Read more!

English | Telugu

రిషిని కాపాడుకున్నామని చెప్పిన ఏంజిల్.. షాక్ లో వసుధార, జగతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -817 లో.. మహేంద్రని రిషి డాడ్ అని పిలవడంతో ఏంజిల్ విని ఆశ్చర్యపోతుంది. డాడ్ అని పిలిచావ్ కదా అని రిషిని అడుగుతుంది. లేదని రిషి చెప్తాడు. అక్కడే ఉన్న వసుధార, జగతి, మహేంద్రలను ఏంజిల్ అడుగుతుంది. వాళ్ళు కూడా అనలేదని చెప్పగానే నాకు ఏమైనా చెవులు వినిపిస్తలేవా అని ఏంజిల్ అంటుంది. అప్పుడే విశ్వనాథ్ వస్తాడు. రిషి పిలిచిన విషయం విశ్వనాథ్ కి ఏంజెల్ చెప్తుంది. డాడ్ అని పిలిస్తే తప్పేముందని విశ్వనాథ్ అంటాడు.

ఆ తర్వాత జగతిని తన గదిలోకి తీసుకొని వెళ్తుంది వసుధార. వసుధార నన్ను క్షమించు అని జగతి అంటుంది. అలా అనకండి. మీరు అడిగారు నేను చేశాను. అందుకే నా జీవితం ఇప్పుడు ఇలా ఉందని వసుధార  కోప్పడుతుంది. నేను ఆ విషయంలో తప్పు చేశాను. నేను అప్పుడు రిషిని కాపాడుకోవాలని మాత్రమే ఆలోచించానని జగతి అంటుంది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు అనుకుంటే లాభం లేదని వసుధార అంటుంది. మీరు అతిదులుగా వచ్చారు.. ఒకరికొకరు తెలియనట్లే ఉందామని వసుధార అంటుంది. ఆ తర్వాత అందరూ భోజనం చేస్తుంటారు. ఇలా అందరు ఒక దగ్గర చేరి భోజనం చేయడం హ్యాపీగా ఉందని విశ్వనాథ్ అంటాడు. రిషి ఆ కర్రీ వేసుకో.. నీకు ఇష్టం కదా అని మహేంద్ర అంటాడు. రిషికి ఆ కర్రీ ఇష్టమని మీకెలా తెలుసని ఏంజిల్ అడుగుతుంది. వాళ్లకి ముందే పరిచయం ఉంది కదా చాలాసార్లు కలిసి భోజనం చేసి ఉండొచ్చు కదా అని విశ్వనాథ్ అంటాడు. మిమ్మల్ని చూస్తుంటే అందరూ ఒకే కుటుంబం లాగా అనిపిస్తున్నారని ఏంజిల్ అనగానే.. అందరూ షాక్ అవుతారు. సర్ మీరు మీ ఇంట్లో అందరూ కలిసే భోజనం చేస్తారా అని ఏంజిల్ అడుగుతుంది. అవును అందరం కలిసి వెన్నెలని చూస్తూ నేలపై కూర్చొని భోజనం చేస్తామని మహేంద్ర అంటాడు. రిషి అలా అందరు కలిసి భోజనం చేసిన దానిని గుర్తు చేసుకుంటాడు. సరే రేపు కూడా మనం అలాగే వెన్నెలని చూస్తూ భోజనం చేద్దామని ఏంజిల్ అంటుంది. సరే అని విశ్వనాథ్ అంటాడు.

ఆ తర్వాత అందరూ హాల్లో కూర్చొని కాలేజీ గురించి మాట్లాడుకుంటారు. మీ కాలేజీ అంత పెద్ద స్థాయికి రావడానికి కారణం ఏంటని విశ్వనాథ్ మహేంద్రని అడుగుతాడు. మా ఎండి సర్ వళ్లే అదంతా అని మహేంద్ర చెప్తాడు. కాసేపటికి అందరూ వెళ్ళిపోయాక వసుధార, ఏంజెల్, జగతి కలిసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు. రిషి తనకి ఎప్పటి నుండి పరిచయమని ఏంజిల్ జగతితో చెప్తుంది.  రిషి ని ఎవరో కత్తితో పొడిచారు. హాస్పిటల్ లో ఉంటే విశ్వం, నేను వెళ్లి రిషిని  కాపాడుకున్నామని ఏంజిల్ అనగానే జగతి, వసుధారలు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.