English | Telugu

ఎందుకంత ద్వేషం...అసలా గుంపును రెచ్చగొట్టిన వాళ్లెవరు...బాధపడుతున్న ఝాన్సీ

ఫస్ట్ జనరేషన్ స్టార్ యాంకర్స్ లో ఝాన్సీ ఒకరు. అప్పట్లో  సుమ, ఉదయభాను, ఝాన్సీ ఫుల్ ఫార్మ్ లో ఉండేవాళ్ళు. వీళ్ళను  చూస్తే చాలు ఆడియన్స్ లో ఫుల్ జోష్ వచ్చేది. "టాక్ ఆఫ్ ది టౌన్" షో ఝాన్సీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే పలు బుల్లితెర షోలకు ఆమె యాంకర్ గా వ్యవహరించారు కూడా. యాంకరింగ్ చేస్తూనే నటిగా కూడా ఈమె మంచి సక్సెస్ ని అందుకున్నారు. అలాంటి ఝాన్సీ లైఫ్ లో కొన్ని ఇష్యూస్  కూడా ఉన్నాయి. ఏదేమైనా ఆమె యాంకరింగ్ ఒకప్పుడు టాప్ అని చెప్పొచ్చు. సోషల్ మీడియా వాడకం పెరిగాక ఝాన్సీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

90 లక్షలు ఇన్వెస్ట్ చేయనున్న ఆహా నేను సూపర్ ఉమెన్ ఏంజెల్స్

వితం అంటే పోరాటం, ఆ పోరాటంలోనే ఉంది జయం అని అనుకున్న ఎంతో మందిలో మన ఆహా నేను సూపర్ ఉమెన్ యొక్క ఉమెన్ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. వి హబ్ తో కలిసి స్టార్ట్ అప్ ఉమెన్ ఇంటర్ప్రెన్యూర్స్ కోసం నేను సూపర్ ఉమెన్ అనే షో తోటి ఆహా ఇప్పటికి తెలుగు రాష్ట్ర ప్రజల మనసులని గెలుచుకుంది. ఇపుడు మరిన్ని సరికొత్త ఎపిసోడ్స్ మీ ముందుకు వచ్చేస్తున్నాయ్. ఈ వారం అక్షరాలా 90 లక్షలు మన ఏంజెల్స్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఎవరికి ఇన్వెస్ట్మెంట్ దక్కింది, ఎవరు ఎవరి మెంటార్షిప్ అందుకున్నారు తెలుసుకోవాలి అంటే ఈ 4 మరియు 5 ఆగష్టు రాత్రి 7 గంటలకు ఆహలో మన 'నేను సూపర్ వుమన్' షో తప్పక చూడండి .

అఖిల్ ని వర్జినా? కాదా అని అడిగిన నెటిజన్!

అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ -4 లో రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఆ షోలో మోనల్ కోసం అభిజిత్ తో కలిసి పోటాపోటీగా సాగిన కోల్డ్ వార్ అందరికి గుర్తుండే ఉంటుంది. అన్ని సీజన్లలో కన్నా ఎక్కువ మంది ఇష్టపడింది, గుర్తుండిపోయింది బిగ్ బాస్-4. ఈ సీజన్ లో అఖిల్ సార్థక్ తన అటిట్యూడ్ తో ప్రేక్షకులలో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.  అయితే తాజాగా ముగిసిన బిబి జోడీలో అఖిల్, మోనల్ గజ్జర్ తో‌ జతకడతాడని ప్రేక్షకులు భావించారు. కానీ అనుకోకుండా తేజస్వినితో కలిసి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయినా కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మెరుగైన పర్ఫామెన్స్ ఇచ్చాడు. బిబి జోడీ స్టేజ్ మీద వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుందనే చెప్పాలి‌. అదే విషయం చాలాసార్లు బిబి జోడీలోని జడ్జ్ లు చెప్పారు.

బ్రహ్మముడి కావ్య, రాజ్ చేసిన రీల్ కి వన్ మిలియన్ వ్యూస్!

హలో గురు ప్రేమ‌ కోసమేరా జీవితం.. పాటతో ‌అప్పట్లో నిర్ణయం సినిమాలో నాగార్జున,  అమల కలిసి‌ చేసిన డ్యూయెట్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే.‌ ఇప్పటికీ ఆ పాట అంటే అంతే క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు ఆ ఆ పాటలోని లిరిక్స్ కి ఎంతో మంది సెలబ్రిటీలు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, యూట్యూబ్ లో షార్ట్స్‌ అంటూ తెగ వైరల్ అవుతున్నారు.‌ అయితే ఇప్పుడు అదే కోవకు మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజు చేరారు. వీరిద్దరు కలిసి ప్రస్తుతం స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా వీరిద్దరు కలిసి ఇన్ స్టాగ్రామ్ లో ఈ పాటతో రీల్ చేశారు. అయితే వీరిద్దరు కలిసి చేసిన ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

ఏంట్రా ఈ తేడాగాడు అంటూ చాలామంది కామెంట్స్ చేశారు

సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి "మిస్టర్ ప్రెగ్నెంట్" టీమ్ వచ్చింది. సయ్యద్ సోహైల్, రూప, అలీ రెజా, దీప్తి వచ్చారు. ఆగష్టు 5 న ప్రసారం కాబోయే ఈ షో ప్రోమో చూస్తే ఎంతో ఫన్నీగా, కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది. బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ టీమ్ షోలో ఎంటర్టైన్ చేశారు. ఆగస్టు 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుమ అడ్డా షో ప్రోమో ఎండింగ్ లో  సోహైల్ అందరితో కంటతడి పెట్టించాడు. తన లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నాడు. "లైఫ్ లో ముందుకు ఎలా వెళ్ళాలి యాక్సెప్ట్ చేస్తారా లేదా.. రియాలిటీ షో నుంచి, బుల్లితెర నుంచి వచ్చాడంటూ కామెంట్స్ చేస్తున్నప్పుడు భయం వేస్తూ ఉంటుంది.