Top Stories

మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. సమరానికి సిద్దమవుతున్న పార్టీలు

తెలంగాణలో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి సంవత్సరన్నరపైగా అవుతుండటం, పరిషత్‌ల గడువు ముగిసి సంవత్సరం పూర్తవుతుండటంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండి, నిధులు రాక అభివృద్ధి కుంటుపడింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్‌ తీర్మానం చేయడంతో అందరి దృష్టి స్థానిక సంస్థలపై పడింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలోనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఉండాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆలస్యమవుతూ వచ్చింది. అయితే తమిళనాడు వంటి రాష్ర్టాల్లో ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తుండటంతో ఇప్పుడు అదే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిచాలని భావిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారవుతున్నట్లు తెలుస్తుండగా, రేపో.. మాపో ఆర్డినెన్స్‌ వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు ఇప్పటికే ఎన్నికలను పూర్తి చేయడానికి మూడు నెలల గడువు ఇవ్వగా.. ఆలోపే పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ప్రస్తుతానికి పంచాయతీలకంటే ముందు పరిషత్‌ ఎన్నికలే నిర్వహిస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే ఓటర్‌ జాబితా సిద్ధం కాగా.. కావాల్సిన బ్యాలెట్‌ బాక్సులు, సామగ్రి, ప్రింటింగ్‌ కూడా అధికారులు పూర్తిచేసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా.. మెజారిటీ స్థానాలను ఆ పార్టీనే దక్కించుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ పార్టీకి సింహభాగం స్థానాలు దక్కాయి. వేరే పార్టీల్లో గెలిచిన వారు సైతం అప్పట్లో బీఆర్‌ఎస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంతమంది బీఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినప్పటికీ..  ఇంకా బీఆర్‌ఎస్‌లో తాజా మాజీ ప్రజాప్రతినిధుల శాతం అధికంగానే ఉంది. గ్రామాల్లో ఇంకా ఆ పార్టీ కేడర్‌ బలంగా ఉండగా, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచిన ఊపుతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ను బలోపేతం చేసుకోవడం వంటి పరిణామాలతో పోటీ హోరాహోరీగా ఉండనుంది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చామనే అంశంతో కాంగ్రెస్‌ ముందుకు వెళ్లనుంది. గ్రామాలు, పట్టణాల్లో ఇటీవలి కాలంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఎక్కువ సంఖ్యలో నిర్మించడం, సన్న బియ్యం పథకం వంటి అంశాలు తమకు కలిసి వస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. అలాగే బీఆర్‌ఎస్‌ తమకున్న కేడర్‌, గతంలో చేసిన పనులు, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని అభిప్రాయపడుతోంది. ఇప్పటికే ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తరచూ పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు అమలయ్యే పక్షంలో తమ వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంది. ఇక గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది. ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగడానికి స్థానిక సంస్థల ఎన్నికలు గేట్‌వేగా ఉంటాయని ఆ పార్టీ నాయకత్వం అనుకుంటోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకును సద్వినియోగం చేసుకుని.. సరైన అభ్యర్థులను నిలిపితే ఫలితం ఉంటుందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పంచాయతీలను పార్టీ గుర్తుపై కాకుండా ఇతర గుర్తులపై గెలుచుకోవాల్సి ఉంటుంది. పరిషత్‌ ఎన్నికల్లో మాత్రం పార్టీ గుర్తులు ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్‌ పార్టీ ముందుగా పరిషత్‌ ఎన్నికలను నిర్వహించి, ప్రభుత్వ పని తీరుకు గెలుపు అని చెప్పాలని భావిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తుండగా.. గతంలో రిజర్వేషన్లు తక్కువగా ఉన్న సమయంలోనూ బీసీలు జనరల్‌ స్థానాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. ఒకవేళ బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వలేని పక్షంలో పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ గతంలో భావించింది. దానిపై కొంత విమర్శలు రావడంతో ఎలాగైనా చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే కేబినెట్‌ తీర్మానం చేసింది. దాంతో ఆశావహులు అప్పుడే పల్లెల్లో ముమ్మరంగా ప్రచారం మొదలుపెట్టేస్తున్నారు. మరి ఈ ట్రయాంగిల్ ఫైట్లో అధికార పక్షం విపక్షాలకు ఎలా చెక్ పెడుతుందో చూడాలి.
మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. సమరానికి సిద్దమవుతున్న పార్టీలు Publish Date: Jul 15, 2025 5:05PM

ఏపీ మద్యం స్కాం.. ఏ క్షణంలోనైనా మిథున్ రెడ్డి అరెస్టు?!

వైసీపీ సీనియర్ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిలు మంజూరు చేయలేమని పేర్కొంటూ కోర్టు ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో పీకల్లోతు ఇరుక్కున్న మిథున్ రెడ్డి ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు   సుప్రీంను ఆశ్రయించారు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని పేర్కొంటూ.. అప్పటి వరకూ అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మిథున్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ఇప్పుడు  ఏపీ హైకోర్టు మిథున్ రెడ్డి  ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ మంగళవారం (జులై 15) తీర్పు ఇచ్చింది. దీంతో మిథున్ రెడ్డికి అరెస్టు నుంచి రక్షణ లేకుండా పోయింది. దీంతో ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.   మద్యం కుభకోణంలో పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఇంకా కొంత మంది పరారీలో ఉన్నారు.ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా అరెస్టయ్యారు. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది. అయితే మిథున్ రెడ్డి బెయిలు పిటిషన్ ను సుప్రీం తిరస్కరించడంతో ఆయన ఏ క్షణమైనా అరెస్టయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 
ఏపీ మద్యం స్కాం.. ఏ క్షణంలోనైనా మిథున్ రెడ్డి అరెస్టు?! Publish Date: Jul 15, 2025 3:18PM

గండికోటలో మైనర్ విద్యార్థిని దారుణ హత్య

వైయస్సార్ కడప జిల్లాలో  ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో దారుణం జరిగింది.ఇక్కడ ఇంటర్ విద్యార్థిని   దారుణ హత్యకు గురైంది. హత్య గురైన బాలిక మృతదేహం ముళ్ళపొదల్లో నగ్నంగా పడి ఉండడం  చూస్తే హంతకుడు హత్యాచారానికి పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తం అవు తున్నాయి.అందిన సమాచారం మేరకు  బాలిక ప్రొద్దుటూరులోని  గీతం జూనియర్ కాలేజీలో  ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం 8 గంటలకు కళాశాలకు వెళుతున్నట్లు చెప్పి   ఇంటి నుంచి వెళ్లింది. ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి గ్రామానికి చెందిన లోకేష్,  అదే గ్రామానికి చెందిన  బాలికను తన ద్విచక్ర వాహనంపై ఉదయం  ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో గండికోట కు తీసుకువెళ్లాడు. తరువాత 10:47 గంటల సమయంలో లోకేష్ ఒక్కడే తన ద్విచక్ర వాహనంపై గండికోట నుంచి వెనక్కు వచ్చేసినట్లు  సిసి ఫుటేజీలో రికార్డు అయ్యింది. కాగా ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో   బాలిక కాలేజీకి రాలేదని  కళాశాల యాజమాన్యం ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు . ఉదయం 8 గంటలకే తమ కుమార్తె కాలేజీకి వచ్చిందని  చెప్పిన కుటుంబ సభ్యులు ఆ వెంటనే కాలేజీకి వచ్చి విచారించారు.  లోకేష్ ఆ బాలికను బైక్ పై తీసుకు వెళ్లాడని తెలియగానే వారు గండికోటకే వెళ్లి ఉంటారని భావించిన  కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి , గండికోటకు వెతికేందుకు వెళ్లారు. సాయంత్రం వరకు వైష్ణవికి సంభంధించిన ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు.సాయంత్రం గండికోట పై భాగంలో మైనర్ విద్యార్థిని కాలేజీ బ్యాగు , చున్ని కనిపించాయి. దీంతో ఆ చుట్టుపక్కల వెతికినా మైనర్ విద్యార్థిని ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిసింది. అతని ఇచ్చిన సమాచారం మేరకు మైనర్ బాలిక మృతదేహం ఉన్న ప్రాంతాన్ని పోలీసులు, కుటుంబ సభ్యులు మంగళవారం (జులై 15) ఉదయం గుర్తించారు. మైనర్ విద్యార్థినిని  హత్య చేసినట్లు నిర్ధారించుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
గండికోటలో మైనర్ విద్యార్థిని దారుణ హత్య Publish Date: Jul 15, 2025 2:47PM

సంజయ్ దత్ ఆ పని చేసి ఉంటే ముంబై పేలుళ్లు జరిగి ఉండేవి కావా?

