English | Telugu

మా ఆయనకు ఈ వీడియో చూపించొద్దు అన్న రాధ

"నీతోనే డాన్స్" షో నెక్స్ట్ వీక్ ప్రోమో ఇంతకు ముందు ఎపిసోడ్స్ కంటే కూడా కలర్ ఫుల్ గా కనిపించబోతోంది. ఇప్పటివరకు ప్రాపర్టీ రౌండ్, డిఫరెంట్ డాన్స్ స్టైల్స్ ఐపోయాయి.. నెక్స్ట్ వీక్ రెట్రో రౌండ్ థీమ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో స్టార్టింగ్ శ్రీముఖి తెల్లని హంసలా ఎంట్రీ ఇచ్చింది. ఇక నటరాజ్ మాష్టర్ సీనియర్ ఎన్టీఆర్ గెటప్ లో వచ్చారు. "ఈరోజు మీ మూడ్ ఆఫులో ఉన్నదా ఆన్ లో ఉన్నదా ?" అని అడిగేసరికి "చూచెదము" అని చెప్పారు. ఇక ఆట సందీప్- జ్యోతి జోడి "రావోయి చందమామ ..మా వింత గాధ వినుమా" అనే సాంగ్ కి డాన్స్ చేసేసరికి శివ్ మాత్రం తన సందీప్ డాన్స్ పెర్ఫార్మెన్స్ లో కొంచెం డాన్స్ తగ్గినట్లు అనిపించింది అనేసరికి ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది.

తర్వాత నిఖిల్-కావ్య జోడి "అందం హిందోళం" సాంగ్ కి అద్దిరిపోయే డాన్స్ చేశారు.. రాధా ఫిదా ఐపోయి వెళ్లి వాళ్ళతో కలిసి డాన్స్ మొత్తం చేశారు. "నేను వేసిన ఈ డాన్స్ వీడియోని మా ఆయనకు చూపించొద్దు" అన్నారు రాధ. అమరదీప్-తేజు "16 ఏళ్ళ వయసు పడిపడి లేచే మనసు" సాంగ్ కి డాన్స్ చేసేసరికి సదా మాత్రం చాలా బాగుంది అని చెప్పారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ అయ్యాక జ్యోతి ఎంట్రీ ఇచ్చి "ఇక్కడ కాంపిటీషన్ ఎలా ఉంది అంటే లిప్ సింక్ కూడా క్యాలిక్యూలేట్ అవుతుందని తెలుస్తోది అనేసరికి కొరియోగ్రాఫర్ గా నేను లిప్ సింక్ అదంతా చూడను అది అసిస్టెంట్ డైరెక్టర్ పని నేను పెర్ఫార్మెన్స్ మాత్రమే చూస్తాను" అని తరుణ్ మాష్టర్ గట్టిగా చెప్పేసారు. పవన్-అంజలి జంట "నా కళ్ళు చెబుతున్నాయి" సాంగ్ కి డాన్స్ చేశారు. "ఈ సాంగ్ కి అంత అక్రోబెటిక్స్ అవసరం లేదు" అన్నారు తరుణ్ మాష్టర్. ఫైనల్ గా నటరాజ్ మాష్టర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ లో రెండు మూడు సార్లు కృష్ణ గారి స్టైల్ వచ్చింది అని అంజలి చెప్పేసరికి..రా చూపించు ...చూపిస్తే నేను ఇలా నడుచుకుంటూ వెళ్లపోతాను అన్నారు మాష్టర్...దానికి అంజలి- పవన్ లేచి స్టేజి మీద నుంచి వెళ్లపోయారు. ఈ ఇన్సిడెంట్ మొత్తాన్ని చూసి నటరాజ్ మాష్టర్ వైఫ్ కూడా ఏడ్చేసింది. ఇక నెక్స్ట్ వీక్ నటరాజ్ మాష్టర్ వెర్సెస్ పవన్-అంజలి జోడి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోంది అని తెలుస్తోంది..

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.