English | Telugu

మై విలేజ్ షో అనిల్ జీలాతో హిడింబ టీమ్ ముచ్చట్లు! 



ప్రస్తుతం సోషల్ మీడియాలో మై విలేజ్ షో అనిల్ జీల అండ్ టీమ్ హావా నడుస్తుంది. యూట్యూబర్ గా అనిల్ జీల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న గంగవ్వని పాపులర్ చేసాడు అనిల్ జీల. మై విలేజ్ షో ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో కలిసి చిన్న చిన్న వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. అనిల్ జీల క్రియేట్ చేసిన 'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ ద్వారా గంగవ్వకి బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక నాగార్జున సైతం తనకి ప్రోత్సాహం అందించాడు.

యూట్యూబ్ వీడియోల నుండి అనిల్ కెరీర్ మొదలు పెట్టి.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నాడు. అనిల్ జీలా ఎప్పటికప్పుడు విభిన్నంగా ఆలోచిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. లాక్ డౌన్ లో అనిల్ పెళ్లి చేసుకుని పెళ్లి పత్రిక డిఫరెంట్ గా చేయించాడు. అప్పట్లో అది కాస్త వైరల్ గా మారింది. రీసెంట్ గా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ లో నటించి తన కామెడీతో అందరిని మెప్పించాడు. ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ తీసుకొని వీడియోలు చేయడం అనిల్ స్టైల్ అనే చెప్పాలి.

తాజాగా అనిల్ జీలా కల్లివెల్లి అనే యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోని పోస్ట్ చేశాడు. అశ్విన్ నటించిన మూవీ 'హిడింబ' ప్రమోషన్స్ లో భాగంగా.. మూవీ టీం ఇందులో కొన్ని ముచ్చట్లు పంచుకున్నారు. మొదటగా అశ్విన్ పొలంలో నాటు వేస్తున్న గంగవ్వతో స్టార్ట్ చేశాడు. ఏం అవ్వా అన్నం పెడతా అన్నావ్. నాటు వేస్తున్నావా" అని గంగవ్వని అశ్విన్ ప్రేమతో పలకరించాడు. ఆ తర్వాత నాగలి దున్నతున్న అనిల్ జీల దగ్గరికి చిత్ర యూనిట్ వెళ్లి మాటకలిపి సినిమా గురించి మాట్లాడుకున్నారు. ఇలా అనిల్ జీల, గంగవ్వలతో కల్లివెల్లి ఛానల్ లో సెలబ్రిటీస్ వచ్చి ముచ్చటిచడం కొత్తేమీ కాదు అప్పట్లో రానాతో కళ్ళు దావత్ అంటూ చేసిన ఆ వీడియో వైరల్ కాగా అదే తరహాలో హిడింబ టీం చేసిన వీడియో వైరల్ గా మారింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.