బాలీవుడ్ నటుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ దత్  ముంబై పేళ్లలకు సంబంధించి  మరోసారి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సంజయ్‌దత్ తలుచుకుని ఉంటే ముంబై పేలుళ్లను ఆపి ఉండేవారని ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తాజాగా ఓ నేషనల్  మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ వాణిజ్య రాజధాని ముంబైలో 1993లో జరిగిన పేలుళ్ల కేసును వాదించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తాజాగా  చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. న్యాయవాదిగా పలు సంచలన కేసులను వాదించిన ఉజ్వల్ నికమ్ ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ముంబై పేలుళ్ల గురించి, నటుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ దత్ గురించి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.   1993, మార్చి 12న ముంబైలో వరుస పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లకు కొన్ని రోజుల ముందు సంజయ్ ఇంటికి ఆయుధాలతో నిండిన ఓ వ్యాన్ వచ్చింది. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూం సలేం తీసుకొచ్చిన ఆ వ్యాన్‌లో హ్యాండ్ గ్రనేడ్లు, ఏకే 47 తుపాకులు, బాంబులు ఉన్నాయి. వాటిని సంజయ్ పరిశీలించారు. వాటిల్లో నుంచి ఒక ఏకే 47 తుపాకీని తీసుకుని తన దగ్గర ఉంచుకున్నారు. అయితే..అప్పుడే ఆ ఆయుధాల వ్యాన్ గురించి పోలీసులకు సంజయ్ సమాచారం ఇచ్చి ఉంటే ఆ పేలుళ్లు జరిగి,  అంత మంది చనిపోయి ఉండేవారు కాదని ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు. ముంబై పేలుళ్లతో సంబంధం ఉందనే కారణంతో సంజయ్‌పై అప్పట్లో టాడా కేసు నమోదైంది. సంజయ్ ఉగ్రవాది అని ఆరోపణలు వచ్చాయి. కోర్టు మాత్రం సంజయ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం   రుజువు కావడంతో సంజయ్‌ను దోషిగా నిర్దారిస్తూ కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. పుణెలోని యరవాడ జైల్లో శిక్ష అనుభవించిన సంజయ్ 2016లో విడుదల అయ్యాడు. కాగా..  న్యాయవాది ఉజ్వల్ నికమ్ బీజేపీలో చేరి 2024లో ముంబై నార్త్-సెంట్రల్ లోక్‌సభ్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆయనను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న సంజయ్‌దత్‌తో పాటు బీజేపీ అధిష్టానం సైతం ఉజ్వల్ వ్యాఖ్యలతో ఇరకాటంలో పడినట్లైంది.
 సంజయ్ దత్ ఆ పని చేసి ఉంటే ముంబై పేలుళ్లు జరిగి ఉండేవి కావా? Publish Date: Jul 15, 2025 2:27PM

లడ్డూ ప్రసాదం కల్తీ కేసు.. వైవీ సుబ్బారెడ్డిలో అరెస్టు భయం

తిరుమల దేవుడి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ కేసులో సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ కల్తి వ్యవహారంలో వాస్తవాలను వెలికి తీయడం లక్ష్యంగా సుప్రీం కోర్టు గత ఏడాది అక్టోబర్ లో స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ సిట్ కు సీబీఐ డైరెక్టర్ నేతృత్వం వహిస్తుండగా, రాష్ట్ర పోలీసు శాఖ, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ అధారిటీ అధికారులు సభ్యులుగా ఉన్నారు.  సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యింది.  తన దర్యాప్తులో కనుగొన్న విషయాలను సిట్ సుప్రీం కోర్టుకు సీల్డ్ కవర్ లో నివేదించింది.  లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీ కేసుకు సంబంధించి సిట్ 14 మందిని అరెస్టు చేసింది. అరెస్టు చేసిన వారిలో  బోలెబాబా డెయిరీ, ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీ డైరెక్టర్లు, సిబ్బంది ఉన్నారు. అలాగే సిట్ తన దర్యాప్తులో బాగంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న సహా పలువురు టీటీడీ ఉద్యోగులను విచారించింది.  ఈ విషయాన్ని కూడా సిట్ సుప్రీంకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. అంతే కాకుండా ఈ కేసులో నిందితులు దర్యాప్తును అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలను సవివరంగా ఆ నివేదికలో పొందుపరిచింది.   ఈ నేపథ్యంలోనే టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ కేసులో దర్యాప్తు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మితిమీరి జోక్యం చేసుకుని రాజకీయ ఒత్తిడిని తీసుకువస్తోందని ఆయన తన పిటిషన్ లో ఆరోపించారు. కాగా సుబ్బారెడ్డి బెయిలు పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు లిస్ట్ చేయవలసిందిగా.. ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ నిలయ్ విపిన్ చంద్రఅంజారియాల ధర్మాసనం కోరింది. అదలా ఉంచితే.. లడ్డూ ప్రసాదం తీయారీలో వినియోగిచిన నెయ్యిలో కల్తీ వ్యవహారంలో తనను అరెస్టు చేస్తారన్న భయం సుబ్బారెడ్డిలో పెరిగిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
లడ్డూ ప్రసాదం కల్తీ కేసు.. వైవీ సుబ్బారెడ్డిలో అరెస్టు భయం Publish Date: Jul 15, 2025 2:07PM

తాడిపత్రిలో హైటెన్షన్.. పెద్దారెడ్డి టూర్‌కి అనుమతి నిరాకరణ

తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సొంత ఇంట్లో అడుగుపెట్టే భాగ్యం ఇప్పట్లో లేనట్లు కనిపిస్తోంది. ఆయన ఎప్పుడు తాడిపత్రి బయలుదేరినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతోంది. ఆయన తాడిపత్రి ఎంట్రీకి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు . తాజాగా మంగళవారం (జులై  15)న మరో సారి పోలీసులు ఆయన తాడిపత్రిలో తలపెట్టిన కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. దీంతో   తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి తాడిపత్రి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఎన్నికల సమయంలో కూటమి సర్కార్ ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని తాడిపత్రిలో నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఈ  కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలని పెద్దారెడ్డి పోలీసులను కోరారు. అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సైతం ఆ జిల్లా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి లేఖ రాశారు. కాగా గతంలో పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చిన సందర్భంలో  శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కావడంతో   పోలీసులు ఆయన్ను వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. తాడిపత్రికి రావొద్దని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డికి నోటీసులు అందించారు.   తాడిపత్రిలో మంగళవారం (జులై 15)మంత్రుల ప్రొగ్రాం ఉందని.. శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉండటంతో వైసీపీ నేతలు తమ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు నోటీసుల్లో  పేర్కొన్నారు. ఈనెల 18 లేదా ఆ తర్వాత కార్యక్రమం నిర్వహించుకోవచ్చని సూచించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చేసేది ఏమి లేక పెద్దారెడ్డి వెనక్కి తగ్గారు. ఈ నెల 18న ఈ కార్యక్రమాన్ని జరుపుతామని పెద్దారెడ్డి తెలిపారు. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి , వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య  మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విధంగా వారిద్దరి మధ్య వైరం ఉన్న సంగతి తెలిందే.  కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారు అన్న సమాచారాన్ని విహార యాత్రలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి అక్కడి టీడీపీ కార్యకర్తలు సమాచారం ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన హుటాహుటిన ప్రత్యేక విమానంలో విహారయాత్ర నుంచి తాడిపత్రి బయలుదేరినట్లు సమాచారం. ఒకవేళ పెద్దారెడ్డి తన తాడిపత్రి పర్యటనను వాయిదా వేసుకోకపోయుంటే అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకునేవి అంటున్నారు.
తాడిపత్రిలో హైటెన్షన్.. పెద్దారెడ్డి టూర్‌కి అనుమతి నిరాకరణ Publish Date: Jul 15, 2025 12:37PM

