English | Telugu

అన్నపూర్ణని హాస్పిటల్ కి తీసుకెళ్ళిన కనకం, కృష్ణమూర్తి.. కావ్య వేసిన డిజైన్స్ హిట్టు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -150 లో.. కావ్య డిజైన్స్ వేసి శృతి కి పంపిస్తుంది. మరుసటి రోజు ఉదయం సుభాష్, ప్రకాష్ ఇద్దరు ఆఫీస్ ఫైల్స్ చూస్తారు. రాజ్ గదిలో ఫైల్స్ ఉన్నాయి అవి తీసుకొని రా అని కావ్యతో సుభాష్ అంటాడు. సరే అని కావ్య గదిలోకి వెళ్తుంది. స్నానం చేస్తున్న రాజ్ ని కావ్య ఫైల్ ఎక్కడ అని అడుగుతుంది. టవల్ వాటర్ లో పడిపోయింది. ఒక టవల్ ఇవ్వమని రాజ్ అంటాడు. టవల్ తీసుకొని రాజ్ బాత్రూమ్ డోర్ వేసేటప్పుడు కావ్య చీర కొంగు ఆ డోర్ లో ఇరుక్కుపోతుంది. ఆ తర్వాత రాజ్ కావాలనే కొద్దిసేపు కావ్యని ఏడిపిస్తాడు.

కావ్య ఇంకా ఫైల్ తీసుకురావడం లేదని ప్రకాష్ వస్తాడు. కావ్య డోర్ తియ్యమని రాజ్ ని రిక్వెస్ట్ చేస్తుంది అయిన డోర్ తియ్యకపోయేసరికి ప్రకాష్ వచ్చేసరికి డోర్ దగ్గర నిల్చొని ఉంటుంది కావ్య. "ఏంటి కావ్య ఫైల్ తీసుకొని రా అంటే తీసుకురాలేదు" అని ప్రకాష్ అనగానే.. కావ్య కవర్ చేస్తూ అక్కడ ఉంది తీసుకొని వెళ్ళండని చెప్తుంది. ప్రకాష్ ఫైల్ తీసుకొని వెళ్ళిపోతాడు. మరొకవైపు అన్నపూర్ణ బాగా దగ్గుతుంటే కనకం, కృష్ణ మూర్తి లు కంగారుపడతారు. అక్క మనం హాస్పిటల్ కి వెళదామని అన్నపూర్ణతో కనకం అంటుంది. "ఇప్పటికే మీరు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు‌‌.. వద్దు" అని అన్నపూర్ణ అంటుంది.

నువ్వేం మాట్లాడకంటూ కనకం, కృష్ణమూర్తి, అప్పు అందరూ కలిసి అన్నపూర్ణని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. మరొక వైపు శృతికి కావ్య ఫోన్ చేసి మీ సర్ కి డిజైన్స్ చూపించావా అని అడుగుతుంది. ఇంక సర్ రాలేదని శృతి చెప్తుంది. అంతలోనే రాజ్ వచ్చి డిజైన్స్ రెడీ అయ్యాయా అని అడుగుతాడు. రెడీ సర్ అని కావ్య వేసిన డిజైన్స్ చూపిస్తుంది శృతి. చాలా బాగున్నాయని రాజ్ అంటాడు. అదంతా కావ్య ఫోన్లో వింటుంది. సర్ ఇది నేను వెయ్యలేదు మీరు ఒకరిని హైర్ చేసుకోమ్మన్నారు కదా అందుకే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ని హైర్ చేసుకున్నానని శృతి చెప్తుంది. "సరే ఎవరైతే ఏంటి.. మనకి కావలిసింది డిజైన్స్" అని రాజ్ చెప్పేసి వెళ్తాడు. అప్పటికే ఫోన్ కాల్ లో ఉన్న కావ్య.. శృతితో మాట్లాడుతుంది.

మరొకవైపు డాక్టర్ అన్ని టెస్ట్ చేపించాలని చెప్పగానే డబ్బులు ఎంత అవుతాయని కృష్ణమూర్తి డాక్టర్ ని అడుగుతాడు. పదివేల వరకు ఖర్చు అవుతాయని డాక్టర్ చెప్తాడు. కనకం, కృష్ణమూర్తి ఇద్దరు డబ్బు సర్దుబాటు చేసి అన్నపూర్ణ కి టెస్ట్ లు చేపించాలని అనుకుంటారు. మరొక వైపు మోడలింగ్ షూట్ కోసం స్లిమ్ గా కన్పించాలని రాహుల్ కి స్వప్న ఒక లిస్ట్ రాసి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.