English | Telugu

ఢీ షోకి ఆ పేరు..ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్లకు ర్యాంకులు ఎలా వస్తున్నాయంటే ?  

ఎక్స్ట్రా జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమోలో రాంప్రసాద్ కామెడీ చూస్తే మైండ్ బ్లాంక్ ఐపోతుంది. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో రాంప్రసాద్, మహేష్, శ్రీవిద్య కలిసి ఒక స్కిట్ చేశారు. మహేష్ ఫస్ట్ నైట్ చేసుకోవడానికి ఇంటికి వెళ్తూ రాంప్రసాద్ కోడిని చంపేస్తాడు. దాంతో రాంప్రసాద్ మహేష్ దగ్గరకు వెళ్లి "ఇక్కడ నా కోడికి ఆఖరి రోజైతే నువ్వు అక్కడ ఫస్ట్ నైట్ చేసుకుంటున్నావా"..అని అనేసరికి "బోడి కోడే కదా" అని శ్రీవిద్య లైట్ తీసుకుంటూ ఒక కామెంట్ చేసింది. దానికి రాంప్రసాద్ కోడి గురించి చెప్పిన నెరేషన్ వింటే పొట్ట చెక్కలవ్వాల్సిందే. "ప్రపంచంలో ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్లకు ర్యాంకులు రావడానికి కారణం ఎవరో తెలుసా కోడే..అది తెల్లవారు జామునే లేచి కూస్తుంది కదా అప్పుడు అందరూ లేచి చదువుకుంటున్నారు కాబట్టి..

మన ప్లాన్స్ వాళ్లకు తెలియవు..పాపం పసివాళ్లు...ఇక అంతా ఉల్టాఫుల్ట

బిగ్ బాస్ న్యూ సీజన్ రాబోతున్న నేపథ్యంలో రోజుకో, రెండు రోజులకో ఒక్కో కొత్త  ప్రోమోని వదులుతున్నారు మేకర్స్. ఆ ప్రోమోస్ తో ఆడియన్స్ లో ఇంకా హైప్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే హోస్ట్ నాగార్జున కుడి ఎడమైతే అంటూ ఒక కంఫ్యూజన్ ని ఆడియన్స్ లో క్రియేట్ చేశారు.  హౌస్ లోకి వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారంటూ కూడా రకరకాల వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి బిగ్ బాస్ న్యూ ప్రోమో మంచి కలర్ ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తోంది. ఈ షోకి సీజన్  1 నుంచి మంచి ఆదరణ ఉంది. కాకపోతే  రీసెంట్ గా ముగిసిన సీజన్స్ కి మాత్రం  కొంచెం రేటింగ్ తగ్గిందేమో కానీ ఓవరాల్ గా షో మాత్రం ఆడియన్స్ కి బాగానే రీచ్ అయ్యింది. ఈ కార్యక్రమం అన్ని భాషల్లో కూడా మంచి పాపులారిటీనీ సంపాదించుకుంది.

రష్మీకి పెళ్లిచూపులు..నచ్చలేదని అబ్బాయికి చెప్పిన రాంప్రసాద్

శ్రీదేవి డ్రామా కంపెనీ రాబోయే ఆదివారం ప్రోమో చూస్తే చాలు అంతా ఫ్రెండ్ షిప్ థీమ్ తో కనిపిస్తుంది. ఇక ఈ ఆదివారం 6  వ  తేదీ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ ప్రోగ్రాం ఈ అంశంతో రూపొందించారు మేకర్స్. ఇక ఇందులో రాంప్రసాద్ పంచెస్ మాములుగా లేవు.  ఈ  షోకి నటుడు రవికృష్ణ, అంబటి అర్జున్ వచ్చారు. అర్జున్, రవికృష్ణ గొడవ పడుతూ స్టేజి మీదకు వచ్చేసరికి రాంప్రసాద్ "అసలు గొడవేమిటో చెప్పడం లేదు" అని ఆ గొడవేంటో తెలుసుకోవడానికి ట్రై చేసాడు. "వాడు ఫ్రెండ్ షిప్ కొద్ది ఒక అమ్మాయిని చూస్తే నేను వెళ్లి ముద్దు పెట్టాను" అని సీరియస్ గా చెప్పాడు రవికృష్ణ.."నేను లవ్ చేసిన అమ్మాయిని వాడు వెళ్లి ముద్దు పెట్టడమేమిటి" అని అంబటి అర్జున్ ఫైర్ అయ్యాడు. ఇదంతా ఓకే కానీ "ఇంతకు అమ్మాయి పేరేమిట్రా" అంటూ ఇద్దరినీ అడిగాడు.

