హామీల అమలు .. బాబు ముందు భారీ టాస్క్!
posted on Jun 19, 2024 @ 12:05PM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముందు భారీ టాస్క్ ఉంది. జగన్ తన అరాచక పాలనతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసేశారు. పాలన సాగించేందుకు అవసరమైన రోజు వారీ సొమ్ము కోసం కూడా అప్పులపైనే అధారపడేంత అద్వాన్నంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చేశారు. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కొలువుతీరడంతో చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాల్సి ఉంటుంది.
అంత కంటే ముందు ఆయన ఎదుట భారీ టాస్క్ ఒకటి ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జూలై మొదటి తేదీకి వృద్ధాప్య పింఛన్లు చెల్లించాల్సి ఉంది. అలాగే ఉద్యోగుల జీతాలు చెల్లించాల్సి ఉంది. ఈ రెండింటికీ రూ.11500కోట్లు సమీకరించాల్సి ఉంది. చంద్రబాబు ఉద్యోగుల జీతాలు 1వతేదీన వేస్తారని పేరు ఉంది. దాన్ని ఆయన అధికారంలో వచ్చిన తరువాత మొదటి నెలలోనే నిలుపుకోవాల్సిఉంది. జీతాలు రూ.6000కోట్లు కావాల్సిఉంది. అలాగే వృద్ధాప్య పింఛన్లకు రూ.5500కోట్లు కావాలి. జులై 1వతేదిన ఏప్రిల్ నెలలనుంచి వేయి చోప్పున మూడు నెలలకు మూడువేలు, జులై నెలది నాలుగువేలు కలిపి మొత్తం రూ.ఏడువేలు ఇస్తామని బాబు హామీ ఇచ్చారు.
అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాల్సి ఉంది. తెలంగాణలో లాగా ఆర్టీసీకి ప్రతినెల ఉచిత ప్రయాణ ఖర్ఛును చెల్లించాలి. అలాగే 18ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న హామీ ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను ఇస్తామని హామీ , రైతులకు పెట్టుబడి రూ.20వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పింది.ఖరీఫ్ సీజన్ ముంచుకొచ్చింది కావున రైతులకు వెంటనే ఇవ్వాల్సిఉంది. ఇవే కాక విద్యాదీవెన పథకం. ఈ పథకం కింద తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ చెల్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక నిరుద్యోగ భృతి నెలకు రూ.3000 ఇస్తామని హామీ ఇచ్చారు.అదీ వెంటనే ప్రారంభించాల్సి ఉంది. వీటన్నింటినీ అమలు చేయాలంటే రూ.1.75లక్షల కోట్లు అవసరం.
ఇక మెగా డీఎస్సీ నియామకాలు జరిగితే వేతనాల భారం మరింత పెరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు ముందున్న టాస్క్ నిధుల సమీకరణ. చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన గతంలో అలా చేసి చూపించారు. అయితే ఇప్పుడు సమస్య ఏమిటంటే.. జగన్ హయాంలో అరకొర సంక్షేమంతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. ఇప్పుడు చంద్రబాబు అభివృద్ధి కోసం ప్రణాళికలు అమలు చేసి రచించినా, వాటి ఫలాలు అందిరావడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఇచ్చిన హామీల అమలు మాత్రం సత్వరమే ఇంకా చెప్పాలంటే వెంటనే జరగాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు సీబీఎన్ ముందున్న పెద్ద సవాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.