వైఎస్ ఆర్ సిపి రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు కుమార్తె అరెస్ట్
posted on Jun 19, 2024 @ 11:19AM
ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ సిపి కుటుంబాలు మొహం చెల్లక పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు చెక్కేసి అక్కడ దారుణాలకు తెగబడుతున్నారు. ఫ్రస్టేషన్ లో చెన్నై పారిపోయిన వైఎస్ఆర్ సిపి రాజ్య సభ సభ్యులు బీద మస్తాన్ రావు కుమార్తె మాధురి హిట్ అండ్ రన్ కేసులో ఒక యువకుడి ప్రాణాలు బలిగొంది. చెన్నైలో ఈ దారుణం జరిగింది.. వైఎస్సార్‌సీపీ ఎంపీ కుమార్తె కారు ఢీకొట్టడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బెసంట్‌నగర్‌కు చెందిన సూర్య పెయింటర్‌గా పని చేస్తున్నాడు. అయితే సోమవారం మధ్యాహ్నం బెసంట్‌నగర్ కళాక్షేత్రకాలనీ వరదరాజసాలైలో ఫుట్‌పాత్‌పై సూర్య మద్యం మత్తులో నిద్రపోయాడు. ఆ సమయంలో ఓ కారు ఫుట్‌పాత్‌పైకి వేగంగా దూసుకొచ్చి.. సూర్యపై ఎక్కింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడగా.. స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ప్రాణాలు కోల్పోయాడు.ఈ ప్రమాదానికి కారణమైన కారులో ఇద్దరు మహిళలున్నట్లు తెలుస్తోంది. ఆ కారును నడిపిన మహిళ అక్కడి నుంచి కారుతో సహా పారిపోయారు. మరో మహిళ ప్రమాదం గురించి ప్రశ్నించిన స్థానికులతో గొడవకు దిగారు తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ ఇద్దరు మహిళలూ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు, సూర్య బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్, కారు రిజిస్ట్రేషన్ నంబరు, పారిపోయిన మహిళల ఫొటోలున్నాయని వారు చెబుతున్నారు.వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు కుమార్తె మాధురిని సోమవారం రాత్రి చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె డ్రైవ్ చేస్తున్న కారు పేవ్‌మెంట్‌పై నిద్రపోతున్న వ్యక్తిపై నుంచి దూసుకెళ్లడంతో కొందరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సూర్యను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. అరెస్ట్ తర్వాత మాధురి స్టేషన్ బెయిలుపై బయటకు వచ్చారు.సూర్యకు 8 నెలల క్రితమే వివాహమైంది. విషయం తెలిసిన ఆయన బంధువులు జే-5 శాస్త్రినగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ప్రమాదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు సీసీటీవీ చెక్ చేయగా, ప్రమాదానికి కారణమైన కారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు గ్రూపు పేరిట పుదుచ్చేరిలో రిజిస్టర్ అయినట్టు గుర్తించారు.
కారుని మాధురి డ్రైవ్ చేసినట్టు గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు. బీద మస్తాన్‌రావు 2022లో రాజ్యసభ సభ్యుడయ్యారు. బీఎంఆర్ గ్రూప్ అనేది సముద్ర ఆహార ఉత్పత్తుల్లో చిరపరిచితమైన పేరు.