Read more!

English | Telugu

రైట్ పార్ట్నర్ దొరక్కపోతే ఆ పెళ్ళి అంతే!

 


స్టార్ మాలో ప్రసారమవుతున్న "నీతోనే డాన్స్" షో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. శనివారం ఎపిసోడ్ ఈ వారం కొంచెం కారంగా ఇంకొంచెం గారంగా సాగింది. ఆదివారం ఎపిసోడ్ మాత్రం ఫుల్ మస్తీగా మంచి జోష్ తో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్ చేసింది. ఇందులో సాగర్ - దీప జోడి చున్నీని ప్రాపర్టీగా తీసుకుని మంచి చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి టోటల్ స్టేజి ఊగిపోయింది. మిగతా జోడి కంటెస్టెంట్స్ ఫుల్ మార్క్స్ ఇచ్చేసారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ పూర్తయ్యాక శ్రీముఖి సాగర్-దీప మధ్య ఎంత కంపాటబిలిటీ ఉంది అనే విషయం తెలుసుకోవడానికి ఒక టాస్క్ ఇచ్చింది. "మీకు పిల్లలు పుడితే ఫస్ట్ అమ్మాయి కావాలా అబ్బాయా" అని అడిగింది దానికి సాగర్ "అబ్బాయి" అని రాసాడు..దీప "ట్విన్ గర్ల్స్, ట్విన్ బాయ్స్" కావాలని రాసింది. దానికి శ్రీముఖి సాగర్ మనిషి అనుకుంటున్నావా మెషిన్ అనుకుంటున్నావా అని దీపని కామెడీగా అడిగింది. "ఒక అమ్మాయిని వెటర్నరీ డాక్టర్ ని, మరో అమ్మాయిని హీరోయిన్ ని చేస్తారు, అలాగే ట్విన్ బాయ్స్ లో ఒకరిని ఆర్మీకి పంపిస్తాను, ఇంకొకరిని హీరోని చేస్తాను" అని చెప్పింది దీప.

"ఎంత స్పాన్ ఆఫ్ లైఫ్ లో మీ బేబీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు" అని అడిగింది శ్రీముఖి "త్రి టు ఫోర్ ఇయర్స్ అని దీపా రాస్తే దీపు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు" అని సాగర్ రాసాడు. "రైట్ పార్ట్నర్ దొరక్కపోతే ఆ పెళ్లి ఒక అబద్దం ఐపోతుంది..కానీ ఒక్కసారి నేను సాగర్ ని చూసినప్పుడు అయ్యో నాకు ఇలాంటి అబ్బాయి దొరికితే బాగుండు" అనిపించింది అంటూ సదా చెప్పి తన చేత్తో హార్ట్ సింబల్ చూపించింది. ఇక తరుణ్ మాష్టర్ సాగర్ నేను నిన్ను సదా గారి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా అంటూ ఆటపట్టించారు. దానికి సదా "నో నా మనసులో చాలా భావాలను దాచేసుకుంటున్న ఎందుకంటే సాగర్ ఆల్రెడీ కమిటెడ్ , ఆల్రెడీ పెళ్లయిపోయింది కాబట్టి" అని చెప్పింది సదా.