బనకచర్లపై చర్చకునో .. ఏపీకి రేవంత్ సర్కార్ బిగ్ షాక్

బనకచర్ల ప్రాజెక్టు పై చర్చించడానికి తెలంగాణ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. ఏపీ ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం బుధవారం జరగ నుంది. ఈ సమావేశంలో బనకచర్లపై విస్తృతంగా చర్చించాలన్నది ఏపీ ప్రతిపాదన. అయితే ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ.. బనకచర్లపై చర్చకు రేవంత్ సర్కార్ నిర్ద్వంద్వంగా నో అంది. ఈ ప్రాజెకటుపై చర్చకు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రం బుధవారం (జులై16)న సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే బనక చర్ల అజెండాతో ఈ సమావేశం ప్రతిపాదన వచ్చినదే ఏపీ సర్కార్ నుంచి. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులనూ ఢిల్లీకి రావాల్సిందిగా కోరింది. అయితే బనకచర్లపై అయితే చర్చించేందుకుర ఏమీ లేదని తెలంగాణ సర్కార్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ కేంద్రానికి లేఖ రాసింది. గత రెండు రోజులుగా ఉభయ తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఢిల్లీలో భేటీపై రెండు రాష్ట్రాలలో విస్తృత చర్చ జరిగిన సంగతి తెలిసిందే.   ఏపీ ఇచ్చిన బనకచర్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ సర్కార్ కేంద్రానికి మంగళవారం (జులై 15) ఉాదయం లేఖ రాసింది. ఆ లేఖలో  బుధవారం (జులై 16) సమావేశంలో బనకచర్లపై చర్చించేందుకు విముఖత వ్యక్తం చేసింది.  యి.
బనకచర్లపై చర్చకునో .. ఏపీకి రేవంత్ సర్కార్ బిగ్ షాక్ Publish Date: Jul 15, 2025 11:27AM

డ్రగ్స్ దందాలో పోలీసు అధికారి కుమారుడు!?

 హైదరాబాద్ డ్రగ్స్ దందాలో ఎస్ఐబీ  అధికారి కుమారుడి పాత్రను ఈగిల్ అధికారులు గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేని అరెస్టు తర్వాత పోలీసులు ఆ నెట్ వర్క్ పై దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఎస్ఐబీ అధికారి కుమారుడి పాత్ర తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారం ఈగిల్ అధికారులను షాక్ కు గురి చేసింది. ఈ పోలీసు అధికారి కొడుకు పాత్ర పై ఆరా తీస్తున్న క్రమంలో మరికొన్ని విషయాలు బయటపడ్డాయి. 2024లో  ఎస్ఐబీ అధికారి కుమారుడు డ్రగ్స్ వ్యవహారంలో ఓ సారి పట్టుబడినా పోలీసులు  అరెస్టు చేయకుండా వదిలేసిన విషయం కూడా ఈగిల్ అధికారులు గుర్తించారు. ఈ ఎస్ఐబీ పోలీస్ అధికారి ప్రస్తుతం ఓఎస్డీ గా ఎస్ఐబీ లోనే కొనసాగుతున్నారు. ఈ ఎస్ఐబీ అధికారిని ఫోన్ టాపింగ్ కేసులో ప్రాథమికంగా అనుమానించినప్పటికి ఆ తర్వాత ఆయన అప్రూవర్ గా మారాన్న ప్రచారం జరిగింది.  ఫోన్ టాపింగ్ కేసులో ఈ అధికారి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు చెబుతున్నారు. అదలా ఉంటే తాజాగా ఆయన కుమారుడి పేరు డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తోంది.  డ్రగ్స్ వ్యవహారంలో  మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేనితో పాటు  అరెస్టు అయిన ఆరుగురిని ఈగిల్ అధికారులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో మరికొంత మంది సెలబ్రిటీలతో పాటు ప్రముఖుల చిట్టా బయటపడే అవకాశం ఉందని అంటున్నారు.   ఈగిల్ అధికారులు వారం రోజుల కిందట వారికి అందిన సమాచారం మేరకు కొంపల్లి లోని మల్నాడు కిచెన్ రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేని తో పాటు  మరో ఆరుగురిని అరెస్టు చేశారు.   ఈ సందర్భంలో ఈగిల్ పోలీసులకు రాహుల్ తేజ గురించి తెలిసింది. అతడి గురించి ఆరా తీసినప్పుడు 2024 జనవరిలో   నిజామాబాద్ పోలీసులు కూడా డ్రగ్స్ కేసులో   ఏ3 నిందితుడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు.   కాగా ఈగిల్ అధికారుల దర్యాప్తులో రాహుల్ తేజ డ్రగ్స్ సరఫరాదారనీ, అతడు డ్రగ్స్ ను ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ల నుంచి తీసుకువచ్చేవాడని  గుర్తించారు. అలాగే ఈగిల్  దర్యాప్తులో రాహుల్ తేజ ఎస్ఐబీ లో రిటైర్ అయ్యి , ప్రస్తుత్తం ఓఎస్డీగా పని చేస్తున్న ఓ అధికారి కుమారుడని తేలింది. దీంతో ఈగిల్ అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో  ఎస్ఐబీ అధికారి కుమారుడి వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టి కి తీసుకువెళ్లి అతని పై చర్యలకు తీసుకునేందుకు ఈగిల్ అధికారులు రెడీ అవుతున్నారు. అయితే తాజాగా సూర్య అమ్మినేని కేసులో అరెస్టు చేస్తారా లేదా నిజామాబాద్ కేసులలో అరెస్టు చేస్తారా అనేది చూడాల్సి ఉంది.  
డ్రగ్స్ దందాలో పోలీసు అధికారి కుమారుడు!? Publish Date: Jul 15, 2025 11:01AM

ఇద్దరు కీలక మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టు ముక్త భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినఆపరేషన్ కగార్ సత్ఫలితాలనే ఇస్తోందని అంటున్నాయి భద్రతా బలగాలు. ఆపరేషన్ కగార్ కారణంగా పలువురు మావోయిస్టులు పలు ఎన్ కౌంటర్లలో హతమయ్యారు. హతమైన నక్సల్స్ లో కీలక మావోయిస్టు నేతలు ఉన్నారు. ఇక పోతే ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టు పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు సహా పెద్ద సంఖ్యలో నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. అందులో భాగంగానే తెలంగాణకు చెందిన ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు మంగళవారం (జులై 16)న లొంగిపోనున్నారు.  తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్న, బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ రామగుండం సీపీ ఎదుట లొంగిపోనున్నారు.  వీరి లొంగుబాటు రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బేనని పరిశీలకులు అంటున్నారు.   ఆపరేషన్ కగార్ కారణంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయిన సంగతి తెలిసిందే. లొంగిపోయిన నక్సల్స్ కు ప్రభుత్వం పాతిక వేల రూపాయల తక్షణ సాయం, వైద్యం, పునరావాసం వంటివి కల్పిస్తున్నది. 
ఇద్దరు కీలక మావోయిస్టుల లొంగుబాటు Publish Date: Jul 15, 2025 10:36AM

హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి

హైదరాబాద్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. మలక్ పేట శాలివాహన్ నగర్ పార్క్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించారు. మృతుడిని చందూ రాథోడ్ గా గుర్తించారు. సీపీఐ నాయకుడైన చంద్ర రాథోడ్ మంగళవారం (జులై  15) ఉదయం మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని తన నివాసానికి వెడుతుండగా అప్పటికే కారులో వచ్చి చందూ రాథోడ్ వెళ్లే మార్గంలో కాపు కాచిన నలుగురు దుండగులు ఆయన కంట్లో కారం చల్లి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి కారులో పరారయ్యారు.   ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన చందు రాథోడ్ అక్కడికక్కడే మరణించారు. పాతకక్షల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.కాగా చందు రాథోడ్ పై కాల్పులు జరిపిన వారు కూడా వామపక్ష భావాలున్న నాయకులేనని చెబుతున్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి సీపీఐఎంఎల్ కు చెందిన రాజేష్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి Publish Date: Jul 15, 2025 9:40AM

గతంలో కంటే నేటి జనరేషన్ లో విడాకులు ఎక్కువయ్యాయి.. కారణాలు ఇవే..!

