రామోజీ ఫిలిం సిటీ తెలంగాణలో ఉండటం గర్వంగా ఉంది : సీఎం రేవంత్ రెడ్డి
posted on Jul 14, 2025 5:06PM
.webp)
సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఆకాశ్ సాగర్ చోప్రా నిర్మాణ సారథ్యంలో శ్రీమద్ భాగవత్ం పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీమద్ భాగవతం చిత్రీకరణ జరగడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ.. దేశంలోనే యూనిక్ స్టూడియో అని చెప్పారు. రామాయణం, మహా భారతం, భాగవతం మన జీవితాల్లో భాగం అయిపోయాయని అన్నారు.
ఇలాంటి గొప్ప కథను మరోసారి ప్రజలను అందించాలనే నిర్ణయం తీసుకున్న నిర్మాతలను అభినందించారు. తరం మారుతున్న సందర్భంగా దృశ్యకావ్యం తీయడం గొప్ప విషయం అని ప్రశంసించారు. 40 ఏళ్ల క్రితం టీవీల్లో రామాయణం సీరియల్ వస్తుందంటే.. బయట రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండేవని గుర్తుచేశారు. ఒక్కరు లేకుండా అందరూ టెలివిజన్‌ల ముందు ఉండేదని అన్నారు. అంతేకాదు.. రామోజీ ఫిల్మ్ సిటీ అనే ఒక గొప్ప స్టూడియో తెలంగాణలో ఉందని చెప్పేందుకు గర్వపడుతున్నానని కొనియాడారు. కాగా, శ్రీమద్ భాగవతం సినిమాన్ని ఆకాష్ సాగర్, సాగర్పిక్చర్ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.