ఏంటీ లోకేష్‌కి.. ప‌థ‌కాలు త‌యారు చేయ‌డం రాదా?

 

లోకేష్ కి ప‌థ‌కాలు త‌యారు చేయ‌డం రాదా? మ‌రి స్టాన్ ఫ‌ర్డ్ లో ఏం నేర్చుకున్న‌ట్టు? అమ్మ‌కు వంద‌నం విష‌యంలో వైసీపీ చేస్తున్న ప్ర‌చారంలో అర్ధ‌మేంట‌ని చూస్తే.. ఫ‌స్ట్ మ‌న‌మంతా తెలుసుకోవ‌ల్సిన విష‌య‌మేంటంటే.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌, డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీముల ఆలోచ‌న‌లు లోకేష్ వే అని ఎంద‌రికి తెలుసు? వీటినే జ‌గ‌న్ కాపీ కొట్టాడ‌న్న సంగ‌తి మీకు తెలుసా?

ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా.. లోకేష్ తండ్రి చాటు కొడుకు. ఆయ‌న ఆలోచ‌న‌లు నేరుగా ఏవీ అమ‌లు కానివ్వ‌ని అతి పెద్ద అడ్డంకి త‌న తండ్రే. తానేదైనా ఒక ప్ర‌తిపాద‌న చేస్తే.. దాన్ని అల‌వోక‌గా మ‌రో స్టైల్లోకి మార్చేస్తారు లోకేష్ తండ్రి చంద్ర‌బాబు. కార్య‌క‌ర్త‌ల‌కు జీతాల‌న్న‌దే వాలంటీర్లుగా జ‌గ‌న్ మార్చగా.. దాన్ని గ‌తంలో చంద్ర‌బాబు జ‌న్మ‌భూమి క‌మిటీలుగా మారిన విష‌యం గుర్తించిన వారు అరుదుగా ఉంటారు. ఇక డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీములు కూడా లోకేష్ తొలుత చేసిన ప్ర‌తిపాద‌న‌.

ఇక వైయ‌స్ జ‌గ‌న్  ప‌థ‌క ర‌చ‌న సొంతంగా చేసేది ఏమీ ఉండ‌దు. దీని వెన‌క అతి పెద్ద క్రిష్టియ‌న్ లాబీ ఉంటుంద‌ని స‌మాచారం. జ‌గ‌న్ పైకి త‌న‌ బొమ్మ‌లేసుకుని.. ఇష్టారాజ్యం చేస్తుంటారు. కానీ, అదంతా ఒట్టిదే.. ఊరూరా ఉండే పాస్ట‌ర్లు.. ఈ ప‌థ‌కాల‌కు సంబంధించిన స‌మాచార‌మిచ్చి.. త‌గిన సూచ‌న‌లు చేస్తుంటారు. వీటి ద్వారా జ‌గ‌న్ అయిన దానికీ కాని దానికి, అర్ధం ప‌ర్ధం లేని ప‌థ‌కాలు ర‌చించేవార‌ని అంటారు.

అలాగ‌ని ఈ కాపీ పేస్ట్ ప‌థ‌కాలు ఆయ‌న‌కి ఏమంత క‌లిసొచ్చిన ప‌రిస్థితి లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఇంత పెద్ద ఎత్తున ఎడా పెడా ప‌థ‌కాలిచ్చినా స‌రే ఆయ‌న గెల‌వ‌లేక పోయారు. అంటే ఆయ‌న ఈ ప‌థ‌కాల‌ను ఏమంత బాధ్య‌త కొద్దీ త‌యారు చేసిన‌వి కావు. ఒక‌ ఆలోచ‌న‌తో చేసిన‌వి కూడా కావు. అస‌లు జ‌గ‌న్ ప‌థ‌కాలంటే.. ఖ‌ర్చు భారం కింద లెక్క‌. పైపెచ్చు ఓట్ల కొనుగోలు వ్య‌వ‌హారంగానూ భావిస్తుంటారు. అందుకే ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయారని అంచనా వేస్తుంటారు నిపుణులు.. నిజానికి ఈ సంక్షేమ ప‌థ‌కాలకు ఆద్యుడు ఎన్టీఆర్. అప్ప‌టి నుంచే ప్ర‌జారంజ‌క ప‌థ‌కాల శ‌కం ఒక‌టి మొద‌లైంది. వాటినే ఆ త‌ర్వాత వైయ‌స్ కాపీ కొట్టారు. ఆ త‌ర్వాత కేసీఆర్ సైతం పేస్ట్ చేసేశారు. ఇక జ‌గ‌న్ సంగ‌తి స‌రే స‌రి. త‌న విస్తృ ప‌థ‌కాల త‌యారీలో అధిక శాతం.. క్రిష్టియ‌న్ లాబీ నుంచి వ‌చ్చిన స‌ల‌హా సూచ‌న‌ల‌కు త‌న సొంత త‌యారీలా క‌ల‌రింగ్ ఇచ్చి.. జ‌నాల్లోకి వ‌దిలేస్తుంటార‌ని అంటారు.

నిజానికి ఒక ప‌థ‌కం అంటే అది ప్ర‌భుత్వానికి భారం కారాదు. పెట్టుబ‌డిగా ఉండాలి. అదెలాగో తెలియాలంటే మ‌న‌కు చంద్ర‌బాబు నూత‌న సృష్టి పీ- 4. ఇది నిజంగా ఒక అద్భుత‌మైన ప‌థ‌కం. ఇదే జ‌గ‌న్ త‌న హ‌యాంలో అర్ధం ప‌ర్ధం లేకుండా చేసిన ఖ‌ర్చు ఆయ‌న స్వార్ధానికి సంబంధించిన వ్య‌వ‌హారం. ఈ మొత్తం పెట్టుబ‌డి కింద‌ పెట్టి మంచి రాజ‌ధాని నిర్మాణం చేసి ఉంటే.. అది ఈ పాటికి ఎన్నో ప‌నుల‌ను సృష్టించి ఉండేది. ఈ విష‌యం గుర్తించారు కాబ‌ట్టే.. జ‌నం ఆయ‌న్ను తిప్పి కొట్టారు.అలాంటి జ‌గ‌న్ ఆయ‌న పార్టీ లోకేష్ త‌మ అమ్మ ఒడినే కాపీ కొట్టి అమ్మ‌కు వంద‌నంగా పేరు మార్చార‌ని చెప్పుకోవ‌డం చూస్తుంటే వింత‌గా ఉంద‌ని అంటారు విశ్లేష‌కులు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu