English | Telugu

మా ఆయనకు ఈ వీడియో చూపించొద్దు అన్న రాధ

"నీతోనే డాన్స్" షో నెక్స్ట్ వీక్ ప్రోమో ఇంతకు ముందు ఎపిసోడ్స్ కంటే కూడా కలర్ ఫుల్ గా కనిపించబోతోంది. ఇప్పటివరకు  ప్రాపర్టీ రౌండ్, డిఫరెంట్ డాన్స్ స్టైల్స్ ఐపోయాయి.. నెక్స్ట్ వీక్ రెట్రో రౌండ్ థీమ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో స్టార్టింగ్ శ్రీముఖి తెల్లని హంసలా ఎంట్రీ ఇచ్చింది. ఇక నటరాజ్ మాష్టర్ సీనియర్ ఎన్టీఆర్ గెటప్ లో వచ్చారు. "ఈరోజు మీ మూడ్ ఆఫులో ఉన్నదా ఆన్ లో ఉన్నదా ?" అని అడిగేసరికి "చూచెదము" అని చెప్పారు. ఇక ఆట సందీప్- జ్యోతి జోడి "రావోయి చందమామ ..మా వింత గాధ వినుమా" అనే సాంగ్ కి డాన్స్ చేసేసరికి శివ్ మాత్రం తన సందీప్ డాన్స్ పెర్ఫార్మెన్స్ లో కొంచెం డాన్స్ తగ్గినట్లు అనిపించింది అనేసరికి ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది.

అన్నపూర్ణని హాస్పిటల్ కి తీసుకెళ్ళిన కనకం, కృష్ణమూర్తి.. కావ్య వేసిన డిజైన్స్ హిట్టు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -150 లో.. కావ్య డిజైన్స్ వేసి శృతి కి పంపిస్తుంది. మరుసటి రోజు ఉదయం సుభాష్, ప్రకాష్ ఇద్దరు ఆఫీస్ ఫైల్స్ చూస్తారు. రాజ్ గదిలో ఫైల్స్ ఉన్నాయి అవి తీసుకొని రా అని కావ్యతో సుభాష్ అంటాడు. సరే అని కావ్య గదిలోకి వెళ్తుంది. స్నానం చేస్తున్న రాజ్ ని కావ్య ఫైల్ ఎక్కడ అని అడుగుతుంది. టవల్ వాటర్ లో పడిపోయింది. ఒక టవల్ ఇవ్వమని రాజ్ అంటాడు. టవల్ తీసుకొని రాజ్ బాత్రూమ్ డోర్ వేసేటప్పుడు కావ్య చీర కొంగు ఆ డోర్ లో ఇరుక్కుపోతుంది. ఆ తర్వాత రాజ్ కావాలనే కొద్దిసేపు కావ్యని ఏడిపిస్తాడు. 

ఆంటీ అనడం క్రైమ్ అంటున్న లాస్య ..జైల్లో పెట్టాలి అన్న నెటిజన్

"ఆంటీ" అనే పదం సోషల్ మీడియాలో నిన్న మొన్నటి వరకు ఫుల్ వైరల్ అయ్యింది. అనసూయను ఆంటీ అన్నందుకు నెటిజన్స్ కి ఆమెకు మధ్య జరిగినల్ ట్విట్టర్ వార్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఈ ఆంటీ అనే పదం అప్పుడప్పుడు మిగతా షోస్ లో పొరపాటున అనడం నాలుక్కరుచుకోవడం చాలా మంది చేస్తూనే ఉన్నారు. ఐతే సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ చేసిన రీల్స్ మాత్రమే కాకుండా మిగతా సాధారణ ప్రజలు చేసే షార్ట్స్, రీల్స్ ని కూడా కొంత మంది సెలెబ్రిటీస్ చేస్తూ ఉంటారు. అలా సోషల్ మీడియాలో రీసెంట్ గా శ్రీదేవి అనే ఒక అమ్మాయి "ఆంటీ" అనే కాన్సెప్ట్ తో ఒక రీల్ చేసింది. ఆ రీల్ ఫుల్ వైరల్ అయ్యింది.

బచ్చాగాడు అన్న సదా....హూ ఈజ్ మై పార్టనర్ అంటూ వెతుక్కున్న జోడీస్

నీతోనే డాన్స్ ఆదివారం ఎపిసోడ్ లో "దుమ్ము లేపు" టీమ్ అద్దిరిపోయే వెరైటీ పెర్ఫార్మెన్సెస్ చేశారు. ఇందులో మొదటిగా శివ్- ప్రియాంక జోడి సైకిల్ టైర్ తో చేసిన డాన్స్ కి జడ్జెస్ అంతా ఫిదా ఇపోయారు. వీళ్ళు స్టేజి మొత్తాన్ని యూజ్ చేసుకుని చేశారు. మిగతా జోడి కంటెస్టెంట్స్ అంతా తక్కువ మార్క్స్ ఇచ్చారు. కానీ జడ్జెస్ మాత్రం ఆ పెర్ఫార్మెన్స్ కి ఖుషీ ఇపోయారు. "ఇది పర్ఫెక్ట్ ప్రాపర్టీ రౌండ్" అని రాధ చెప్పారు. ఇక  సదా ఐతే "బచ్చాగాడు" అని శివ్ ని  కామెంట్ చేసింది. ఐతే ఈ కామెంట్ ఎందుకు చేసింది అంటే లాస్ట్ ఎపిసోడ్ లో ఆట సందీప్-జ్యోతి డాన్స్ మీద శివ్ మార్క్స్ ఇచ్చేటప్పుడు "శివ్ ఏది మాట్లాడినా మా అబ్బాయి లేఖను మాట్లాడినట్టు ఉంటుంది" అని చిన్నపిల్లాడితో పోల్చేసరికి శ్రీముఖి "అంటే బచ్చాగాడు" అంటున్నావా అని సందీప్ ని అంది.

నిఖిల్ చాలా హాట్ అన్న సదా..నాన్న చనిపోయిన ఐదో రోజు షూటింగ్ కి వచ్చానన్న రాధా

నీతోనే డాన్స్ శనివారం ఎపిసోడ్ మస్త్ కలర్ ఫుల్ గా సాగింది. ఈ వారం షో ప్రాపర్టీ రౌండ్ థీమ్ తో జరిగింది..ఇక  జోడీస్ అన్నీ కూడా మంచి మంచి కాస్ట్యూమ్స్ తో వెరైటీ ప్రాపెర్టీస్ తో బాగా ఎంటర్టైన్ చేశారు. ఈ షోలో లాస్ట్ వీక్ యాదమ్మరాజు- స్టెల్లా ఎలిమినేట్ అయ్యేసరికి వాళ్ళ ప్లేస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టారు శ్రీవాణి-విక్రమ్...పెర్ఫార్మ్ చేసింది ఫస్ట్ టైం ఐనా సరే ఒక రేంజ్ లో దుమ్ము దులిపే పెర్ఫార్మెన్స్ చేసి అదరగొట్టారు. తర్వాత నటరాజ్ - నీతూ చేసిన డాన్స్ వరస్ట్ అని సదా, రాధ అనేసరికి వాళ్ళు ఇద్దరూ స్టేజి మీద నుంచి వెళ్లిపోయారు. దాంతో విక్రమ్-శ్రీవాణి డాన్స్ కి వాళ్ళు మార్క్స్ ఇవ్వలేదు. వాళ్ళ బదులుగా సదా-రాదా మార్క్స్ ఇచ్చారు.

ఫస్ట్ బోనం ఎత్తినప్పుడు 21 రూ..ఇచ్చారు...నెలరోజులు చాకోలెట్స్ కొనుక్కుని తిన్నా

తెలంగాణలో బోనాల పండగ జాతర ఎంత ధూమ్ ధామ్ గా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ నేపథ్యంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా బోనాల స్పెషల్ ప్రోగ్రాంని ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమానికి జోగిని శ్యామల వచ్చారు. ఇంద్రజ, రష్మీ ఇద్దరూ కలిసి ఎన్నో విషయాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు. "నా ఏడవ ఏట బోనాల పండగలో ఒక భాగం  అయ్యాను. తెలంగాణాలో నేను ఫస్ట్ బోనం ఎత్తినప్పుడు చీరా సారె పెట్టి 21 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులతో నెలరోజులు చాకోలెట్స్ కొనుక్కుని తిన్నాను. ఇప్పుడు బోనాల పండగ అనేది ప్రతీ రాష్ట్రంలో ప్రతీ దేశంలో చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. 30 ఏళ్లుగా నేను అమ్మవారి సేవ చేస్తున్నందుకు లష్కర్ కి ఆడపచుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి  ఆలయంలో ప్రతీ ఏట తోలి బోనం ఎత్తుకునే మొదటి అవకాశం నాకే ఉంది. అందుకే నన్ను తెలంగాణ ఆడపడుచు అంటారు.