జగన్ కొంపలో కూల్చివేతలు!

చట్టం తన పని తాను చేసుకుని పోతోంది. అటు జగన్ ప్రభుత్వం కూలిపోగానే, ఇటు జగన్ కొంప కూడా కూలుతోంది. హైదరాబాద్‌ లోటస్ పాండ్‌ దగ్గర వున్న జగన్ ఇంటికి సంబంధించిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. జగన్ ఇంటి ముందు వున్న ఫుట్‌పాత్‌ని, రోడ్డుని ఆక్రమించి చాలాకాలం క్రితమే జగన్ సెక్యూరిటీ గార్డుల కోసం సెక్యూరిటీ పోస్టును జగన్ ముచ్చటపడి కట్టించుకున్నారు. ఇప్పుడు అవన్నీ జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం కూలిపోయింది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయింది. ఇక కూలాల్సినవన్నీ క్రమంగా కూలతాయి.

ప్రజలలో మార్పు కనిపిస్తోంది.. స్వచ్ఛందంగా జగన్ రీ సర్వేరాళ్ల తొలగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే మార్పు వేగం పుంజుకుంది. జగన్ మోహన్ రెడ్డి ల్యాండ్ రీసర్వే పేరుతో చేసిన అరాచకాన్ని రైతులే స్వచ్ఛందంగా సరిదిద్దుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫైలుపై చంద్రబాబు సంతకం చేసిన నేపథ్యంలో పొలాల్లో జగన్ రీ సర్వే రాళ్లను రైతులు తొలగించడం ప్రారంభించారు.   జగన్ రీసర్వే రాళ్లను తీసేసి   గట్లపై పడేస్తున్నారు. అదే సమయంలో పాత సర్వే రాళ్లను మాత్రం ముట్టుకోవడం లేదు.  రైతులకు సంబంధం లేకుండా డిజిటల్‌ సర్వే పేరుతో వైసీపీ ప్రభుత్వం సర్వేచేసి పొలాల్లో రాళ్లను  పాతారు. గతంలో ఉన్న సరిహద్దులను దాటి రాళ్లను వేయడంతో రైతుల మధ్య కొత్త వివాదాలకు తెరలేపినట్టైంది. దీనిపై రైతుల్లో ఎంతో వ్యతిరేకత వెల్లువెత్తింది. అయినా జగన్ అధికారంలో ఉండగా వాటిని అడ్డుకోవడానికి లేదా, ఎదిరించడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. ఎదిరించినా, నిరసన వ్యక్తం చేసినా వేధింపులు, కేసులు అన్న భయంతో అప్పటికి మిన్నకున్న రైతులు ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి, ల్యాండ్ టైటిలిగ్ యాక్ట్ రద్దు ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేయడంతో ధైర్యంగా ముందుకు వస్తున్నారు. స్వచ్ఛందంగా జగన్ రీసర్వే రాళ్లను తొలగిస్తున్నారు.  అస్తవ్యస్తంగా వేసిన రాళ్ళను తొలగిస్తూ పాత హద్దుల పక్కనే ఉన్న రాళ్లను మాత్రం అలాగే ఉంచుతున్నారు. 

మోడీ.. ముసలోడేగానీ, మహానుభావుడే!

మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాతయ్య వయసు 75 ఏళ్ళకు దగ్గర్లో వుంది. కానీ, మన మోడీ తాతయ్య ముసలోడేగానీ, మహానుభావుడే! ఏ దేశానికి వెళ్ళినా అక్కడ జనాన్ని ఇట్టే ఆకర్షించేస్తూ వుంటారు. ముఖ్యంగా పలు దేశాధ్యక్షుడైన మహిళలు మోడీతో సెల్ఫీ దిగడానికి ఇష్టపడుతూ వుంటారు. గత సంవత్సరం డిసెంబర్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.లోని దుబాయ్ వేదికగా జరిగిన ‘కాప్ 28’ సదస్సులో మన పెద్దాయనతో ఇటలీ లేడీ ప్రధాని జార్జియా మెలోనీ సెల్ఫీ దిగారు. అలా సెల్ఫీ దిగుతున్న ఫొటో ‘మెలోడీ’ (#Melodi) పేరుతో ఇంటర్నెట్లో బాగా వైరల్ అయింది. Meloni, Modi ఈ రెండు పదాలనీ మిక్స్ చేసేసి నెటిజన్లు #Melodi అనే కొత్త పదాన్ని క్రియేట్ చేసి సదరు ఫొటోని వైరల్ చేసేశారు. ఇప్పుడు మరోసారి ఈ #melodi కాంబినేషన్ తీసుకున్న సెల్ఫీ మరోసారి వైరల్ అవుతోంది. జార్జియా మెలోనీ సెల్ఫీ తీస్తుంటే, మన మోడీ తాతయ్య కుర్రకారుకు ఎంతమాత్రం తీసిపోకుండా అదిరిపోయేలా నవ్వుతూ సెల్ఫీ దిగారు. ఈ సందర్భం ఇటలీలోని అపులియా వేదికగా జరిగిన జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కుదిరింది. ఈ సమావేశంలో పాల్గొన్న మోడీకి ఇటలీ ప్రధాని మెలోని ‘నమస్తే’ అంటూ సాదర స్వాగతం పలికారు. కొద్దిసేపు వీరిద్దరూ ముచ్చటించుకున్న తర్వాత మరోసారి సెల్ఫీ దిగారు. ఇక చెప్పేదేముంది.. మొదటిసారి దిగిన సెల్ఫీ వైరల్ అయినట్టుగానే, ఈ సెల్ఫీ కూడా వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీ కింద సోషల్ మీడియాలో ‘ముసలోడేగానీ, మహానుభావుడే’ లాంటి అర్థం వచ్చే కామెంట్లు నెటిజన్లు పెడుతున్నారు. 

సముద్రపు నీటితో సీమసరుకు తయారు!

