ఆ తర్వాత అయిదవ స్థానంలో 'గుండెనిండా గుడిగంటలు' ఉంది.
ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ కొత్తగా వచ్చింది అయితే ఈ మధ్యే ఈ సీరియల్ కి ఫ్యామ్ బేస్ కూడా స్టార్ట్ అయింది. అందుకే ఇది ప్రస్తుతం ఆరవ స్థానంలో కొనసాగుతుంది. అయితే గత కొన్ని నెలలుగా స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే అన్ని సీరియల్స్ లో 'బ్రహ్మముడి' అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తుంది. దీనికి కారణం కథ బాగుండటం ఒకటైతే.. ఆన్ స్క్రీన్ పై రాజ్-కావ్యల మధ్య బాండింగ్ ఉంది. అలాగే దుగ్గిరాల ఇంట్లో సాగే ఎమోషనల్ సీక్వెన్స్ సీన్స్, అక్కచెల్లెళ్ళ మధ్య సాగే గొడవలు.. ఇవన్నీ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అవుతున్నాయి. కనకం, కృష్ణమూర్తిల మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్.. తెలుగింటి ప్రేక్షకులకు దగ్గరగా ఉంది. బొమ్మలకి రంగులు వేసుకుంటూ కృష్ణమూర్తి కనకం ఇద్దరు తమ ఇద్దరు కూతుళ్ళు కావ్య, స్వప్నలని చదివించి దుగ్గిరాల ఇంటి కోడళ్ళుగా చేశారు. కావ్యని దుగ్గిరాల ఇంట్లో మొదట అందరు ద్వేషించేచారు. ఇక కొన్ని ఎపిసోడ్ ల ముందు వరకు కావ్యని ధాన్యలక్ష్మీ, ఇందిరాదేవీ, సీతారామయ్య, సుభాష్, కళ్యాణ్ లు ఇష్టపడగా.. తాజాగా జరుగుతున్న ఎపిసోడ్ లలో రాజ్ తన కొడుకుని తీసుకురావడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. మరోవైపు ఒక ప్లాన్ ప్రకారం దుగ్గిరాల ఇంట్లోకి అడుగుపెట్టిన అనామిక.. కావ్య మీద ఇంట్లోని వాళ్ళందరికి ఉన్న మంచి అభిప్రాయం పోగొట్టి తను మంచి కోడలిని అనిపించుకోవాలని తాపత్రయపడుతుంది. ఇక రాహుల్ వాళ్ళ అమ్మ రుద్రాణి ఇదే మంచి ఛాన్స్ అని భావించి అనామికని తనవైపు తిప్పుకుంది. ధాన్యలక్ష్మి, అనామిక, రుద్రాణి కలిసి రాజ్ ని ఆఫీస్ భాద్యతల నుండి తప్పించాలని చూస్తున్నారు. మరి అపర్ణ అలాగే చేయనుందా? రాజ్ తీసుకొచ్చిన కొడుకు తల్లి ఎవరు లాంటి ఆసక్తికరమైన ప్రశ్నలతో ఈ సీరియల్ సాగుతుంది.
అసలేం జరుగుతుంది.. ఎన్నడు రాజ్ ని అపర్ణ ఒక్క మాట కూడా అడుగులేదు. అలాంటిది తనని ఆఫీస్ భాద్యతల నుండి తొలగిస్తుందా ఏంటని? అసలు ఆ బాబు తల్లి ఎవరని.. అందరు అనుకుంటుండగా ఎపిసోడ్ ముగిసింది. మరి ఆ తర్వాతి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటిని పెంచారు మేకర్స్. ఇలా ఈ సీరియల్ కథ మిగతా సీరియల్స్ కంటే భిన్నంగా ఉండటంతో అత్యధిక టీఆర్పీ పొందుతుంది.