English | Telugu

అసలైన ఫామిలీస్ మధ్య సిసలైన ఆట..ఫామిలీ నంబర్ 1


జీ తెలుగులో ఎన్నో షోస్ కొత్త కొత్తగా వస్తూనే ఉన్నాయి. డాన్స్ షోస్ చూసాం, సింగింగ్ షోస్ చూసాం...అలాగే గేమ్ షోస్, రియాలిటీ షోస్, బిగ్ బాస్ ఇలా ఒక్కటేమిటి ఎన్నో. ఈమధ్య కాలంలో బుల్లితెర మీద అలాంటి షోస్ ఎన్నో వస్తున్నాయి పూర్తిచేసుకుని వెళ్లిపోతున్నాయి కూడా. అంతేకాదు ఫామిలీలు ఫామిలీలు వచ్చి షోస్ లో పార్టిసిపేట్ చేసేస్తున్నారు. ఇప్పుడు బయటి నుంచి ప్రత్యేకంగా ఎవరినీ పిలవడం లేదు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళతోనే షోస్ నడిచిపోతున్నాయి. జబర్దస్త్ లో కూడా మూడు తరాల వాళ్ళు నటిస్తున్న వాళ్ళను మనం చూస్తున్నాం. ఇకపోతే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే జీ తెలుగు ఒక సరి కొత్త షోతో త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. దానికి సంబంధించిన ఒక ప్రోమోని రీసెంట్ గా రిలీజ్ చేసింది. ఆ షో పేరు "ఫామిలీ నెంబర్ 1 "...ఇందులో ధనరాజ్ అండ్ ఫామిలీతో ఫస్ట్ ఎపిసోడ్ రాబోతోంది.

"కుటుంబం అంటే అమ్మా , నాన్న, భార్య, పిల్లలు..కానీ నాకు భార్య పిల్లలే అమ్మానాన్న అయ్యారు" అని ధనరాజ్ డైలాగ్ చెప్పాక వాళ్ళ వైఫ్ "ఎఫెక్షనెట్ ఫామిలీ" అంటూ ఒక బోర్డు పట్టుకుని వచ్చారు. "అసలైన అనుబంధాలతో అల్లుకున్న ఈ ఫామిలీస్ మధ్య సిసలైన ఆట..ఫామిలీ నంబర్ 1 " అని చెప్పడంతో ఈ ప్రోమో ముగిసింది. ఐతే ఈ షో రియల్ లైఫ్ ఫామిలీ మెంబర్స్ మధ్యన జరగబోయే ఒక గేమ్ షో అనిపిస్తోంది. ఐతే ఎలాంటి గేమ్స్ ఉండబోతున్నాయి, ఈ షోకి వచ్చే ఫామిలీస్ ఎవరెవరు అనే విషయాలను ప్రస్తుతానికి రివీల్ చేయలేదు. ఏ ఛానల్ లో ఐనా ఒక షో వచ్చిందంటే దానికి రిలేటెడ్ గా మిగతా చానెల్స్ లో కూడా అలాంటి షోస్ స్టార్ట్ ఐపోతాయి. మరి ఈ ఫామిలీ షో ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి. ఇక ఈ షోకి హోస్ట్ గా ఎవరు రాబోతున్నారు అనే విషయం మీద నెటిజన్స్ రవి కావాలని, ప్రదీప్ షో చేయాలనీ మెసేజెస్ పెడుతున్నారు. మరి ఇంతకు రెగ్యులర్ గా చూసే యాంకర్స్ ఉంటారా కొత్త వాళ్ళను తీసుకొస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఐతే ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేసిన ఈ ప్రోమో ద్వారా సూపర్ క్వీన్ షో ఫైనల్స్ కి వచ్చేసింది కాబట్టి త్వరలో ఈ షోని స్టార్ట్ చేసేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. "కొత్త షో, కొత్త కాన్సెప్ట్ అని కొంత మంది అభిప్రాయపడుతుంటే ఇంకొందరు మాత్రం ..పాత చింతకాయ పచ్చడిలా ఉంటున్నాయి జీ షోస్" అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కొత్త షోని ఎలా ప్లాన్ చేశారో ఎంత ఇంటరెస్టింగ్ గా ఉంటుందో చూడాలి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.