సాంబారు మహిమో, మరి దేని మహిమో తెలియదుగానీ, తమిళ తంబీల బుర్రల్లో క్రియేటివిటీ పాళ్ళు కాస్తే ఎక్కువే వుంటుందనే విషయం చాలామందికి తెలిసిందే. అలాంటి వెరైటీ క్రియేటివ్ మనుషులు ఇప్పుడు మరికొంతమంది వెలుగులోకి వచ్చారు. తమిళనాడులో ‘మద్యం ప్రియుల సంఘం’ అనే ఒక సంఘం వుంది. దానికి ఎం.ఎస్.ఆర్ముగం అనే వింత మనిషి ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ఈయన ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు. తమిళనాడులోని విగ్రవాండి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల జరుగుతోంది. ఆ స్థానం నుంచి ‘మద్యం ప్రియుల సంఘం’ తరఫున ఎం.ఎస్.ఆర్ముగం ఎన్నికల బరిలో నిలిచాడు. ఎన్నికలలో పోటీ చేయాలంటే, నామినేషన్ వేయాలంటే డిపాజిట్ చెల్లించాలి కదా.. ఆ డిపాజిట్ కోసం ఈ సంఘం సభ్యులందరూ ఏం చేశారంటే, మద్యం దుకాణాల దగ్గర దొరికే ఖాళీ బాటిళ్ళను సేకరించి, వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో డిపాజిట్ చెల్లించారు. జుట్టు విరబోసుకుని, చేతిలో పసుపు కొమ్ములు పెట్టుకుని ఆర్ముగం ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు.  ఈ ఎన్నికలలో విజయం సాధిస్తే, తాను ఏమేం చేయబోతున్నాడో ఆర్ముగం చెబుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం తాగి మరణించిన వ్యక్తుల కుటుంబాలలోని మహిళలకు నెలనెలా 10 వేలు పెన్షన్ ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్ చేస్తాడట. మద్యం కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువు ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తాడట. మద్యం తయారీకి ఉపయోగించే చెరకును ఉత్పత్తి చేస్తున్న రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని రిక్వెస్ట్ చేస్తాడట. సరే, ఇవన్నీ ఒకలా వుంటే, విచిత్రంగా వుండే మరో ఆలోచనని కూడా ఆర్ముగం బయటపెట్టాడు. సముద్రపు నీటి నుంచి బీరు, బ్రాందీ, విస్కీ లాంటి సీమ సరుకును తయారు చేసే విధంగా పరిశోధనలు జరిపిస్తాడట. ఏంటీ వింత హామీలు అని ఆర్ముగం తంబీ మీద విసుక్కోకండీ.. మద్యం ప్రియుల సంఘం సెక్రటరీ కదా... అందుకే తాగి వున్నాడని క్షమించేయండి.

జైలుపక్షి జగన్... నువ్వు ఇందుకే ఓడిపోయావ్!

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు ఇంత డబ్బు ఇచ్చాను.. ఇన్నిసార్లు బటన్లు నొక్కాను. అయినా ఎందుకు ఓడామో అర్థం కావడం లేదు అని అయోమయంగా ప్రశ్నిస్తున్నాడు. జగన్ అయోమయాన్ని వదిలి వాస్తవలోకి రావాలంటే ఈ క్రింది వాళ్ళని అడగాలని నెటిజన్లుగా వున్న సిటిజన్లు సూచిస్తున్నారు.  1. రామతీర్థంలో తెగిన శ్రీరాముని తలను అడుగు ఎందుకు ఓడావో. 2. అంతర్వేదిలో కాలిపోయిన రథాన్ని అడుగు ఎందుకు ఓడావో. 3. కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడావో. 4. నువ్వు హింసిస్తే చనిపోయిన  నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడావో. 5. మద్యం రేట్ల మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్‌ని అడుగు ఎందుకు ఓడావో. 6. మీ పార్టీ వాళ్ళు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడావో. 7. చనిపోయిన అబ్దుల్ సలాంని, మిస్బానీ, పాముల మునయ్యనీ అడుగు ఎందుకు ఓడావో. 8. ఇసుక దందా గురించి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్‌ని అడుగు ఎందుకు ఓడావో. 9. మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగలపెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడావో. 10. అమరావతిలోఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడావో. 11. మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ చేసిన కిరణ్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడావో. 12. బీళ్ళుగా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడావో. 13. పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడావో. 14. ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్టులను అడుగు ఎందుకు ఓడావో. 15. నెల జీతం వస్తుందో రాదో అని  ఎదురు చూసే ఉద్యోగస్తులను  అడుగు ఎందుకు ఓడావో. 16. కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడావో. 17. ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువతని అడుగు ఎందుకు ఓడావో. 18. గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడావో. 19. నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడావో. 20. అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడావో. 21. వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడావో. 22. ఐదేళ్ళు భయపడుతూ బతికిన ప్రజలను అడుగు ఎందుకు ఓడావో. 23. నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడావో. 24. గొడ్డలిపోటుతో చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడావో. 25. నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడావో. 26. నువ్వు కలవని నీ ఎమ్మెల్యేలు, ఎంపీలని అడుగు ఎందుకు ఓడావో. 27. నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడావో. 28. నువ్వు ద్వేషించే కమ్మవాళ్ళను అడుగు ఎందుకు ఓడావో. 29. చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు దేశవిదేశాల్లో రోడ్ల పైకొచ్చిన జనాలని అడుగు ఎందుకు ఓడావో. 30. శాసనసభలో భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడావో. 31. చంద్రబాబుని అంతటి పెద్దమనిషిని అనునిత్యం అవమానించిన నానీ గాడిని, రోజాని, పోసానిని, అడుగు ఎందుకు ఓడావో. 32. నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్  టెర్రరిజాన్ని అడుగు ఎందుకు ఓడావో. 33. రఘురామకృష్ణంరాజుని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడావో. 34. నువ్వు, నీ మనుషులు మింగేసిన గనులను, ఇసుకను అడుగు ఎందుకు ఓడావో. 35. ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడావో. నువ్వు ఎందుకు ఓడావో పూర్తిగా రాస్తే 100 పేజీల పుస్తకం అవుతుంది. నిన్ను భరించలేక బతికుండగా నీ తండ్రే నిన్ను దూరం పెట్టాడు.  నీ తండ్రి మిత్రులకు నీ సంగతి తెలిసి నిన్ను కలవరు.  నీ చెల్లిని ఇంటికి రానివ్వవు. నీ తల్లి నీ చెల్లితో వెళ్ళి పోయింది.  నీ బాబాయిని చేజేతులా చంపుకున్నావ్. కడపలో నీమనుషులెవరూ లేరు. నీకు కుటుంబం లేదు భార్య తప్ప,  నీకు  మిత్రులు లేరు,  నీకు ఆప్తులు లేరు,  ఓటేసే జనం లేరు.  ఇక ముందు ఉండరు.  నీకు నువొక్కడివే మిగిలావ్.  ఏకాకివి. జైలుపక్షివి.

