అగ్ర హీరో సినిమాకి నో చెప్పిన ఫాహద్ ఫాజిల్!.. అభిమానుల రచ్చ రచ్చ
on Jul 15, 2025

పుష్ప పార్ట్ 1 ,పార్ట్ 2 తో పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న మలయాళీ నటుడు 'ఫాహద్ ఫాజిల్'(Fahadh Faasil). ఎస్ పి షెకావత్ క్యారక్టర్ లో ఫాహద్ ఆ రెండు పార్టుల్లో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడని చెప్పవచ్చు. దీంతో ఫాహద్ హీరోగా తెరకెక్కిన కొన్ని మలయాళ చిత్రాలు తెలుగులోకి డబ్ కూడా అయ్యాయి. ఫాహద్ నటనకి ఏర్పడిన క్రేజ్ కి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు .
రజనీకాంత్(Rajinikanth)నాగార్జున(Nagarjuna)కాంబోలో 'లోకేష్ కనగరాజ్'(Lokesh Kanagaraj)దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ 'కూలీ'(Coolie)ఆగస్ట్ 14 న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మలయాళ నటుడు మంజుమ్మేల్ బాయ్స్' ఫేమ్ 'సౌభిన్ షాబీర్' ఒక కీలకమైన క్యారక్టర్ ని పోషిస్తున్నాడు. సౌబిన్ క్యారక్టర్ లో లోకేష్ మొదట 'ఫాహద్ ఫాజిల్ ని అనుకున్నాడట. ఈ మేరకు సదరు క్యారక్టర్ ని లోకేష్ చాలా కష్టపడి ఆరునెలల పాటు డిజైన్ చేసుకున్నాడని, కానీ డేట్స్ కుదరకపోవడంతో ఫాహద్ ఆ ఛాన్స్ ని వదులుకున్నట్టుగా తెలుస్తుంది.
ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గా 'పూజాహెగ్డే'(Pooja Hegde)పై చిత్రీకరించిన 'మోనికా' అనే స్పెషల్ సాంగ్ రిలీజయ్యింది. ఈ సాంగ్ లో 'సౌభిన్ షాబీర్' పూజాతో పాటు డాన్స్ చేసాడు. పూజా ని డామినేట్ చేసేలా డాన్స్ చేసాడంటే అతిశయోక్తి కాదు. పైగా ఈ సాంగ్ కేవలం సౌభిన్, పూజా ల మధ్య మాత్రమే చిత్రీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. సాంగ్ వీడియోలో కూడా ఆ ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుండటంతో ఫాహద్ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడని అభిమానులతో పాటు, సినీ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్, కమల్ హాసన్(Kamal Haasan)కాంబినేషన్ లో వచ్చిన 'విక్రమ్' తోనే ఫాహద్ పాన్ ఇండియా ప్రేక్షకులకి దగ్గరైన విషయం తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



