షూటింగ్‌లో పల్టీలు కొట్టిన కారు..ఫైట్ మాస్టర్ మృతి
posted on Jul 14, 2025 7:26PM

సినిమా షూటింగ్‌లో కార్ టాప్లింగ్ స్టంట్ చేస్తూ ప్రముఖ ఫైట్ మాస్టర్ రాజు ప్రమాదంలో మృతి చెందారు.. హీరో ఆర్య, డైరెక్టర్ పా. రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. చెన్నైలోని నాగపట్నం సమీపంలో కారుతో స్టంట్స్ చేస్తుండగా రాజు గుండెపోటుకు గురయ్యారు. వెంటనే చిత్ర బృందం ఆయనను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
స్టంట్ మాస్టర్ రాజు మృతి పట్ల హీరో విశాల్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాజు ధైర్యవంతుడని కొనియాడిన విశాల్, తాను నటించిన అనేక చిత్రాల్లో ఆయన సాహసోపేతమైన స్టంట్స్ చేశారని గుర్తు చేసుకున్నారు. అయితే, కారుతో స్టంట్స్ చేస్తుండగా రాజుకు హార్ట్ అటాక్ వచ్చిందని మరికొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయంపై వెట్టువన్ మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.