పోలీసు శాఖ సమూల ప్రక్షాళన!

శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ ప్రశక్తే లేదనీ, పోలీసు శాఖ చట్ట ప్రకారం పని చేయాలనీ, వైసీపీ హయంలో పోలీసు శాఖ ఏలిన వారి తొత్తులా వ్యవహరించిందనీ ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రంలో పోలీసు శాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తామనీ, పోలీసులు చట్ట ప్రకారం పని చేయాలన్నారు. గత ప్రభుత్వ ఆలోచనలతో పని చేసే అధికారులెవరినీ ఉపేక్షించేది లేదన్నారు.  వంగలపూడి అనిత.. తెలుగుదేశంలో ఫైర్ బ్రాండ్ మహిళ. ఇప్పుడు చంద్రబాబు కేబినెట్ లో హోంమంత్రి. చంద్రబాబు కేబినెట్ లో స్థానం పొందిన అనితకు ముఖ్యమంత్రి హోంశాఖను కేటాయించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు.  ఉన్నప్పుడు జగన్ సర్కార్ పోలీసులను ఉపయోగించి ప్రత్యర్థులను ఎంతగా వేధించిందో తెలియంది కాదు. అలా పోలీసు వేధింపులకు స్వయంగా వంగలపూడి అనిత కూడా గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమె రాష్ట్రంలో పోలీసు శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు.  జగన్ సర్కార్ పోలీసు శాఖను తన జేబు సంస్థగా, తమ కనుసన్నలలో మెలిగే బానిస వ్యవస్థగా మార్చేసుకుందని విమర్శించారు. ఉనికిలోనే లేని దిశ చట్టాన్ని ఉన్నట్లుగా చెబుతూ జగన్ సర్కార్ ఆటలాడిందని విమర్శించారు. జగన్ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు, అకృత్యాలు జరుగుతున్నా పోలీసు శాఖ చోద్యం చూసినట్లు చూసిందనీ, అయితే ఆ పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండదనీ, మహిళలపై అఘాయిత్యాలు చేయాలంటూ భయపడేలా తమ ప్రభుత్వ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అదే విధంగా గంజాయి స్మగ్లింగ్, సరఫరాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పోలీసు అధికారులపై కక్ష సాధింపులు ఉండవని చెప్పిన అనిత తప్పు చేసిన వారిని గాడిలో పెట్టడం ప్రభుత్వ బాధ్యత అని ఆ దిశగానే తమ చర్యలు ఉంటాయని చెప్పారు.  గత ప్రభుత్వంలో పోటీసులు తనపై అట్రాసిటీ కేసు పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ పోలీసులు ప్రజల కోసం చట్ట ప్రకారం పని చేయాలని, వారి చేత అలా పని చేయిస్తామని స్పష్టం చేశారు. జగన్ హయాంలో  చాలా మంది ఐపీఎస్ లు వైసీపీకి, జగన్ కు తొత్తులుగా, తైనాతీలుగా పని చేశారని విమర్శించిన ఆమె , తమ ప్రభుత్వంలో  అటువంటి పరిస్థితి ఉండదన్నారు. ఐపీఎస్ లు, పోలీసుల గౌరవాన్ని పెంచేలా చంద్రబాబు ప్రభుత్వ పాలన ఉంటుందన్నారు.  పోలీసులు చట్ట ప్రకారం పని చేయాలని, అలా కాకుండా ఇప్పటికీ వైసీపీ ఆలోచనలతో పని చేసే అధికారులు ఎంతటి వారైనా ఉపేక్షించం, సహించమని స్పష్టమైన హెచ్చరిక  చేశారు.

ఊసరవెల్లికి ఉపాధ్యాయుడు ఉండవల్లి!

ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వైఎస్ హయాంలో రాజమహేంద్రవరం ఎంపీగా రెండు సార్లు పని చేసిన ఆయన వైఎస్ కు వీరభక్తహనుమాన్ గా గుర్తింపు పొందారు. వైఎస్ మరణం తరువాత ఆయన తన విధేయతను జగన్ వైపు మరల్చుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు. అప్పటి నుంచీ అడపాతడపా.. కాదు కాదు జగన్ కు ఇబ్బంది వచ్చిన ప్రతి సారీ మీడియా ముందుకు వచ్చి తనకు తప్ప మరెవరికీ సాధ్యం కాని లాజిక్ తో  ప్రసంగాలు దంచేస్తుంటారు.  ఉండవల్లి రంగులు మార్చే విద్యలో  ఊసరవెల్లికే పాఠాలు చెప్పగల దిట్ట. ఔను ఈ  స్వయం ప్రకటిత మేధావి  ఉండవల్లి జగన్ కుట్రలకు వత్తాసు పలుకడానికి తప్ప ఎన్నడూ మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు.  సీనియర్ రాజకీయ నాయకుడు అయి ఉండీ వాస్తవాలను కప్పిపుచ్చి తన వాగ్ధాటినంతా జగన్ కు మేలు చేసేలా ఉపయోగించడంతో  జనంలో క్రెడిబులిటీ కోల్పోయి చులకన అయ్యారు. ఎంత సేపూ తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, ఏపీ సీఎం జగన్ కు వత్తాసు పలికేందుకు నిజాలకు మసిపూసి అబద్ధాలకు మెరుగులద్దే విద్యలో ఆరితేరిన ఉండవల్లి.. మార్గదర్శిలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రామోజీరావుపై కేసు వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన చనిపోయిన తరువాత రామోజీ వంటి  శక్తిమంతుడైన వ్యక్తిని తానెన్నడూ చూడలేదంటూ పొగడ్తల వర్షం కురిపించి మొసలి కన్నీరు కార్చేందుకు ఇసుమంతైనా వెనుకాడలేదు.  రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత.. ఉండవల్లి క్రమం తప్పకుండా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పోలవరం, అమరావతి నిర్మాణాలపై తర్కానికి అందని విమర్శలు చేస్తూ ఉండేవారు. అదే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఉండవల్లి మీడియా ముందుకు జగన్ ను పొగడడానికి మాత్రమే వచ్చేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం పనులు ఆగిపోవడంపై కానీ, అమరావతిని జగన్ సర్కార్ నిర్వీర్యం చేయడంపై గానీ ఉండవల్లి ఎన్నడూ నోరెత్తిన దాఖలాలు లేవు.   ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయం పాలు కాగానే ఆయన అసలు ఏపీలో వైసీపీ అనే పార్టీయే లేదు ఉన్నదల్లా జగన్ ఒక్కడే అంటూ మీడియా ఎదుట ఓ బ్రహ్మాండమైన ప్రకటన చేసేసి ఆ విషయంలో తాను జగన్ కు ఎన్నిసార్లు సుద్దులు చెప్పినా పట్టించుకోలేదని ఒకింత అసహనం కూడా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ ఐదేళ్లూ జగన్ పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలని అన్యాపదేశంగా ఓ చిన్న బోధ కూడా చేసేశారు.   అధకారంలో ఉన్నంత కాలం జగన్ పార్టీ నేతలు సభ్యత, సంస్కారం మరచి బూతులతో ప్రత్యర్థి నేతలపై రెచ్చిపోయినప్పుడు వాటిని వారించడానికి కానీ, తప్పు అని చెప్పడానికి కానీ ఎన్నడూ నోరెత్తని ఉండవల్లి, జగన్ అధికారం కోల్పోగానే ఆయనకు మద్దతుగా బూతులు మాట్లాడిన నేతల కారణంగానే వైసీపీ పరాజయం పాలైందని ఓ స్టేట్ మెంట్ ఇచ్చి పారేశారు. ఇప్పటికైనా జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని సుద్దులు చెప్పిన ఉండవల్లి ఊసరవెల్లికే రంగులు మార్చే విద్యలో తర్ఫీదు ఇవ్వగలరనిపించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. 

అన్న క్యాంటిన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక!

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కొలువుదీరగానే పేదలకు తక్కువ ధరకే పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైలుపై సంతకం చేశారు. సెప్టెంబర్ 21లోగా రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పేదలకు కేవలం 15 రూపాయల ఖర్చుతో మూడు పూటలా కడుపు నింపాలన్న ఉదాత్త ఆశయంతో చంద్రబాబు ప్రభుత్వం గతంలో ప్రారంభించిన అన్న క్యాంటిన్లను జగన్ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పునరుద్ధరణ ఫైలుపై సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజునే సంతకం చేశారు. అంతే కాకుండా సెప్టెంబర్ 21లోగా అన్న క్యాంటిన్లను ప్రారంభించాలని ఆదేశించారు. ఇందు కోసం వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను చంద్రబాబు ప్రభుత్వం రూపొందించింది. ఈ ప్రణాళిక శనివారం (జూన్ 15) నుంచే ప్రారంభం అయ్యింది. పురపాలక, నగరపాలక సంస్థల కమిషనర్లు, ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను ఈ కార్యాచరణ ప్రణాళికలో భాగస్వాములను చేశారు.   గతంలో ప్రారంభించిన క్యాంటీన్నల ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే కమిషనర్లను ఆదేశించింది. గతంలో మంజూరు చేసిన  203 క్యాంటీన్లకు గాను 184 క్యాంటీన్లు అప్పట్లోనే పూర్తయ్యాయి.   పాత డిజైన్ మేరకు మిగిలిన వాటి నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక మేరకు శనివారం (జూన్ 15) పట్టణ, స్థానిక సంస్థల కమిషనర్లు తమ పరిధిలోని క్యాంటిన్లను పరిశీలించి భవనం తాజా పరిస్థితి, ఫర్నిచర్ ఇతర అవసరాలపై ప్రాథమిక నివేదిక రూపొందిస్తారు.  ఆ తరువాత జూన్ 19న క్యాంటిన్ల పునరుద్ధరణకు పాత డిజైన్ ప్రకారం భవన నిర్మాణ పనులకు మునిసిపల్ ఇంజినీర్లు, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో  కలిపి కమిషనర్లు అంచనాలు రూపొందిస్తారు. ఇక జూన్ 30 నాటికి ఇప్పటికీ భవన నిర్మాణాలు జరగని క్యాంటిన్ల పనులు చేపట్టేందుకు స్థానిక ప్రజా ప్రతినిథులతో కలిసి స్థలాల ఎంపిక జరుగుతుంది. క్యాంటీన్ల కోసం నిర్మించిన భవనాలలో నిర్వహిస్తున్న వార్డు, సచివాలయాలను ఖాళీ చేయించి వాటిని ప్రత్యామ్నాయ భవనాలను ఎంపిక చేస్తారు.  ఇక వచ్చే నెల 30 నాటికి   క్యాంటీన్లకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను ఖరారు చేస్తారు.  క్యాంటీన్ల పర్యవేక్షణ, స్మార్ట్ బిల్లింగ్, విరాళాల నిర్వహణకు సాఫ్ట్వేర్ కోసం సంస్థలను ఖరారు ఖరారు చేస్తారు.  ఇక ఆగస్టు 15 నాటికి క్యాంటీన్ భవన నిర్మాణ పనులు, కొత్తపరికరాలు, సాఫ్ట్వేర్ సమీకరణ, ఇతర మౌలిక సదుపాయాలకు ఏజెన్సీలతో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. అదే తేదీ నాటికి మిగిలిన క్యాంటీన్ భవనాల నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలతో  ఒప్పందాలు పూర్తి చేసుకోవలసి ఉంటుంది.  తాగునీరు, విద్యుత్తు, ఇంటర్నెట్ సహా సదుపాయాలన్నీ కల్పించాల్సి ఉంటుంది. ఇక  సెప్టెంబరు 21 నాటికి  పుర, నగరపాలక సంస్థల్లో 203 క్యాంటీన్లను ప్రారంభించాల్సి ఉంటుంది.

