తెలంగాణలో ఐదు రోజుల పాటు వానలే వానలు

తెలంగాణ వ్యాప్తంగా ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ, వర్షాలు మాత్రం ఆశించిన విధంగా కురవలేదు. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.  

ఇక ఈ నెల 14 నుంచి రుతుపవనాలు బలహీన పడటంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడింది. తీవ్ర ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న చల్లటి కబురు తెలిపింది. ఈ నెల 17 నుంచి  22వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా  విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu