English | Telugu

బలగం పొందిన విశ్వ విజయ శతకం!

'బలగం' సినిమా ప్రతి కుటుంబంలోని ప్రతీ మనిషి లోని ఎమోషన్ ని బయటకు తీసిన సినిమా.. కుటుంబ బంధాలకు పెద్ద పీటవేస్తూ అద్భుతమైన కథతో వేణు ఎల్దండి డైరెక్ట్ చేసిన బలగం మూవీ ఒక సంచలనం సృష్టించింది. ఈ మూవీ ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంది. ప్రతి పల్లెలో ఈ 'బలగం' మారు మ్రోగుతోంది. మొదటి సినిమానే ఇంత భారీ విజయం సాధించడంతో ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు వేణు.

ఇప్పటికే ఈ మూవీ పలు అవార్డులు సొంతం చేసుకుంది. వేణు మొదటగా తన కెరీర్ ని చిన్న చితక పాత్రలతో స్టార్ చేసాడు. ఆ తర్వాత జబర్దస్త్ షో లో వేణు వండర్స్ టీమ్ కి లీడర్ గా చేసి మంచి ఫేమ్ సంపాదించాడు. కొన్ని సంవత్సరాల పాటు జబర్దస్త్ లోనే కొనసాగిన వేణు.. అనుకోని కారణాల వల్ల ఆ షోకి దూరమయ్యాడు. చాలా రోజులు తెరపై కన్పించిన వేణు.. బలగం మూవీతో మళ్ళీ ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. బలగం సినిమా డైరెక్ట్ చేసి.. ఆ సినిమాలోనే తను కూడా చిన్న పాత్రని పోషించిన విషయం అందరికి తెలిసిందే.

'బలగం' మూవీ ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డు అందుకోగా.. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు తెచ్చింది. తాజాగా బలగం సినిమా వంద ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని వేణు తన ఇన్ స్టాగ్రామ్ లో 'విశ్వ విజయ శతకం' అంటూ క్యాప్షన్ పెట్టి కొన్ని ఫొటోలని షేర్ చేసాడు. కాగా ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.