త్వరలో ఉత్తరాంధ్రలో రామోజీరావు విగ్రహ ప్రతిష్ఠాపన!

ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నామని విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు. శుక్రవారం కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉన్న శిల్పి దగ్గరకు వెళ్లి, రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని రూపొందించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ, తొలినాళ్లలో ఉత్తరాంధ్రలో విశాఖ తీరంలో ఈనాడు పత్రికను స్థాపించి.. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని రామోజీరావు గారు చైతన్యపరిచారని అన్నారు. ఈనాడు పత్రికలో ప్రజా సమస్యలను వార్తల రూపంలో ప్రచురించి, వాటిని పరిష్కరించే దిశగా వారధిలా రామోజీరావు పనిచేశారని తెలిపారు. దానికి కృతజ్ఞతగా ఉత్తరాంధ్రలో రామోజీరావు గారి నిలువెత్తు విగ్రహాన్ని మొదటగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని వెల్లడించారు. తెలుగుతనాన్ని, తెలుగు పౌరుషాన్ని, తెలుగు జాతిని కాపాడే దిశగా రామోజీరావు పత్రికలు, టీవీలు, ఫిలిం సిటీ, మార్గదర్శి సంస్థల ఏర్పాటుతోపాటు ఎంతోమంది కళాకారులని తీర్చిదిద్దారని అప్పలనాయుడు అన్నారు. రామోజీరావు గురించిన  అంశాలు  భావితరాలకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా, రామోజీరావు ప్రతిబింబాన్ని బాహ్య ప్రపంచానికి కనిపించే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తనకు క్రమశిక్షణ, బాధ్యతలు, సమాజంపై నమ్మకం ఈనాడు పత్రికలో పనిచేయడం వల్లనే తనకు అబ్బాయని అప్పలనాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతంలో రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న విషయాన్ని త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు. రెండో విగ్రహాన్ని రణస్థలంలోని సాయి డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రతిష్టించనున్నట్టు తెలిపారు.

జగన్ ‘డోర్ డెలివరీ’ అంటుంటే ఫుల్ కామెడీ!

జగన్ పార్టీ ఎమ్మెల్సీ అనంత్‌బాబు తన దగ్గర డ్రైవర్‌గా పనిచేసే డ్రైవర్ని ఎంచక్కా చంపేసుకుని, డెడ్ బాడీని  వెతుక్కోవడానికి పాపం ఆ డ్రైవర్ ఫ్యామిలీ ఎక్కడ ఇబ్బంది పడిపోతారో అని డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసు విషయంలో బుద్ధీ జ్ఞానం వున్నవాడు ఎవరైనా సరే, అనంత్ బాబుని పార్టీ నుంచి డిస్మిస్ చేసేస్తారు. కానీ, మన జగన్నన్న మాత్రం డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన అనంత్ బాబుని నెత్తిన పెట్టుకుని ఊరేగారు. ఈయనగారు రిమాండ్ పూర్తి చేసుకుని బయటకి వస్తే, వైసీపీ కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. ఎక్కడ వైసీపీ మీటింగ్ జరిగినా అనంత్ బాబు ఒక ప్రత్యేక అతిథిలాగా తళుక్కున మెరిసి మాయమైపోతూ వుండేవాడు. డెడ్ బాడీ హోమ్ డెలివరీ కేసు మీద మొదట్లో హడావిడి జరిగింది. ఆ తర్వాత ఆ కేసును అటక ఎక్కించేశారు. అనంత్ బాబు మొన్నటి వరకు హాయిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ వుండేవాడు. ఇప్పుడు అధికారం పోయింది కదా.. త్వరలో అనంత్ బాబు డోర్ డెలివరీ మర్డర్ కేసు కూడా లైన్లోకి వచ్చేఅవకాశం వుందిలెండి. ఇదిలా వుంటే, జగన్ నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్సీల సమావేశంలో ఆయన మాటల్లో ఐదారుసార్లు ‘హోమ్ డెలివరీ చేశాం.. హోం డెలివరీ చేశాం’ అని అన్నారు. జనాలకి డబ్బుని ఇళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చాం అనేది జగన్ ఉద్దేశం అయినప్పటికీ, ఆయన ‘హోం డెలివరీ’ అన్నప్పుడల్లా అక్కడున్న అందరికీ డ్రైవర్ డెడ్ బాడీ హోమ్ డెలివరీ చేసిన సంఘటన గుర్తొచ్చి నవ్వు ఆపుకున్నారు. ఆ వీడియో చూసిన వాళ్ళు అయితే హాయిగా పైకే నవ్వుకుంటున్నారు. తాను హోమ్ డెలివరీ అనే మాట అంటే అందరికీ ఆ మర్డర్ కేసే గుర్తొస్తుందని కూడా తెలియని అమాయకుడు మాజీ సీఎం జగన్.

