Read more!

English | Telugu

నిఖిల్ చాలా హాట్ అన్న సదా..నాన్న చనిపోయిన ఐదో రోజు షూటింగ్ కి వచ్చానన్న రాధా

నీతోనే డాన్స్ శనివారం ఎపిసోడ్ మస్త్ కలర్ ఫుల్ గా సాగింది. ఈ వారం షో ప్రాపర్టీ రౌండ్ థీమ్ తో జరిగింది..ఇక  జోడీస్ అన్నీ కూడా మంచి మంచి కాస్ట్యూమ్స్ తో వెరైటీ ప్రాపెర్టీస్ తో బాగా ఎంటర్టైన్ చేశారు. ఈ షోలో లాస్ట్ వీక్ యాదమ్మరాజు- స్టెల్లా ఎలిమినేట్ అయ్యేసరికి వాళ్ళ ప్లేస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టారు శ్రీవాణి-విక్రమ్...పెర్ఫార్మ్ చేసింది ఫస్ట్ టైం ఐనా సరే ఒక రేంజ్ లో దుమ్ము దులిపే పెర్ఫార్మెన్స్ చేసి అదరగొట్టారు. తర్వాత నటరాజ్ - నీతూ చేసిన డాన్స్ వరస్ట్ అని సదా, రాధ అనేసరికి వాళ్ళు ఇద్దరూ స్టేజి మీద నుంచి వెళ్లిపోయారు. దాంతో విక్రమ్-శ్రీవాణి డాన్స్ కి వాళ్ళు మార్క్స్ ఇవ్వలేదు. వాళ్ళ బదులుగా సదా-రాదా మార్క్స్ ఇచ్చారు.

"ఈ స్టేజి మీదకు నేను పరువు పోగొట్టుకోవడానికి రాలేదు...మనకు ఏం కావాలో అది వాళ్ళు ఇవ్వలేనప్పుడు నేను ఏం చేయలేను." అని సీరియస్ గా చెప్పేసరికి.."అదే ప్రొఫెషనలిజం అంటే..స్క్రీన్ మీద హీరోహీరోయిన్స్ చూసి ఏమనుకుంటున్నారు. అలాగే రియల్ లైఫ్ ఉంటుందా అసలు.  నేను మా నాన్న చనిపోయిన ఐదో రోజు షూటింగ్ కి వచ్చాను. కలకు ఫుల్ స్టాప్ లేదు. అన్ని హిట్ పెర్ఫార్మెన్సెస్ ఉండాలని లేదు కదా..అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఉంటాయి. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలీదు. అదే లైఫ్" అన్నారు రాధ. ఫైనల్ గా కావ్య-నిఖిల్ చేసిన డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. ఐతే వీళ్ళు ప్రాపర్టీగా తీసుకున్న లైట్ మీద చాలా కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ టోటల్ ఎపిసోడ్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే అని సదా చెప్పారు. ఇక రాధతో నిఖిల్ "మనోహర" సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక సదాని డాన్స్ చేయమని శ్రీముఖి పిలిచింది. "నేను నిఖిల్ ని చూడలేకపోతున్నా..కానీ చాలా హాట్ గా ఉన్నాడు." అంటూ సిగ్గుపడిపోయింది సదా. ఇక ఈ ఎపిసోడ్ లో లీస్ట్ మార్క్స్ తో నటరాజ్ మాష్టర్-నీతూ ఉన్నారు.