హాట్ పెర్ఫార్మెన్సెస్ తో హీటెక్కించిన కంటెస్టెంట్స్..ఏడ్చేసిన సదా

"బీబీ జోడి" డాన్స్ షో హిట్ అయ్యిందో లేదో కానీ "నీతోనే డాన్స్" షోలో  మాత్రం ప్రతీ వారం అద్భుతః అన్నట్టుగా ఉన్నాయి పెర్ఫార్మెన్సెస్. ఇక నెక్స్ట్ షో ప్రోమో చూస్తే ఎవ్వరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే అలా ప్రోమోని కట్ చేసారు. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో మంచి జోష్ నింపడానికి బీబీ జోడి కంటెస్టెంట్స్ కూడా యాడాన్ అయ్యారు. వాళ్ళు వీళ్ళు కలిసి దుమ్ము లేపేశారు. మంచి డాన్స్ తో పాటు అక్కడక్కడా క్రిస్పీగా గొడవలు, రొమాన్స్ మామూలే.. నెక్స్ట్ వీక్  'తీన్ కా తడ్కా' అంటూ ఒక కొత్త కాన్సెప్ట్ ఇచ్చారు. ఇక స్టేజి మీద  మెహబూబ్  రాగానే శ్రీముఖి "విప్పెయ్, విప్పెయ్.. చొక్కా విప్పెయ్ సిక్స్ ప్యాక్ చూడాలి" అంటూ కామెడీ చేసింది.

రాబోయే బిడ్డ కోసం ఇప్పటినుంచి అన్నీ రెడీ చేసుకున్న నటి లహరి

బుల్లితెర ప్రేక్షకులకు లహరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో పద్ధతైన చీర కట్టుతో అత్తగారు మెచ్చుకునే  చక్కని పొందికైన  కోడలిగా కనిపించి అలరించింది. చిన్న చిన్న కళ్ళతో చాల ముద్దుగా ఉంటుంది లహరి. ఐతే ప్రస్తుతం లహరి నటనకు కొంచెం బ్రేక్ ఇచ్చింది.ఐతే తొమ్మిదో నెల గర్భంతో ఉన్న లహరి త్వరలో బిడ్డను కనబోతున్న టైం కాబట్టి  బ్రేక్ తీసుకుని రెస్ట్ తీసుకుంటోంది.  మరి లహరికి  కుటుంబ సభ్యులు,  స్నేహితులంతా కలిసి  సీమంతం  వేడుకను నిర్వహించారు. ఇక వైఫ్ అండ్ హజ్బెండ్ ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్సుల్లో సందడి చేశారు.  లహరి సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆట సందీప్, జ్యోతి పెర్ఫార్మెన్స్ "రోమాంచమ్" అన్న కంటెస్టెంట్స్

నీతోనే డాన్స్ ఈ వారం ప్రసారమైన ఆదివారం ఎపిసోడ్ లో ఆట సందీప్, జ్యోతి చేసిన అమేజింగ్ పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. ఇక అమరదీప్ - తేజు వీళ్లకు  9 ఇచ్చారు. అమరదీప్ మాట్లాడుతూ "సందీప్ మీరు బాగా చేశారు కానీ వదిన డాన్స్ మాత్రం అంతగా అనిపించలేదు , ఎనర్జీ తగ్గిపోయింది.. లిరిక్స్ కూడా పడలేదు" అని చెప్పేసరికి. జ్యోతి, సందీప్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. "చూడండి మీరు కూడా కావాలంటే నన్ను అనుమానించొద్దు" అన్నాడు. "ఎనెర్జీ గురించి జ్యోతితో ఎవరూ మాట్లాడొద్దు..ప్లీజ్  " అన్నాడు సందీప్ "తను ఎప్పుడూ చెబుతూ ఉంటుంది తానొక మ్యారీడ్ లేడీ, ఒక బాబు ఉన్నా కూడా ఇంకా ఆమె డాన్స్ చేస్తూనే ఉంది.. నేను తన ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్పిన ప్రతీసారి ఆమె ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తోంది. నేను ఇంకా ఎనెర్జీగా చేయాలంటూ తిడుతూనే ఉన్నా.. ఈ రోజు మాత్రం జ్యోతి నాకన్నా ఎనర్జిటిక్ గా చేసింది. ఇది మాత్రం నా అభిప్రాయం..నువ్వు 9 మార్క్స్ ఇచ్చినా కూడా నేను 10 మార్క్స్ గానే అనుకుంటా.. ఆమె చేయగలదు, చేస్తుంది.