ఉయ్యూరులో అన్న క్యాంటిన్.. చంద్రబాబే ప్రారంభించాలి!

ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు హామీలపై సంతకాలు చేశారు. తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టి నిరుద్యోగుల్లో ఆనందాన్ని నింపారు. దీనికితోడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ రూ.4వేలకు పెంపు, నైపుణ్య గణనపై సంతకాలు చేశారు. ముఖ్యంగా పేదల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ చంద్రబాబు ఐదవ సంతకం చేశారు. చంద్రబాబు నిర్ణయాలతో ఏపీ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు చిత్రపటాలకు యువత, పేద వర్గాల ప్రజలు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ముఖ్యంగా అన్న క్యాంటీన్ల పునరుద్దరణ ఫైలుపై చంద్రబాబు సంతకం చేయడం పట్ల పేద వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు క్తమవుతున్నాయి. 2014 నుంచి 2019 మధ్యకాలంలో టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఉదయం రూ.5కే టిఫిన్, రూ. 5కే మధ్యాహ్నం భోజనం, రూ. 5కే రాత్రి భోజనం అందించేవారు. పేద ప్రజలు పెద్ద సంఖ్యలో అన్న క్యాంటీన్ల ద్వారా తమ కడుపునింపుకున్న పరిస్థితి. దీనికితోడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం, ఉపాధి నిమిత్తం అమరావతి రాజధాని ప్రాంతంకు వచ్చిన వారికి అన్న క్యాంటీన్ల ద్వారా భోజనాన్ని అందించారు. దీంతో పేద వర్గాల ప్రజలు గతంలో టీడీపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత నుంచి అన్న క్యాంటీన్లు పూర్తిగా తొలగించి పేదల కడుపుకొట్టాడు.  అన్న క్యాంటీన్లు తొలగించడంతో పేదలు పస్తులుండగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొందరు టీడీపీ నాయకులే సొంత ఖర్చులతో అన్న క్యాంటీన్లను నిర్వహిస్తూ వచ్చారు. వారిలో అత్యధికులు నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జీలో, ఎమ్మెల్యే టికెట్  ఆశావహులో ఉన్నారు. కానీ కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి  మాత్రం ఎన్టీఆర్ పై అభిమానంతో, భక్తితో, చంద్రబాబుపై నమ్మకంతో, గౌరవంతొ, పార్టీ పట్ల అంకిత భావంతో తన కూడా సొంత ఖర్చులతో, స్థానిక సహకారంతో ఉయ్యూరులో అన్న క్యాంటీన్ నిర్వహించారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నారు. కేసులు బనాయించినా  దీటుగా దృఢంగా నిలబడ్డారు.  ఇప్పుడు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్న క్యాంటీన్లను పునరుద్దరిస్తూ సంతకం చేయడం పట్ల దండమూడి చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుకు   కృతజ్ఞతలు తెలుపుతూనే ఒక విజ్ణప్తి కూడా చేశారు.   అన్న క్యాంటీన్ల పునరుద్దరణనను తాము నిర్వహించిన అన్న క్యాంటీన్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు  ఆరంభించాలన్నదే దండమూడి వినతి. ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కొణతాల నారాయణ, స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్, గతంలో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి ప్రస్తుతం న్యూజివీడు నియోజకవర్గం నుంచి విజయం సాధించి మంత్రి అయిన కొలుసు ప్రార్ధసారధి వంటి నేతలు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తమ కోరిక తీర్చేలా చూడాలని దండమూడి చౌదరి కోరుతున్నారు. తద్వారా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైసీపీ దాష్టీకాలను ఎదుర్కొని పోరాడి నిలబడిన తన వంటి కార్యకర్తలకు గుర్తింపు లభించినట్లౌతుందన్నది దండమూడి చౌదరి భావన. ఈ చర్య  తనవంటి వారికి  పార్టీ కోసం మరింత పని చేయడానికి,  పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయడానికి ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుందని దండమూడి చౌదరి అంటున్నారు. ఇది డిమాండ్ కాదనీ, విజ్ణప్తి మాత్రమేనని పునరుద్ఘాటించిన దండమూడి కోరికను చంద్రబాబు తీరుస్తారనే అశిద్దాం. కార్యకర్తల కష్టాన్ని ఎప్పుడూ మరచిపోనని పదే పదే చెప్పే చంద్రబాబు దృష్టికి దండమూడి వినతి చేరాలని తెలుగుయువత కోరుతోంది. 

రోజా వారం వారం తిరుమల సందర్శనపై విచారణ!?

