ప్రమోషన్ పేరుతో రీల్స్... ఆపై కాపురంలో చిచ్చు

 

ఇద్దరు యువ వైద్యుల మధ్య ఘర్షణ... చివరకు రీల్స్ అమ్మాయి యువ వైద్యుడి ప్రేమ తో మనస్థాపానికి గురై వైద్యుడు భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా హసన్ పర్తి వద్ద ఓ విల్లా లో కార్డియాలజీ వైద్యుడు డాక్టర్ సృజన్ అతని భార్య డెంటల్ సర్జన్ డాక్టర్ ప్రత్యూష నివాసం ఉంటున్నారు. ఈ మధ్యనే మెడి కవర్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కార్డియాలజీ  విభాగంలో విధుల్లో చేరిన సృజన్ కు రీల్స్ మరియు ప్రమోషన్స్ చేస్తానంటూ బానోతు శృతి అలియాస్ బుట్ట  బొమ్మ పరిచయమైంది. ఇద్దరి మధ్య స్నేహం పెరగడంతో డాక్టర్ సృజన్ కు మరియు భార్య ప్రత్యూష మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. 

గొడవలు కాస్త తీవ్రం కావడంతో సుజన్ భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ఈ క్రమంలో మాట మాట పెరిగి నిన్న ఉదయం ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది దీంతో మనసు స్థాపానికి చెందిన ప్రత్యూష ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుట్ట బొమ్మ అలియాస్ బానోతు శృతి వల్లే తన కూతురు జీవితం ఆగమైందని, దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని తన కూతురు మృతి పై అనుమానాలు ఉన్నాయని మృతురాలు డాక్టర్ ప్రత్యూష తండ్రి రామ్ కిషన్ ఆరోపించారు. తల్లి ప్రత్యూష మృతితో ఇద్దరు అమ్మాయిలు అనాధలయ్యారు అందులో 7 నెలల పసిపాప ఉండడం పలువురి బాధ