Read more!

English | Telugu

బచ్చాగాడు అన్న సదా....హూ ఈజ్ మై పార్టనర్ అంటూ వెతుక్కున్న జోడీస్


నీతోనే డాన్స్ ఆదివారం ఎపిసోడ్ లో "దుమ్ము లేపు" టీమ్ అద్దిరిపోయే వెరైటీ పెర్ఫార్మెన్సెస్ చేశారు. ఇందులో మొదటిగా శివ్- ప్రియాంక జోడి సైకిల్ టైర్ తో చేసిన డాన్స్ కి జడ్జెస్ అంతా ఫిదా ఇపోయారు. వీళ్ళు స్టేజి మొత్తాన్ని యూజ్ చేసుకుని చేశారు. మిగతా జోడి కంటెస్టెంట్స్ అంతా తక్కువ మార్క్స్ ఇచ్చారు. కానీ జడ్జెస్ మాత్రం ఆ పెర్ఫార్మెన్స్ కి ఖుషీ ఇపోయారు. "ఇది పర్ఫెక్ట్ ప్రాపర్టీ రౌండ్" అని రాధ చెప్పారు. ఇక  సదా ఐతే "బచ్చాగాడు" అని శివ్ ని  కామెంట్ చేసింది. ఐతే ఈ కామెంట్ ఎందుకు చేసింది అంటే లాస్ట్ ఎపిసోడ్ లో ఆట సందీప్-జ్యోతి డాన్స్ మీద శివ్ మార్క్స్ ఇచ్చేటప్పుడు "శివ్ ఏది మాట్లాడినా మా అబ్బాయి లేఖను మాట్లాడినట్టు ఉంటుంది" అని చిన్నపిల్లాడితో పోల్చేసరికి శ్రీముఖి "అంటే బచ్చాగాడు" అంటున్నావా అని సందీప్ ని అంది.

ఆ కామెంట్ ని ఈ రోజు సదా రిపీట్ చేశారు. "నేను సరదాగా అన్నాను. సీరియస్ గా తీసుకోకండి" అన్నారు సదా..ఇద్దరి డాన్స్ చాలా బాగా చేశారు అని కామెంట్ చేశారు. ఇక ఈ షో స్టార్టింగ్ లో "హూ ఈజ్ మై పార్టనర్" ఫ్లెక్సీని ఈ షో స్టేజి మీద పెట్టి దాని వెనక వాళ్ళ వాళ్ళ పార్టనర్స్ ని కాళ్ళు మాత్రమే బయటకు కనిపించేలా కూర్చోబెట్టి ఎవరి పార్టనర్ ఎవరు అనే టాస్క్ ఇచ్చింది. ఈ టాస్క్ ని ఈ జోడీస్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాయి. "శివ్-ప్రియాంక క్యూటీ పై లా ఉన్నారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే స్కూల్ కి కిడ్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినట్టు అనిపించింది" అన్నారు సదా. శివ్ నీ పార్టనర్ ని పొగడాలి అని శ్రీముఖి అడిగేసరికి "టైర్స్ కి ఎండ్ అనేది ఉండదు. అలానే మా రిలేషన్ కి ఎండ్ లేదు" అని చెప్పారు ఇద్దరు. ఇక ఈ జంటకు ఫైనల్ గా మిగతా మూడు జోడి కంటెస్టెంట్స్ ఇచ్చిన మార్క్స్ 23 ..