ఎన్నికలైన తరువాత నుంచీ రోజా ఎక్కడా వినిపించలేదు. ఎక్కడా కనిపించలేదు. పోలింగ్ రోజునే  తన పరాజయాన్ని అంగీకరించేసి, కౌంటింగ్ తొలి రౌండ్లలోనే కౌంటింగ్ కేంద్రం నుంచీ మీడియాకు ముఖం చాటేసి మరీ వెళ్లిపోయిన మాజీ మంత్రి రోజా  ఆ తరువాత పూర్తిగా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఆమె చెన్నైకి మకాం మార్చేసినట్లేనని కొందరు, కాదు కాదు బెంగళూరులో తలదాచుకున్నారని ఇంకొందరు అంటున్నారు. అవన్నీ ఎలా ఉన్నా.. మంత్రిగా ఉండగా ఆమె పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అవి ఆమెను వెంటాడుతున్నాయి. వేటాడుతున్నాయి అనిపించక మానదు. ఆమె మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే ఆమె నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు ఆమెకు కలెక్షన్ క్వీన్ అన్న బిరుదు కూడా ఇచ్చారు. ఇలా మంత్రి పదవి చేపట్టగానే అలా కలెక్షన్ కౌంటర్ ఓపెన్ చేసేశారంటూ ఆరోపణలు గుప్పించారు. రోజా సోదరుల దందా మితిమీరి సాగుతోందని విమర్శలు చేశారు. అవన్నీ పక్కన పెడితే  మంత్రి హోదాలో ఆమె వారం వారం తిరుమల సందర్శన చేయడంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. వందల మంది మందీ మార్బలంతో ఆమె తిరుమల సందర్శించి అందరికీ ప్రొటోకాల్ దర్శనాలు చేయింయడం వెనుక పెద్ద కుంభకోణమే ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.  తన వెంట వచ్చిన వారికి ప్రొటోకాల్ దర్శనం చేయించడం ద్వారా రోజా పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సాధారణ ప్రజల గురించి కూడా రోజా వారం వారం వందల మందితో చేసిస ప్రొటోకాల్ దర్శనాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.  రోజాతో పాటు ప్రొటోకాల్ దర్శనం చేసిన వ్యక్తుల ఆధార్ కార్డుల వివరాలు టీటీడీ వద్ద ఉంటాయనీ వాటి ద్వారా రోజా ప్రోటోకాల్ దర్శనాల గుట్టు బయటపెట్టొచ్చని అంటున్నారు.  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తిరుమలేశుని దర్శనానికి వచ్చిన నారా చంద్రబాబునాయుడు అక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రక్షాళన తిరుమల నుంచే మొదలౌతుందని అన్న నేపథ్యంలో.. రోజా ప్రోటోకాల్ దర్శనాల కుంభకోణంపై విచారణ వెంటనే జరిపించాలని ప్రజలు కోరుతున్నారు.   

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రులు...శాఖలు

* సీఎం చంద్రబాబు - సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు  * పవన్ కల్యాణ్ - పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ  * నారా లోకేష్ - మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ)  * వంగలపూడి అనిత - హోంశాఖ, విపత్తు నిర్వహణ   * అచ్చెన్నాయుడు - వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక  * కొల్లు రవీంద్ర - గనులు, జియాలజీ, ఎక్సైజ్  * నాదెండ్ల మనోహర్ - ఆహార, పౌరసరఫరాలు   * పొంగూరు నారాయణ - మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి  * సత్యకుమార్ యాదవ్ - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య  * నిమ్మల రామానాయుడు - జలవనరుల అభివృద్ధి   * ఎన్‍ఎండీ ఫరూక్ - న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమం  * ఆనం రామనారాయణరెడ్డి - దేవదాయ  * పయ్యావుల కేశవ్ - ఆర్థికం, ప్రణాళిక, వాణిజ్య పన్నులు   * అనగాని సత్యప్రసాద్ - రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు  * కొలుసు పార్థసారథి - గృహనిర్మాణం, సమాచార శాఖ  * డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి - సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలు  * గొట్టిపాటి రవికుమార్ - విద్యుత్ శాఖ  * కందుల దుర్గేష్ - పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ  * గుమ్మడి సంధ్యారాణి - మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం  * బీసీ జనార్ధన్ రెడ్డి - రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడులు   * టీజీ భరత్ - పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి  * ఎస్.సవిత - బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత  * వాసంశెట్టి సుభాష్ - కార్మిక, పరిశ్రమలు, బీమా, వైద్య సేవలు   * కొండపల్లి శ్రీనివాస్ - ఎంఎస్‍ఎంఈ, సెర్ప్, ఎన్‍ఆర్ ఐ వ్యవహారాలు  * మండిపల్లి రామ్‍ప్రసాద్ రెడ్డి - రవాణా, యువజన, క్రీడలు

చంద్రబాబు కేబినెట్ లో మంత్రుల శాఖలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వద్ద సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలతో పాటు కేబినెట్ లో మంత్రులకు కేటాయించని శాఖలన్నీ ఉంచుకున్నారు.  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. నారా లోకేష్ కు  మానవవనరుల అభివృద్ధి, ఐటీ ఏలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖలు కేటాయించారు. కింజరపు అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్ మెంట్, ఫిషరీస్ శాఖలను కూటాయించారు. కొల్లు రవీంద్రకు మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్ శాఖలకు కేటాయించారు. నాదెండ్ల మనోహర్ కు ఆహారం, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖలను కేటాయించారు. పొంగూరు నారాయణకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖలు కేటాయించారు. వంగలపూడి అనితకు హోం శాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు కేటాయించగా,  సత్యకుమార్ యాదవ్ కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖలను కేటాయించారు. అలాగే నిమ్మల రామానాయుడికి జలవనరుల అభివృద్ధి శాఖను కేటాయించారు. మహ్మద్ ఫరూఖ్  కు లా అండ్ జస్టిస్, మైనారిటీ సంక్షేమ శాఖ కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించారు. పయ్యావుల కేశవ్ కు ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ టాక్స్,లెజిస్లేటివ్ శాఖలను కేటాయించారు. అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖను, కొలసు పార్థసారథికి హౌసింగ్, సమాచార, పౌరసరఫరాల శాఖలను కేటాయించారు. అదే విధంగా డోలా బాల వీరాంజనేయస్వామికి సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ సంక్షేమం సచివాలయ, గ్రామ వాలంటీర్ శాఖలను కేటాయించారు.  ఇక గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖను కేటాయించారు. అదే విధంగా  కందుల దుర్గేష్ కు టూరిజం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫి శాఖలను, గుమ్మడి సంధ్యారాణికి మహిళా శిశుసంక్షేమం, గిరిజనాభివృద్ధి శాఖలను, బీసీ జనార్ధన్ రెడ్డికి రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు,  పెట్టుబడుల శాఖ కేటాయించారు. టీజీ భరత్ కు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలను, ఎస్ సవితకు బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్స్ శాఖలను, వాసంశెట్టి సుభాష్ కు కార్మిక, పరిశ్రమలు, బాయిలర్స్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖలను కేటాయించారు. ఇక కొండపల్లి శ్రీనివాస్ కు ఎమ్ఎస్ఎమ్ఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల శాఖలను, మందిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి ట్రాన్స్ పోర్ట్, యువజన, క్రీడా శాఖలను కేటాయించారు. 