నేటి జనరేషన్ లో  యువ జంటలలో విడాకులు తీసుకోవడం పద్దతి వేగంగా పెరుగుతోంది. గతంలో వివాహం చేసుకుంటే జీవితాంతం కలిసుండేవారు. కానీ ఇప్పుడు చాలా జంటలు వివాహం అయిన కొన్ని సంవత్సరాలు, నెలల తర్వాత విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్,  పారుపల్లి కశ్యప్   విడిపోతున్నట్లు ప్రకటించారు. 7 సంవత్సరాల వివాహ బంధాన్ని ఇంతటితో ముగిస్తున్నట్టు స్పష్టం చేశారు. కేవలం సెలబ్రిటీలే కాదు.. నేటి కాలంలో సాధారణ కుటుంబాలలో కూడా వివాహం తర్వాత విడాకుల తంతు చాలా ఎక్కువగానే జరుగుతోంది.  యువ జంటలు విడిపోవడానికి అనేక సామాజిక, మానసిక,  ఆచరణాత్మక కారణాలు ఉండవచ్చు. అలాంటి 5 ప్రధాన కారణాలు తెలుసుకుంటే..  సహనం  ఓర్పు.. నేటి యువ జంటలలో  మునుపటి కాలంతో పోలిస్తే సహనంలో చాలా లోపాలు కలిగి ఉన్నారు. చిన్న సమస్యలకు వాదించుకోవడం,  దానిని పరిష్కరించుకోవడానికి  బదులుగా సంబంధాన్ని వదిలివేయడం ఒక సాధారణ ధోరణిగా మారింది. గొడవ నుండి పారిపోవాలనే ధోరణి కారణంగా బార్యాభర్తల మధ్య విడాకుల సమస్యకు దారితీస్తోంది.  స్వేచ్ఛ,  సెల్ఫ్ స్పేస్.. నేటి యువకులు ఎక్కువ స్వేచ్ఛ,  పర్సనల్ స్పేస్ కావాలని  కోరుకుంటారు. వివాహం తర్వాత, భాగస్వామి యొక్క అంచనాలు వారి స్వేచ్ఛకు అడ్డంకిని సృష్టిస్తే వారు దానిని తట్టుకోలేక విడాకులు తీసుకోవడం లేదా విడిపోయే మార్గాన్ని ఎంచుకోవడం చేస్తున్నారు. కెరీర్,  ఆర్థిక ఒత్తిడి.. పెరుగుతున్న పోటీ, కెరీర్ గురించి ఆలోచనలు,  ఆర్థిక అస్థిరత కారణంగా యువ జంటలు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడి సంబంధాలను ప్రభావితం చేస్తుంది.  కొన్నిసార్లు పరస్పర అవగాహన లేకపోవడం జరుగుతుంది. సోషల్ మీడియా,  బాహ్య ప్రభావాలు.. సోషల్ మీడియాలో కనిపించే ఆదర్శ జీవితం,  గ్లామర్ జంటలలో తప్పుడు అంచనాలను ఏర్పరుస్తాయి. వారు తమ సంబంధాన్ని ఇతరులతో పోల్చుకుంటారు. ఇది అసంతృప్తికి,  భార్యాభర్తల మధ్య  దూరం ఏర్పడటానికి  దారితీస్తుంది. కమ్యూనికేషన్ గ్యాప్,  భావోద్వేగ సంబంధం లేకపోవడం.. సంబంధాలకు కమ్యూనికేషన్ అతిపెద్ద పునాది. కానీ భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ తగ్గడం ప్రారంభించినప్పుడు, అపార్థాలు పెరుగుతాయి. ఇది కాకుండా ఎమోషనల్ బాండింగ్ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సంబంధం లేకపోవడం కూడా సంబంధం విచ్ఛిన్నానికి దారితీస్తుంది.                       *రూపశ్రీ.
గతంలో కంటే నేటి జనరేషన్ లో విడాకులు ఎక్కువయ్యాయి.. కారణాలు ఇవే..! Publish Date: Jul 15, 2025 9:30AM

వర్షాకాలంలో విషజ్వరాల బెడద రాకూడదంటే తీసుకోవలసిన  జాగ్రత్తలు..!

  వర్షాకాలం చాలామందికి బాగా ఇష్టంగా ఉంటుంది.  వాతావరణం బాగా చల్లగా ఉంటుందనే కారణంతో దీన్ని ఇష్టపడతారు. అయితే వర్షాకాలం విషజ్వరాలను,  వైరల్ ఇన్ఫెక్షన్లను మోసుకొచ్చే కాలం. ఈ కాలంలో విషజ్వరాలు స్వైర విహారం చేస్తాయి. అందుకే ఈ సీజన్ మార్పుకు అనుగుణంగా అలవాట్లు మార్చుకోవాలి.  జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా విషజ్వరాలలో డెంగ్యూ ప్రముఖమైనది. లో ప్లేట్ లెట్ ల కౌంట్ తగ్గుతుంది. ప్లేట్‌లెట్ కౌంట్ 10,000 కంటే తక్కువగా ఉంటే, దానిని పెంచాల్సిన అవసరం ఉంటుంది. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఆహారం,  శుభ్రమైన నీటిని మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.   త్రాగే నీరు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నీరు స్వచ్చంగా లేవని అనిపిస్తే  వాటిని మరిగించి చల్లార్చి తీసుకోవాలి. వర్షాకాలంలో ఫ్లూ ఎక్కువగా వస్తుంది. దీనివల్ల జ్వరం,  శరీర నొప్పులు వస్తాయని ఆయన అన్నారు. దీనితో పాటు జ్వరం చాలా ఎక్కువగా ఉండి, తలనొప్పి నిరంతరంగా ఉంటే డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు నాలుగు నుండి ఐదు గంటల్లోపు మందులు తీసుకున్న తర్వాత జ్వరం తగ్గితే, మలేరియా వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.  నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో  టైఫాయిడ్, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా వంటివి ముఖ్యమైనవి. వాటిని నివారించడానికి  ఎల్లప్పుడూ మరిగించి చల్లార్చిన లేదా  ఫిల్టర్ చేసిన  నీటిని తాగాలి.  నీటి పాత్రను శుభ్రంగా ఉంచుకోవాలి. నీటి పాత్ర మీద ఎల్లప్పుడూ కప్పి ఉంచాలి.  తినడానికి ముందు,  తిన్న తర్వాత, మలవిసర్జన చేసిన తర్వాత  నీటిని తాకే ముందు సబ్బుతో చేతులు బాగా కడుక్కోవాలి. పిల్లలు  క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్లు ఆటల నేపథ్యంలో చేతులను ఉపయోగించే విధానం వేరుగా ఉంటుంది. ఆహారం ఎప్పుడూ బాగా ఉడికినదై ఉండాలి.  పచ్చి లేదా సగం ఉడికించిన ఆహారాన్ని నివారించాలి. పండ్లు,  కూరగాయలను తినేముందు శుభ్రమైన నీటితో కడగాలి. బయట ఆహారాన్ని తినడం మానేయడం మంచిది. బావులు, నదులు లేదా చెరువుల దగ్గర మలవిసర్జన చేయవద్దు. నీటి వనరులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.  ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది దోమలు,  బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది. స్థానిక ఆరోగ్య కేంద్రం నుండి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి సమాచారం పొందాలి. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలి.  వీలైనంత వరకు పరిశుభ్రతే శ్రీరామ రక్ష అనే విషయం మరవకూడదు.  ఈ చర్యలు తీసుకోవడం ద్వారా, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను చాలా వరకు నివారించవచ్చు. విరేచనాలు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..    
వర్షాకాలంలో విషజ్వరాల బెడద రాకూడదంటే తీసుకోవలసిన  జాగ్రత్తలు..! Publish Date: Jul 15, 2025 9:30AM

