English | Telugu

ట్రెండింగ్ లో ఇంద్రజ చేసిన బోనాల పాట!


ఇంద్రజ.. ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఇంద్రజ తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టి దూసుకుపోతుంది. ఇంద్రజ చాలా మూవీస్ లో సపోర్ట్ రోల్ కూడా చేసి ఆకట్టుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం స్టార్ కామెడీ షో అయిన జబర్దస్త్ కి జడ్జ్ గా చేస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంటోంది.

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో 'దసరా' మూవీలోని వెన్నెల చేసిన డ్యాన్స్ ని రిక్రియేట్ చేసినట్టుగా చెలరేగి డ్యాన్స్ చేసిన ఇంద్రజ.. మోస్ట్ వైరల్ వీడీయోల లిస్ట్ లో చేరింది. అంతేకాదు జబర్దస్త్ షోలో ఈ మధ్య ఎంట్రీ పాటకు డ్యాన్స్ కూడా చేస్తోంది. హోమ్లీ గా ఉంటూనే తనలో మరో కోణం ఉందంటూ మాస్ డ్యాన్స్ చేసి‌ నిరూపించిన ఇంద్రజ.. బయట రెగ్యులర్ గా కొత్త ప్రదేశాలకు వెళ్తుంటుంది. అయితే కొంతకాలం క్రితం హైదరాబాద్ లోని ఒక టెంపుల్ కి వెళ్ళిన ఇంద్రజ.. అందరితో కలిసిపోయి ఏ సెక్యూరిటీ లేకుండా చాలా సాధారణ వ్యక్తిగా తిరుగుతూ వీడీయో చేసింది. అది తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయగా వైరల్ అయింది. జబర్దస్త్ లో తన జడ్డ్ మెంట్ తో టీమ్ లీడర్స్ తో పాటు కంటెస్టెంట్స్ ని సపోర్ట్ చేస్తూ అందరికి ఒక అమ్మలాగా ఉంటూ వస్తోన్న ఇంద్రజ.. బయట కూడా అలానే ఉంటుందని అందరు చెప్పుకుంటారు.

ఇంద్రజ మొదటి సారిగా ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో చేసింది. అదే బోనాల పాట. ఈ పాటకు ఇంద్రజ డాన్స్.. మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులను మెప్పించింది. ఇంద్రజ, సీరియల్ నటి శ్రీవాణి భర్త విక్రమాదిత్య ఈ సాంగ్ లో నటించగా.. ఈ పాట విడుదలైన కొద్దీ రోజుల్లోనే మిలియన్ వ్యూస్ వచ్చాయి‌. కాగా ఈ విషయాన్ని విక్రమాదిత్య తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు. ప్రస్తుతం తెలంగాణలో బోనాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో యూట్యూబ్ లోని ఇంద్రజ బోనాల సాంగ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.