జగన్‌కి ఈ జన్మలో సిగ్గు రాదు!

వైసీపీ నాయకులు వైఎస్ జగన్‌ ఎంత పెద్ద అబద్ధం చెప్పడానికైనా ఎంతమాత్రం సిగ్గుపడరు.. అధికారంలోకి రావడానికి, ఆ తర్వాత అధికారంలో వున్నప్పుడు సిగ్గుపడకుండా ఎన్నో అబద్ధాలు చెప్పారు.  ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కొంచెమైనా సిగ్గుపడతారేమోనని ఆశించడం దురాశే అని తెలిసిపోయింది. అంతేకాదు.. ఆయనకి ఈ జన్మలో సిగ్గు అనేది రాదు అనేది క్లారిటీగా అర్థమైపోయింది. తన పార్టీ ఎమ్మెల్సీలు ఎక్కడ చేపల్లాగా జారిపోతారో అని భయపడుతూ వాళ్ళతో జగన్ ఈమధ్య ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. వాళ్ళతో మాట్లాడుతూ, అధికారం కోల్పోయాం కాబట్టి మనకి భవిష్యత్తులో కష్టాలు వుంటాయి.. ఆ కష్టాలు ఎదుర్కొని నిలబడితే ఐదేళ్ళ తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పారు. ఇలా చెప్పడం అనేది, పార్టీలోంచి పారిపోకండి అని వాళ్ళకి జగన్ సగౌరవంగా చేసిన హెచ్చరిక. సరే, జగన్ చేసిన హెచ్చరికకి ఆయన పార్టీ ఎమ్మెల్సీలు ఎలా స్పందిస్తారో, వైసీపీలోనే వుంటారో లేక మరో పార్టీలోకి జంప్ అయిపోతారో మనకెందుకుగానీ, ఈ సమావేశం సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు వింటే మాత్రం, ఆయన ఈ జన్మలో మారడని, ఈ సిగ్గులేని బతుకు ఇలా కంటిన్యూ అవుతూనే వుంటుందని తెలిసిపోతోంది. అధికారంలో వున్నప్పుడు కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు అయిపోయాయట.. ఇప్పుడు మరో ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు మళ్ళీ అధికారంలోకి వస్తారట.. నిన్నగాక మొన్నే కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ పార్టీని తన్ని తరిమారు. జనం చేసిన గాయాలు మానడానికే చాలాకాలం పడుతుంది... కానీ, అధికార పార్టీ చాలా తప్పులు చేస్తుందని, ఐదేళ్ళ తర్వాత తన పార్టీదే అధికారమని ఆయన చెప్పుకొస్తున్నారు. ఏమిటి ఈయనకి వున్న ధైర్యం? ఏమిటి ఈయనకు చంద్రబాబు పరిపాలన మీద వున్న అపనమ్మకం? ఒకపక్క ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తూ వుండగానే, మరోపక్క ఈ సమావేశం జరిగింది. అప్పుడే ఈయన చంద్రబాబు పాలనలో ఫెయిల్ అయిపోతారని, ఈయన మళ్ళీ అధికారంలోకి వస్తారని కలలు కంటూ వుంటే, ఈయన్ని ఇంకేమనాలి?  తన ప్రసంగంలో మొత్తం ప్రజలకు అలా డబ్బు ఇచ్చాను.. ఇలా డబ్బు ఇచ్చాను.. అయినా మనకి ఓట్లు పడలేదని చెప్పుకుని బాధపడిపోయారు. అంటే, ఓట్ల కోసమే డబ్బు పంచానని జగన్ చెబుతున్నట్టే కదా? డబ్బు పంచాను అని చెప్పడం కూడా ఏదో తన సొంత ఆస్తి పంచి ఇచ్చినట్టు బిల్డప్పుతో చెబుతున్నారు. ఐదేళ్ళ కాలంలో తన సొంత ఆలోచనలతో ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా, అప్పుల మీద అప్పులు చేసి డబ్బు తెచ్చి బటన్లు నొక్కుతున్నాను అని గొప్పగొ చెప్పుకున్న ఈ మనిషికి జీవితంలో బుద్ధి వచ్చే అవకాశం లేదు.  ఇంత జరిగినా, ప్రజలు ఇంతలా బుద్ధి చెప్పినా, జగన్‌కి మాత్రం బుద్ధి వచ్చినట్టు కనిపించడం లేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు మీద విషం కక్కడమే... జనం ఇంత దారుణగా ఓడించారంటే, నా వైపు నుంచి తప్పేమైనా వుందా అని ఒక్క క్షణం కూడా జగన్ ఆలోచించిన దాఖలాలు కనిపించడం లేదు. తాను చాలా గొప్పవాడు.. చంద్రబాబు చాలా చెడ్డవాడు.. ప్రజలకి డబ్బు బోలెడంత ఇచ్చాను.. అయినా నన్ను ఓడించారు.. అయిదేళ్ళ తర్వాత మళ్లీ గెలుస్తాను.. మీటింగంతా ఇదే వరస. పోనీలే, జగన్ ఇలా మాట్లాడ్డమే మంచిది. ప్రజలకు ఈయన స్వభావం ఇంకా పూర్తిగా అర్థమయ్యే అవకాశం వుంటుంది. దేశంలో సిగ్గూశరం లేని రాజకీయ నాయకులు చాలామంది వున్నారు.. కానీ వాళ్ళందరిలో నంబర్‌వన్‌గా నిలిచే నాయకుడు జగన్.. నో డౌట్!