సంజయ్ దత్ ఆ పని చేసి ఉంటే ముంబై పేలుళ్లు జరిగి ఉండేవి కావా?
posted on Jul 15, 2025 2:27PM

బాలీవుడ్ నటుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ దత్ ముంబై పేళ్లలకు సంబంధించి మరోసారి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సంజయ్‌దత్ తలుచుకుని ఉంటే ముంబై పేలుళ్లను ఆపి ఉండేవారని ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ వాణిజ్య రాజధాని ముంబైలో 1993లో జరిగిన పేలుళ్ల కేసును వాదించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. న్యాయవాదిగా పలు సంచలన కేసులను వాదించిన ఉజ్వల్ నికమ్ ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ముంబై పేలుళ్ల గురించి, నటుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ దత్ గురించి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
1993, మార్చి 12న ముంబైలో వరుస పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లకు కొన్ని రోజుల ముందు సంజయ్ ఇంటికి ఆయుధాలతో నిండిన ఓ వ్యాన్ వచ్చింది. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూం సలేం తీసుకొచ్చిన ఆ వ్యాన్‌లో హ్యాండ్ గ్రనేడ్లు, ఏకే 47 తుపాకులు, బాంబులు ఉన్నాయి. వాటిని సంజయ్ పరిశీలించారు. వాటిల్లో నుంచి ఒక ఏకే 47 తుపాకీని తీసుకుని తన దగ్గర ఉంచుకున్నారు. అయితే..అప్పుడే ఆ ఆయుధాల వ్యాన్ గురించి పోలీసులకు సంజయ్ సమాచారం ఇచ్చి ఉంటే ఆ పేలుళ్లు జరిగి, అంత మంది చనిపోయి ఉండేవారు కాదని ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు.
ముంబై పేలుళ్లతో సంబంధం ఉందనే కారణంతో సంజయ్‌పై అప్పట్లో టాడా కేసు నమోదైంది. సంజయ్ ఉగ్రవాది అని ఆరోపణలు వచ్చాయి. కోర్టు మాత్రం సంజయ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో సంజయ్‌ను దోషిగా నిర్దారిస్తూ కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. పుణెలోని యరవాడ జైల్లో శిక్ష అనుభవించిన సంజయ్ 2016లో విడుదల అయ్యాడు. కాగా.. న్యాయవాది ఉజ్వల్ నికమ్ బీజేపీలో చేరి 2024లో ముంబై నార్త్-సెంట్రల్ లోక్‌సభ్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆయనను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న సంజయ్‌దత్‌తో పాటు బీజేపీ అధిష్టానం సైతం ఉజ్వల్ వ్యాఖ్యలతో ఇరకాటంలో పడినట్లైంది.