రేణిగుంట ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్
posted on Jul 14, 2025 3:14PM

తిరుపతి జిల్లా రేణిగుంటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. క్రోమో మెడికేర్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కంపెనీ సిబ్బంది సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నా ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
రియాక్టర్ పేలుడుకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి కంపెనీలో రియాక్టర్ పేలి సుమారు 40 మంది మరణించిన విషాద ఘటన ఇంకా మరిచిపోకముందే ఏపీలో అలాంటి ప్రమాదమే జరగడం అందరినీ కలవరపెడుతోంది. ఫ్యాక్టరీలు కనీస నాణ్యతా ప్రమాణాలు, జాగ్రత్త చర్యలు పాటించకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.