తెలంగాణలో ఐదు రోజుల పాటు వానలే వానలు

తెలంగాణ వ్యాప్తంగా ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ, వర్షాలు మాత్రం ఆశించిన విధంగా కురవలేదు. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.   ఇక ఈ నెల 14 నుంచి రుతుపవనాలు బలహీన పడటంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడింది. తీవ్ర ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న చల్లటి కబురు తెలిపింది. ఈ నెల 17 నుంచి  22వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా  విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  
తెలంగాణలో ఐదు రోజుల పాటు వానలే వానలు Publish Date: Jul 15, 2025 9:22AM

ప్రజాసేవకే ప్రథమ ప్రాధాన్యత.. గోవా గవర్నర్ అశోకగజపతి రాజు

తెలుగుదేశం సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమిస్తూ  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  గోవా గవర్నర్ గా నియమితులైన తరువాత అశోక్ గజపతిరాజు విజయనగరంలో సోమవారం (జులై 14) మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన తన రాజకీయ జీవితంలో తాను ఎన్నడూ అవకాశాల కోసం అర్రులు సాచలేదనీ, వాటి వెంట పరుగెత్తలేదనీ చెప్పారు.  పార్టీ నాయకత్వం, ప్రజలు తనకు అప్పగించిన   బాధ్యతను శ్రద్ధగా, నిబద్ధతతో నిర్వహించానన్నారు. గోవా గవర్నర్‌గా తనను నియమించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పిన ఆయన  గోవా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు.   తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నానని, అయినప్పటికీ ప్రజా సేవకే ప్రాధాన్యత ఇచ్చానన్న అశోకగజపతి రాజు.. విజయనగరం రాజవంశం నుంచి వచ్చిన తాను, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజల కోసం పనిచేయడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాననీ, ఇప్పుడు గోవా గవర్నర్‌గా కూడా అదే లక్ష్యంతో ముందుకు సాగుతానన్నారు.  గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేస్తూ, ఆ సమయంలో తాను చేపట్టిన పనులు దేశ విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్నారు. 
ప్రజాసేవకే ప్రథమ ప్రాధాన్యత.. గోవా గవర్నర్ అశోకగజపతి రాజు Publish Date: Jul 15, 2025 6:17AM

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్

  ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన మద్రాసు హైకోర్టు జడ్జిగా ఉన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఆయన గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2023లో ఏపీ నుంచి మద్రాసుకు బదిలీ కాగా.. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.  ఏపీతో పాటు మరిన్ని రాష్ట్రాలకు కొత్త సీజేఐలు నియమించబడ్డారు. తెలంగాణ హైకోర్టు సీజేగా అపరేష్‌కుమార్‌ సింగ్, త్రిపుర హైకోర్టు సీజేగా ఎంఎస్ రామచంద్రరావు, రాజస్థాన్ హైకోర్టు సీజేగా కేఆర్ శ్రీరామ్ నియమితులయ్యారు.  ఈయన ఆంధ్రా యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి బీఎల్ పూర్తి చేశారు.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ Publish Date: Jul 14, 2025 9:30PM

దత్తన్నకు రిటైర్మెంట్.. ఇచ్చినట్లేనా.. ?

  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే, రాజకీయ నియామకాలపై దృష్టిని కేంద్రీకరించారు. అందులో భాగంగా, నిన్న (ఆదివారం) వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన నలుగురు ప్రముఖులను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ శ్రింగ్లా, కేరళ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త సి. సదానందన్ మాస్టర్‌, ప్రఖ్యాత చరిత్రకారిణి మీనాక్షి జైన్‌లు పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ అయిన వారిలో ఉన్నారు.అలాగే, ఈరోజు (సోమవారం) మూడు రాష్ట్రాలకు గవర్నర్‌‌లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్‌ ఘోష్‌,  గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు,లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తా‌లను రాష్ట్రపతి నియమించారు.  ఇందులో, గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక గజపతి రాజు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనూ, ప్రభుత్వంలోన, పలు హోదాల్లో పని చేశారు. అశోక్ గజపతి రాజు ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎన్డీఆర్, చంద్రబాబు మంత్రివర్గాలలో కీలక శాఖలు నిర్వహించారు.2014 లో విజయనగరం ఎంపీగా గెలిచిన ఆయన ప్రధాని మోదీ ఫస్ట్ కాబినెట్’ లో కేబినెట్ మంత్రి హోదాలో విమానయాన శాఖ నిర్వహించారు. ఇదే సమయంలో, ప్రస్తుతం హర్యానా గవర్నర్’గా ఉన్న బండారు దత్తాత్రేయ స్థానంలో ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్’ను ఆ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమించారు. దత్తాత్రేయ  హిమాచల్’ ప్రదేశ్ 2019-21), హర్యానా (2021-25)గవర్నర్’గా మొత్తం ఏడేళ్లు సేవలు అందించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్’గా సుదీర్ఘ కాలం పని చేసిన దత్తాత్రేయ బీజేపీలోనూ పలు హోదాల్లో పని చేశారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. వాజ్ పేయ్, మోదీ ప్రభుత్వాలలో మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం హర్యానా గవర్నర్’గా ఉన్న ఆయన పదవీ కాలం ముగియటంతో ఇప్పుడు అక్కడ కొత్త గవర్నర్’ను నియమించారు.దీంతో.. ఇప్పుడు దత్తాత్రేయను మరో రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తారా లేక 78 ఏళ్ల దత్తన్నకు రిటైర్మెంట్’ ఇస్తారా అనేది, చూడవలసి వుంది.ఇక.. రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా భావించే గవర్నర్‌ పదవిని చేపట్టిన వారిలో తెలుగువారు చాలా మందే ఉన్నారు.  ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల రాజ్‌భవన్‌లో తెలుగు వారు గవర్నర్లుగా ఆశీనులయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా చేసిన ప్రముఖులు కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకూ మొత్తం 20 మంది వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా పనిచేశారు. అలాగే ఒడిశా, తమళినాడులోని తెలుగు కుటుంబాల్లో జన్మించిన ఇద్దరితోపాటు తెలుగింటి కోడలుగా వచ్చి ఒకరు కూడా గవర్నర్లుగా పనిచేశారు. అంతేకాకుండా వీరిలో పలువురు ఏకకాలంలో వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లుగా ఉన్నారు.ప్రస్తుతం అశోక గజపతి రాజుతో సహా ముగ్గురు తెలుగు వారు, మూడు రాష్ట్రాల ప్రధమ పౌరులుగా గౌరవం అందుకుంటున్నారు.
దత్తన్నకు రిటైర్మెంట్.. ఇచ్చినట్లేనా.. ?  Publish Date: Jul 14, 2025 9:12PM

ఏంటీ లోకేష్‌కి.. ప‌థ‌కాలు త‌యారు చేయ‌డం రాదా?

  లోకేష్ కి ప‌థ‌కాలు త‌యారు చేయ‌డం రాదా? మ‌రి స్టాన్ ఫ‌ర్డ్ లో ఏం నేర్చుకున్న‌ట్టు? అమ్మ‌కు వంద‌నం విష‌యంలో వైసీపీ చేస్తున్న ప్ర‌చారంలో అర్ధ‌మేంట‌ని చూస్తే.. ఫ‌స్ట్ మ‌న‌మంతా తెలుసుకోవ‌ల్సిన విష‌య‌మేంటంటే.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌, డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీముల ఆలోచ‌న‌లు లోకేష్ వే అని ఎంద‌రికి తెలుసు? వీటినే జ‌గ‌న్ కాపీ కొట్టాడ‌న్న సంగ‌తి మీకు తెలుసా? ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా.. లోకేష్ తండ్రి చాటు కొడుకు. ఆయ‌న ఆలోచ‌న‌లు నేరుగా ఏవీ అమ‌లు కానివ్వ‌ని అతి పెద్ద అడ్డంకి త‌న తండ్రే. తానేదైనా ఒక ప్ర‌తిపాద‌న చేస్తే.. దాన్ని అల‌వోక‌గా మ‌రో స్టైల్లోకి మార్చేస్తారు లోకేష్ తండ్రి చంద్ర‌బాబు. కార్య‌క‌ర్త‌ల‌కు జీతాల‌న్న‌దే వాలంటీర్లుగా జ‌గ‌న్ మార్చగా.. దాన్ని గ‌తంలో చంద్ర‌బాబు జ‌న్మ‌భూమి క‌మిటీలుగా మారిన విష‌యం గుర్తించిన వారు అరుదుగా ఉంటారు. ఇక డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీములు కూడా లోకేష్ తొలుత చేసిన ప్ర‌తిపాద‌న‌. ఇక వైయ‌స్ జ‌గ‌న్  ప‌థ‌క ర‌చ‌న సొంతంగా చేసేది ఏమీ ఉండ‌దు. దీని వెన‌క అతి పెద్ద క్రిష్టియ‌న్ లాబీ ఉంటుంద‌ని స‌మాచారం. జ‌గ‌న్ పైకి త‌న‌ బొమ్మ‌లేసుకుని.. ఇష్టారాజ్యం చేస్తుంటారు. కానీ, అదంతా ఒట్టిదే.. ఊరూరా ఉండే పాస్ట‌ర్లు.. ఈ ప‌థ‌కాల‌కు సంబంధించిన స‌మాచార‌మిచ్చి.. త‌గిన సూచ‌న‌లు చేస్తుంటారు. వీటి ద్వారా జ‌గ‌న్ అయిన దానికీ కాని దానికి, అర్ధం ప‌ర్ధం లేని ప‌థ‌కాలు ర‌చించేవార‌ని అంటారు. అలాగ‌ని ఈ కాపీ పేస్ట్ ప‌థ‌కాలు ఆయ‌న‌కి ఏమంత క‌లిసొచ్చిన ప‌రిస్థితి లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఇంత పెద్ద ఎత్తున ఎడా పెడా ప‌థ‌కాలిచ్చినా స‌రే ఆయ‌న గెల‌వ‌లేక పోయారు. అంటే ఆయ‌న ఈ ప‌థ‌కాల‌ను ఏమంత బాధ్య‌త కొద్దీ త‌యారు చేసిన‌వి కావు. ఒక‌ ఆలోచ‌న‌తో చేసిన‌వి కూడా కావు. అస‌లు జ‌గ‌న్ ప‌థ‌కాలంటే.. ఖ‌ర్చు భారం కింద లెక్క‌. పైపెచ్చు ఓట్ల కొనుగోలు వ్య‌వ‌హారంగానూ భావిస్తుంటారు. అందుకే ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయారని అంచనా వేస్తుంటారు నిపుణులు.. నిజానికి ఈ సంక్షేమ ప‌థ‌కాలకు ఆద్యుడు ఎన్టీఆర్. అప్ప‌టి నుంచే ప్ర‌జారంజ‌క ప‌థ‌కాల శ‌కం ఒక‌టి మొద‌లైంది. వాటినే ఆ త‌ర్వాత వైయ‌స్ కాపీ కొట్టారు. ఆ త‌ర్వాత కేసీఆర్ సైతం పేస్ట్ చేసేశారు. ఇక జ‌గ‌న్ సంగ‌తి స‌రే స‌రి. త‌న విస్తృ ప‌థ‌కాల త‌యారీలో అధిక శాతం.. క్రిష్టియ‌న్ లాబీ నుంచి వ‌చ్చిన స‌ల‌హా సూచ‌న‌ల‌కు త‌న సొంత త‌యారీలా క‌ల‌రింగ్ ఇచ్చి.. జ‌నాల్లోకి వ‌దిలేస్తుంటార‌ని అంటారు. నిజానికి ఒక ప‌థ‌కం అంటే అది ప్ర‌భుత్వానికి భారం కారాదు. పెట్టుబ‌డిగా ఉండాలి. అదెలాగో తెలియాలంటే మ‌న‌కు చంద్ర‌బాబు నూత‌న సృష్టి పీ- 4. ఇది నిజంగా ఒక అద్భుత‌మైన ప‌థ‌కం. ఇదే జ‌గ‌న్ త‌న హ‌యాంలో అర్ధం ప‌ర్ధం లేకుండా చేసిన ఖ‌ర్చు ఆయ‌న స్వార్ధానికి సంబంధించిన వ్య‌వ‌హారం. ఈ మొత్తం పెట్టుబ‌డి కింద‌ పెట్టి మంచి రాజ‌ధాని నిర్మాణం చేసి ఉంటే.. అది ఈ పాటికి ఎన్నో ప‌నుల‌ను సృష్టించి ఉండేది. ఈ విష‌యం గుర్తించారు కాబ‌ట్టే.. జ‌నం ఆయ‌న్ను తిప్పి కొట్టారు.అలాంటి జ‌గ‌న్ ఆయ‌న పార్టీ లోకేష్ త‌మ అమ్మ ఒడినే కాపీ కొట్టి అమ్మ‌కు వంద‌నంగా పేరు మార్చార‌ని చెప్పుకోవ‌డం చూస్తుంటే వింత‌గా ఉంద‌ని అంటారు విశ్లేష‌కులు.
ఏంటీ లోకేష్‌కి.. ప‌థ‌కాలు త‌యారు చేయ‌డం రాదా? Publish Date: Jul 14, 2025 8:27PM

తెలంగాణ కొత్త సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్‌ సింగ్

  తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్‌ సింగ్ నియమితులయ్యారు.ఈ మేరకు కొలీజియం సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కాగా, ఇంతకు ముందు త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ పనిచేశారు. ఇక ప్రస్తుత తెలంగాణ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా ఉన్న సుజయ్ పాల్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలిజియం సిఫార్సు చేసింది.  ప్రస్తుతం త్రిపుర హైకోర్టు సీజేగా సేవలందిస్తున్న ఆయన బదిలీపై తెలంగాణ హైకోర్టుకు వచ్చారు. అపరేష్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) 1965, జూలై 7న జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. అనంతరం 1990 నుంచి 2000 వరకూ యూపీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత 2001లో జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2012, జనవరి 24న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.  
తెలంగాణ కొత్త సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్‌ సింగ్ Publish Date: Jul 14, 2025 8:14PM

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ..జల వివాదం సద్దుమణిగేనా?

  తెలుగు రాష్ట్రాల్లోని జల వివాదలను చర్చించేందుకు  కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఆహ్వానం పంపించింది. ఈ భేటీ కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో జులై 16న జరగనుంది. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదానికి ఫుల్‌స్టాఫ్ పడాలంటే ముఖ్యమంత్రుల భేటీ అనివార్యమని కేంద్రం భావించింది. ఈ మేరకు వారిని భేటీ కావాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భేటీకి ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్రం సర్క్యులర్ ఒకటి విడుదల చేసింది.  భేటీ హాజరవడం వీలవుతుందా లేదా అనేది తెలపాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కోరింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. పోలవరం ఎడమ, కుడి కాలువల నిర్మాణానికి చేసిన ఖర్చును రీయింబర్స్ చేయాలని, పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరుతూనే పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌‌కు వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల వరద నీరు గోదావరిలోని పోలవరం నుంచి బనకచర్లకు పంపేందుకు లింక్ కెనాల్ ఏర్పాటుపై చర్చించారు.  ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఏపీ కరువు రహితంగా మారడంతో పాటు 80 లక్షల మందికి తాగునీరు అందిస్తుందని వివరించారు. మరోవైపు ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు కూడా సిద్ధమవుతున్నారు. మంగళవారం ఆయన ఢిల్లీ పర్యటించనున్నారు. కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. పలు కీలక అంశాలపై వారితో చర్చించనున్నారు. ఇదే మంచి అవకాశం భావించిన కేంద్రం.. ఇద్దరు ముఖ్యమంత్రులను భేటీ కావాలని, జల వివాదాలకు ముగింపు పెట్టించాలని భావిస్తోంది.  
 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ..జల వివాదం సద్దుమణిగేనా? Publish Date: Jul 14, 2025 7:58PM

