తిరుపతి రైల్వే స్టేషన్ లో ప్రమాదం.. ఆగి ఉన్న రెండు రైళ్లలో మంటలు

తిరుపతి రైల్వేస్టేషన్ లో  ఆగి ఉన్న రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణీకులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.  తిరుపతి హిసార్ ఎక్స్ ప్రెస్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రైలు బోగి పూర్తిగా కాలిపోయింది. అప్రమత్తమైన ఫైర్ అధికారులు మంటలు వచ్చిన బోగీని  రైలు నుంచి వేరు చేయడంతో పెద్ద ప్రమాదం  తప్పింది. రైల్వే స్టేషన్ నుంచి గ్యారేజీని తీసుకెళ్తుండగా ప్రమాదం  జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు బోగీని వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు.

అదే విధంగా తిరుపతి రైల్వే స్టేషన్ లోని లూప్ లైన్ లో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలులోని బోగీలో కూడా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో రైలులో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభఢవించలేదు. రైల్వేసిబ్బంది, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దాదాపు ఒకే సమయంలో రెండు రైళ్లలోని బోగీలలో మంటలు చెలరేగడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక బోగీలలో మంటలు చెలరేగడానికి కారణాలు ఏంటి అన్నదానిపై శాఖాపరమైన విచారణ జరుగుతోంది.