English | Telugu

ఫస్ట్ బోనం ఎత్తినప్పుడు 21 రూ..ఇచ్చారు...నెలరోజులు చాకోలెట్స్ కొనుక్కుని తిన్నా


తెలంగాణలో బోనాల పండగ జాతర ఎంత ధూమ్ ధామ్ గా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ నేపథ్యంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా బోనాల స్పెషల్ ప్రోగ్రాంని ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమానికి జోగిని శ్యామల వచ్చారు. ఇంద్రజ, రష్మీ ఇద్దరూ కలిసి ఎన్నో విషయాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు. "నా ఏడవ ఏట బోనాల పండగలో ఒక భాగం అయ్యాను. తెలంగాణాలో నేను ఫస్ట్ బోనం ఎత్తినప్పుడు చీరా సారె పెట్టి 21 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులతో నెలరోజులు చాకోలెట్స్ కొనుక్కుని తిన్నాను. ఇప్పుడు బోనాల పండగ అనేది ప్రతీ రాష్ట్రంలో ప్రతీ దేశంలో చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. 30 ఏళ్లుగా నేను అమ్మవారి సేవ చేస్తున్నందుకు లష్కర్ కి ఆడపచుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రతీ ఏట తోలి బోనం ఎత్తుకునే మొదటి అవకాశం నాకే ఉంది. అందుకే నన్ను తెలంగాణ ఆడపడుచు అంటారు.

నేను ఉన్నంత వరకు అమ్మవారికి తోలి బోనం ఎత్తే అవకాశం ఉంది. నేను నా జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నన్నే కాదు మా పేరెంట్స్ కూడా రకరకాలుగా అనేవారు. ఎందుకు అలా రోడ్ల మీద తిరుగుతావ్ చదువుకోవచ్చు కదా అన్నారు. నన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళ ఇళ్లల్లోకి కూడా వెళ్లి బోనాలు ఎత్తుకుంటాను నేను..స్త్రీని పూజించే పండగ, శక్తిని పూజించే పండగ. అమ్మవారికి పూజ చేసి పచ్చి కుండ మీద నిల్చుని భవిష్యవాణి చెప్తుంది జోగిని. తర్వాత ఈమె బోనాల పాటలకు డాన్స్ చేశారు. ఫైనల్ గా ఆమె భవిష్యవాణి చెప్పింది. చేసిన పూజలకు సంతోషంగా ఉన్నానని అందరినీ కాపాడుకుంటాను" అని చెప్పడంతో ఈ బోనాల స్పెషల్ వేడుక ఎండ్ అయ్యింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.