షూటింగ్‌లో పల్టీలు కొట్టిన కారు..ఫైట్ మాస్టర్ మృతి

  సినిమా షూటింగ్‌లో కార్ టాప్లింగ్ స్టంట్ చేస్తూ ప్రముఖ ఫైట్ మాస్టర్ రాజు ప్రమాదంలో మృతి చెందారు.. హీరో ఆర్య, డైరెక్టర్ పా. రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. చెన్నైలోని నాగపట్నం సమీపంలో కారుతో స్టంట్స్ చేస్తుండగా రాజు గుండెపోటుకు గురయ్యారు. వెంటనే చిత్ర బృందం ఆయనను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. స్టంట్ మాస్టర్ రాజు మృతి పట్ల హీరో విశాల్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాజు ధైర్యవంతుడని కొనియాడిన విశాల్, తాను నటించిన అనేక చిత్రాల్లో ఆయన సాహసోపేతమైన స్టంట్స్ చేశారని గుర్తు చేసుకున్నారు. అయితే, కారుతో స్టంట్స్‌ చేస్తుండగా రాజుకు హార్ట్ అటాక్ వచ్చిందని మరికొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయంపై వెట్టువన్‌ మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
షూటింగ్‌లో పల్టీలు కొట్టిన కారు..ఫైట్ మాస్టర్ మృతి Publish Date: Jul 14, 2025 7:26PM

ప్రమోషన్ పేరుతో రీల్స్... ఆపై కాపురంలో చిచ్చు

  ఇద్దరు యువ వైద్యుల మధ్య ఘర్షణ... చివరకు రీల్స్ అమ్మాయి యువ వైద్యుడి ప్రేమ తో మనస్థాపానికి గురై వైద్యుడు భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా హసన్ పర్తి వద్ద ఓ విల్లా లో కార్డియాలజీ వైద్యుడు డాక్టర్ సృజన్ అతని భార్య డెంటల్ సర్జన్ డాక్టర్ ప్రత్యూష నివాసం ఉంటున్నారు. ఈ మధ్యనే మెడి కవర్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కార్డియాలజీ  విభాగంలో విధుల్లో చేరిన సృజన్ కు రీల్స్ మరియు ప్రమోషన్స్ చేస్తానంటూ బానోతు శృతి అలియాస్ బుట్ట  బొమ్మ పరిచయమైంది. ఇద్దరి మధ్య స్నేహం పెరగడంతో డాక్టర్ సృజన్ కు మరియు భార్య ప్రత్యూష మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.  గొడవలు కాస్త తీవ్రం కావడంతో సుజన్ భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ఈ క్రమంలో మాట మాట పెరిగి నిన్న ఉదయం ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది దీంతో మనసు స్థాపానికి చెందిన ప్రత్యూష ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుట్ట బొమ్మ అలియాస్ బానోతు శృతి వల్లే తన కూతురు జీవితం ఆగమైందని, దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని తన కూతురు మృతి పై అనుమానాలు ఉన్నాయని మృతురాలు డాక్టర్ ప్రత్యూష తండ్రి రామ్ కిషన్ ఆరోపించారు. తల్లి ప్రత్యూష మృతితో ఇద్దరు అమ్మాయిలు అనాధలయ్యారు అందులో 7 నెలల పసిపాప ఉండడం పలువురి బాధ 
ప్రమోషన్ పేరుతో రీల్స్... ఆపై కాపురంలో చిచ్చు Publish Date: Jul 14, 2025 7:06PM

సుప్రీం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ అస్వ‌స్థ‌త‌

  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. తీవ్ర ఇన్ఫ్‌క్షన్ కారణంగా ఢిల్లీలోని ఓ ఆస్ప‌త్రిలో చేరినట్లు అధికారిక వర్గలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలిపారు.  శ‌నివారం ఆయ‌న హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. నాల్స‌ర్ న్యాయ విద్యాల‌యంలో జ‌రిగిన స్నాత‌కోత్స‌వంలో ఆయ‌న పాల్గొన్నారు. ఒక‌టి లేదా రెండు రోజుల్లో ఆయ‌న కోలుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు అధికారి తెలిపారు. జూలై 12వ తేదీన సీజేఐ హైద‌రాబాద్ వ‌చ్చారు. హైద‌రాబాద్ టూర్ స‌మ‌యంలో ఆయ‌న స్పెష‌ల్ పోస్ట‌ల్ క‌వ‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు.
సుప్రీం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్  అస్వ‌స్థ‌త‌ Publish Date: Jul 14, 2025 5:26PM

రామోజీ ఫిలిం సిటీ తెలంగాణలో ఉండటం గర్వంగా ఉంది : సీఎం రేవంత్ రెడ్డి

  సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఆకాశ్ సాగర్ చోప్రా నిర్మాణ సారథ్యంలో  శ్రీమద్ భాగవత్ం పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీమద్ భాగవతం చిత్రీకరణ జరగడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ.. దేశంలోనే యూనిక్ స్టూడియో అని చెప్పారు. రామాయణం, మహా భారతం, భాగవతం మన జీవితాల్లో భాగం అయిపోయాయని అన్నారు.  ఇలాంటి గొప్ప కథను మరోసారి ప్రజలను అందించాలనే నిర్ణయం తీసుకున్న నిర్మాతలను అభినందించారు. తరం మారుతున్న సందర్భంగా దృశ్యకావ్యం తీయడం గొప్ప విషయం అని ప్రశంసించారు.  40 ఏళ్ల క్రితం టీవీల్లో రామాయణం సీరియల్ వస్తుందంటే.. బయట రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండేవని గుర్తుచేశారు. ఒక్కరు లేకుండా అందరూ టెలివిజన్‌ల ముందు ఉండేదని అన్నారు. అంతేకాదు.. రామోజీ ఫిల్మ్ సిటీ అనే ఒక గొప్ప స్టూడియో తెలంగాణలో ఉందని చెప్పేందుకు గర్వపడుతున్నానని కొనియాడారు. కాగా, శ్రీమద్ భాగవతం సినిమాన్ని ఆకాష్ సాగర్, సాగర్​పిక్చర్​ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.  
రామోజీ ఫిలిం సిటీ తెలంగాణలో ఉండటం గర్వంగా ఉంది : సీఎం రేవంత్ రెడ్డి Publish Date: Jul 14, 2025 5:06PM

కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్రిక్తత

  కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళన కారుల మధ్య నెలకొన్న పెనుగులాట, అరెస్ట్ లు ఉద్రిక్తత వాతావరణానికి దారితీశాయి . దళితులు తమ భూములను ఇతరులు కబ్జా చేశారని గత నెల రోజులుగా ఆర్డీవో  కార్యాలయం ఎదుట దీక్షలు చేస్తున్నారు. వీరికి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఇచ్చింది. ఎందుకూ  సమస్య పరిష్కారం కాకపోవడం, అధికారులు స్పందించక పోవడం తో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు  ఆర్డీఓ కార్యాలయం ముట్టడించారు. దీంతో  పోలీసులు ముట్టడిని బలవంతంగా బగ్నం చేసి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులతో పాటు ఆందోళనకాలను బలవంతంగా లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితి అక్కడ ఉద్రిక్తత వాతావరణాన్ని కల్పించింది. పోలీసులు అరెస్టులతో ఆగకుండా నెల రోజులుగా  ఆందోళన చేపట్టిన దీక్ష శిబిరాన్ని కూల్చేశారు. దీంతో  రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, బాధిత దళితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కబ్జా కోరనుండి మా‌భూములకు విముక్తి కల్పించకపోగా తమను అరెస్ట్ చేయడం,చేయడం దీక్షా శిబిరం కూల్చివేయడం కారణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. *అరెస్టులతో ఆపలేరు: రవిశంకర్ రెడ్డి దళితులు చేస్తున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, గత 29 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూఉంటే అధికారులు స్పందించకపోవడం , పోలీసులతో ఉద్యమాలను అణిచివేయాలని, టెంట్ ను తొలగించి దళితులను భయబ్రాంతులకు గిరిచేయడం  తగదని, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి మండి పడ్డారు.అరెస్ లో పై ఆయన  మాట్లాడుతూ, పేదలైన దళితుల సమస్యలను పరిష్కరించాలని అడిగితే పోలీసులను పెట్టి అరెస్టు చేయడం సరైన పద్దతి కాదన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ప్రభుత్వాలు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా న్యాయం అడుగుతున్న  దళితులపై పోలీసుల ఉక్కు పాదాలను మోపడం ఏమిటని అయన ప్రశ్నించారు, సమస్యలను అధికారులు  పరిష్కరించకుండా ఉద్యమాలను అరెస్టులతో ఆపుతామనుకోవడం అవివేకమని అన్నారు.  దళితుల ఆందోళనలను అణచివేయటానికి పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపచేసి గంటల తరబడి అరెస్టుకు ప్రణాళికలు చేసేబదులు పదినిమిషాలలో అధికారులు కూర్చుని సమస్యను పరిష్కరించవచ్చునని ఆయన అన్నారు. పాత కడప దళితుల భూమి సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారు ఏఐసీసీ కోఆర్డినేటర్ ఎస్ ఎ సత్తార్, దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మడగలం ప్రసాద్, వెంకటేష్, రాయలసీమ మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీదేవి, తస్లిమ్  రమేష్ బాబు, దివాకర్, గోపాల్, వీరయ్య, బాబు చిన్న సుబ్బయ్య, కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఓబయ్య, ఓబులేసు, సిపిఐ యం యల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బ్ల్యూ రాము, ఎమ్మార్పీఎస్ నాయకులు బీసీ గంగులు, ఆంజనేయులు, సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.  
కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్రిక్తత Publish Date: Jul 14, 2025 4:31PM

అశోక్ గజపతిరాజుకు అభినందనలు చెప్పిన సీఎం చంద్రబాబు

  తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా నియమితులవడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గోవా గవర్నర్ గా నియమితులైన పి.అశోక్ గజపతిరాజుకు హృదయపూర్వక శుభాభినందనలు. ఏపీ ప్రజలకు ఇది గర్వకారణం. అశోక్ గజపతిరాజుకు ఇంతటి గౌరవనీయ పదవిని ఇచ్చిన సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, ప్రధాని నరేంద్ర మోదీకి  కేంద్ర మంత్రి వర్గంకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విశిష్ట పదవిలో అశోక్ గజపతిరాజు  విజయవంతం అవ్వాలని, పదవీకాలాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తారని ఆకాంక్షిస్తున్నాను" అంటూ   సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.  హరియాణా గవర్నర్‌గా ప్రొఫెసర్‌ ఆషిమ్‌కుమార్‌ ఘోష్‌, లద్దాఖ్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్‌ గుప్తాను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు హరియాణా గవర్నర్‌గా పనిచేసిన బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగిసింది. అశోక్ గజపతిరాజు 1951 జూన్ 26న జన్మించారు. గ్వాలియర్‌లోని సింధియా, హైదరాబాద్‌ పబ్లిక్ స్కూల్‌, విశాఖలోని ప్రభుత్వ కృష్ణా కళాశాలలో ఆయన చదువుకున్నారు. పుట్టింది రాజవంశంలోనే అయినా సామ్యవాద భావాలను ఆయన చిన్నప్పటి నుంచే పుణికి పుచ్చుకున్నారు. విద్యార్థి దశలో కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు.  ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ ఆయన ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రానికి తెరతీశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకూ మొత్తం 20 మంది వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా పనిచేశారు. అలాగే ఒడిశా, తమళినాడులోని తెలుగు కుటుంబాల్లో జన్మించిన ఇద్దరితోపాటు తెలుగింటి కోడలుగా వచ్చి ఒకరు కూడా గవర్నర్లుగా పనిచేశారు. అంతేకాకుండా వీరిలో పలువురు ఏకకాలంలో వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లుగా ఉన్నారు  
అశోక్ గజపతిరాజుకు అభినందనలు  చెప్పిన సీఎం చంద్రబాబు Publish Date: Jul 14, 2025 3:58PM

తిరుపతి రైల్వే స్టేషన్ లో ప్రమాదం.. ఆగి ఉన్న రెండు రైళ్లలో మంటలు

తిరుపతి రైల్వేస్టేషన్ లో  ఆగి ఉన్న రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణీకులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.  తిరుపతి హిసార్ ఎక్స్ ప్రెస్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రైలు బోగి పూర్తిగా కాలిపోయింది. అప్రమత్తమైన ఫైర్ అధికారులు మంటలు వచ్చిన బోగీని  రైలు నుంచి వేరు చేయడంతో పెద్ద ప్రమాదం  తప్పింది. రైల్వే స్టేషన్ నుంచి గ్యారేజీని తీసుకెళ్తుండగా ప్రమాదం  జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు బోగీని వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. అదే విధంగా తిరుపతి రైల్వే స్టేషన్ లోని లూప్ లైన్ లో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలులోని బోగీలో కూడా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో రైలులో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభఢవించలేదు. రైల్వేసిబ్బంది, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దాదాపు ఒకే సమయంలో రెండు రైళ్లలోని బోగీలలో మంటలు చెలరేగడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక బోగీలలో మంటలు చెలరేగడానికి కారణాలు ఏంటి అన్నదానిపై శాఖాపరమైన విచారణ జరుగుతోంది. 
తిరుపతి రైల్వే స్టేషన్ లో ప్రమాదం.. ఆగి ఉన్న రెండు రైళ్లలో మంటలు Publish Date: Jul 14, 2025 3:38PM

రేణిగుంట ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్

  తిరుపతి జిల్లా రేణిగుంటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. క్రోమో మెడికేర్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కంపెనీ సిబ్బంది సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నా ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  రియాక్టర్ పేలుడుకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా  పాశమైలారం సిగాచి కంపెనీలో రియాక్టర్ పేలి సుమారు 40 మంది మరణించిన విషాద ఘటన ఇంకా మరిచిపోకముందే ఏపీలో అలాంటి ప్రమాదమే జరగడం అందరినీ కలవరపెడుతోంది. ఫ్యాక్టరీలు కనీస నాణ్యతా ప్రమాణాలు, జాగ్రత్త చర్యలు పాటించకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
రేణిగుంట ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్ Publish Date: Jul 14, 2025 3:14PM

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.7గా నమోదైంది. తనింబర్ దీవుల ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే.. సునామీ వచ్చే అవకాశం లేదని ఆ దేశ జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. ఈ భూకంపకేంద్రం భూమికి  98 కిలో మీటర్లు అంటే  60.89 మైళ్ళు  లోతులో ఉందని తెలిపింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ భూకంపం 6.7 తీవ్రతతో, 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో నమోదైందని నివేదించింది. తూర్పు ఇండోనేషియాలోని అనేక చిన్న పట్టణాల్లో ప్రకంపనలు సంభవించాయని ఏజెన్సీ పేర్కొంది. అయితే, ఈ భూకంపంలో నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు రాలేదని డిసాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది. ఇండోనేషియా.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలవబడే ప్రాంతంలో ఉంది. ఇది అత్యంత భూకంపాలు సంభవించడానికి అవకాశం ఉన్న మండలం. ఇక్కడ భూమి.. క్రస్ట్‌లోని వివిధ ప్లేట్లు కలుస్తాయి. కాబట్టి, ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో భూకంపాలు సంభవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండోనేషియాలో భారీ భూకంపం Publish Date: Jul 14, 2025 2:58PM