మళ్ళీ లాక్ డౌన్ తప్పదా ?
మూడు నాలుగు నెలలుగా ప్రపంచంలో చాలా దేశాల్లో కొవిడ్ సెకండ్ వేవ్, డిఫరెంట్ వరిఎంట్ ప్రభావం కనిపిస్తోంది. ఫస్ట్ వేవ్లో అత్యంత వేగంగా, అత్యధికంగా కేసులు నమోదైన్ జర్మనీ, ఫ్రాన్స్ సహా మరి కొన్ని దేశాలు కొడ్ కట్టడికి లాక్ డౌన్ విధించాయి. అయితే కొత్తగ నమోదవుతున్న కేసుల సంఖ్య,మరణాల సంఖ్యా గణనీయంగా తగ్గడంతో పాటు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో మన దేశంలో ఆ పరిస్థితి రాదన్న భరోసా ఏర్పడింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం, దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండటంపై ఆందోళన వ్యక్తంచేశారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆయా రాష్రాలలో పరిస్థితిని,కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై చర్చించారు. కరోనా సెకండ్ వేవ్ నిరోధానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్నిటినీ మించి కరోనాపై పోరాటం ద్వారా మన దేశం సాధించిన ఆత్మవిశ్వాసం, అతివిశ్వాసానికి,నిర్లక్ష్యానికి దారితీయరాదన్నారు.కరోనా కొత్త కేసుల సంఖ్యా పెరుగుతున్నరాష్ట్రాలతో పాటుగా ఇరపగు పొరుగు దేశాలు ఇప్పుడే అడ్డుకట్ట వేయకపోతేమహమ్మారి మరోమారు దేశాన్ని చుట్టేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వైరస్ కట్టడికి భారీగా పరీక్షలు నిర్వహించంతో పాటు కొవిడ్ నిబంధనల్ని మరింత కఠినంగా అమలుచేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.
గత కొన్ని వారాలుగా మహారాష్ట్ర, కేరళ, మధ్య ప్రదేశ్, కర్ణాటక, సహా పలు రాష్ట్రాలలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. వైరస్ కట్టడికి ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో పలు నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తుండగా, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. కొవిడ్-19 ఫస్ట్ వేవ్ తోనే ఉక్కిరిబిక్కిరైన మహారాష్ట్ర,లో సెకండ్ వేవ్ మొదలైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్న మహారాష్ట్ర ప్రభుత్వం, అమరావతి, నాగ్‌పూర్ నగరాల్లో పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. ఇక పుణె, నాసిక్, ఔరంగాబాద్ నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు అమలు చేస్తున్నారు.
మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయ్యి. మధ్యప్రదేశ్ పలు నగరాల, పట్టణాలలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. అంతేకాకుండా మరోకొని చోట్ల మార్కెట్లను మూసివేస్తున్నట్లు వెల్లడించారు. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న జిల్లాల్లోనూ ఆంక్షలు విధిస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం పేర్కొంది.గుజరాత్ లోనూ అదే పరిస్థితి. కొవిడ్ ఉదృతి పెరగడానికి వ్యాక్సిన్ వచ్చిందన్న ధైర్యంతో ప్రజలు కొవిడ్ నిబంధనల పాటించక పోవడం కూడా ఒక ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే ధైర్యంతో ఉన్న కొందరు, మాస్కులు, భౌతికదూరాన్ని పాటించకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి పెరుగుతోందని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కూడా నిర్లక్ష్యంగా ఉండడంతోనే దేశంలో వైరస్ తీవ్రత ఎక్కువవుతోందని అన్నారు. ఈ పరిస్థితులలో దేశంలో మరో మారు లాక్ డౌన్ విధించే అవకాశాలను పూర్తిగా కొట్టివేయలేమని, అయితే అయితే, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా పూర్తిలాక్‌డౌన్ పరిష్కారం కాదని, స్థానికంగా జిల్లా స్థాయిల్లో ఆంక్షలతో దీన్ని కట్టడి చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా మహామ్మారే కాదు .. లాక్ డౌన్ ముప్పు కూడా ఇంకా తొలిగి పోలేదు.