ప్రధాని కావాలని జగన్ ఆశ? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశానికి ప్రధాని కావాలని ఆశపడుతున్నారా?ఆ దిశగా ఆయన పావులు కదుపుతున్నారా? అంటే అవుననే అంటున్నారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ప్రధానమంత్రి కావాలని ఉందన్నారు రఘురామ కృష్ణంరాజు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కూడగట్టిన డబ్బులతో ప్రధానమంత్రి కావాలన్న ఆయన కోరికను పైనున్న దేవతలు, ఆయన నమ్మిన క్రీస్తు కూడా హర్షించరని చెప్పారు. రెడ్డి క్యాస్ట్‌ను మరోసారి ఎత్తి చూపిన రఘురామ... వైఎస్సార్ కులంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ‘‘మీకు మీరే అనేసుకుంటే సరిపోతుందా? నీ బాబు... నీ అమ్మ కులం సర్టిఫికేట్లలో కాపు అని ఉంటే... రెడ్డి ఎలా అవుతారు? ఇప్పుడు సర్టిఫికేట్లు మార్చుకుని రెడ్లు.. రెడ్లు అనుకుంటే నీ తండ్రి కులం, తల్లి కులం కానిది నీకెలా వచ్చిందిరా రెడ్డి?  వైఎస్ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో కాపు ఉంటే... జగన్ ‘రెడ్డి’ ఎలా అవుతాడురా.. కాపే అవుతాడు’’ అన్నారు రఘురామ కృష్ణం రాజు.  ఏపీలో కరోనా బాధితులకు చాలా అన్యాయం జరుగుతోందని రఘురామ విమర్శించారు. ఆస్పత్రుల్లో జరుగుతున్న అన్యాయాలను పట్టించుకునేవారు లేరని, సీఎం జగన్ నిర్లక్ష్యంవలనే 46 మంది చనిపోయారని ఆరోపించారు. మన తప్పు కానప్పటికి మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై రఘురామ మండిపడ్డారు. సీఎం తన జేబులోంచి డబ్బులు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడంకాదని.. జగన్‌పై కేసు పెట్టాలన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులకు సంబంధించి దొంగ లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుంటే రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టకుండా కర్ఫ్యూ పెట్టడమేంటని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల ప్రాణాలు, శవాలతో వ్యాపారం చేయడం సరికాదని రఘురామ కృష్ణంరాజు హితవుపలికారు. వైసీపీ నేతలపై ఎంపీ రఘురామ  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనపై సోషల్ మీడియా ద్వారా దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. తనను విమర్శిస్తున్నవారికి కౌంటర్ ఇవ్వకుండా ఎలా ఉంటానని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని తన నివాసంలో  నిర్వహించిన రచ్చబండలో వైసీపీ నేతలను విరుచుకుపడ్డారు రఘురామ.  ‘పోకిరి సినిమాలో ప్రకాశ్ రాజ్‌ అన్నట్టు గిల్లితే గిల్లుంచుకోవాలా? వాయిస్ వినిపించకూడదా? ఆపండ్రా... ఈ ఎదవ చెత్త’’ అని రఘురామ కృష్ణం రాజు మండిపడ్డారు.   

ఎన్నికల్లో వందల కోట్ల ఖర్చు.. కరోనా కష్టాల్లో కనిపించని నేతలు

ఏ ఎన్నిక వ‌చ్చినా అభ్య‌ర్థులు ఈజీగా ఓ 20 నుంచి 50  కోట్లు ఖ‌ర్చు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఇదీ ఇంకా ఎక్కువే. ఒక్కో ఓటుకు వేల‌కు వేలు ఇస్తారు.  ఎన్నిక‌ల కోస‌మే అన్ని కోట్లు ఖ‌ర్చు చేసి ప్ర‌జాప్ర‌తినిధులుగా గెలిచిన నాయ‌కులు.. గెలిచాక త‌మను గెలిపించిన ప్ర‌జ‌ల కోసం ఒక్క రూపాయి అయినా ఖ‌ర్చు చేస్తున్నారా? అనేది ప్ర‌శ్న‌. అధికారాన్ని అడ్డుపెట్టుకొని.. ఇసుక నుంచి, మైన్ల నుంచి, మ‌ద్యం షాపుల నుంచీ, ప్రాజెక్టులు, అభివృద్ధి ప‌నుల నుంచి కోట్ల‌కు కోట్లు దండుకుంటున్నారు. వ‌సూల్ రాజాలుగా మారుతున్నారు. ఇలా ఈ రెండేళ్ల కాలంలోనే అనేక మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. వంద‌ల కోట్ల‌కు ప‌డ‌గెత్తారు. ఇక ప్ర‌జ‌ల‌కు అంద‌నంత ఎత్తుకు ఎదిగిపోయారు.  ఎంత సంపాదించుకున్నా.. ప్ర‌జ‌ల‌కు ఎంతో కొంత తిరిగి ఇచ్చేస్తే బాగుంటుంది. లేదంటే ప్ర‌జ‌ల ముందు దోషిగా నిల‌బ‌డ‌తారు. ఆ ఇచ్చేదేదో ఏ ఎన్నిక‌ల టైమ్‌లో తాము గెలిచేందుకు తాయిలాల రూపంలో కాకుండా.. ప్ర‌స్తుత క‌రోనా క‌ల్లోల స‌మ‌యంలో ప్ర‌జ‌ల ప్రాణాలు నిలిపేందుకు ఖ‌ర్చు చేస్తే బాగుంటుంద‌నే చ‌ర్చ మొద‌లైంది. అందుకు తాము సంపాదించేసిందంతా ఊడ్చేసి.. కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చుచేయాల్సిన ప‌నిలేదు. త‌మ అక్ర‌మ, స‌క్ర‌మ సంపాద‌న‌లో ఓ వంతు విదిల్చినా చాలు. అనేక మంది ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. సినీ హీరో సోను సూద్ కరోనా కష్టాల్లో ఎంతో మందికి ఆపద్బాందుడిగా నిలిచారు. తన ఆస్తులను తాకట్టు పెట్టి మరీ కరోనా బాధితులకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వాలు చేయలేని పనులు చేస్తూ రియల్ హీరోగా మారారు. కాని కోట్లాది రూపాయలు కూడబెట్టిన ప్రజా ప్రతినిధులు మాత్రం కరోనా కష్ట కాలంలో ప్రజలకు కనిపించకుండా పోయారు.  ఏపీ వ్యాప్తంగా దాదాపు ప్ర‌తీ జిల్లాలోనూ క‌రోనా రోగుల‌కు బెడ్స్ దొర‌క‌డం లేదు. ప్రైవేట్ హాస్పిట‌ల్స్‌కు వెళితే.. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు లాగేస్తున్నారు. అందుకే, చాలా మందికి ప్ర‌భుత్వ ఆసుప‌త్రులే దిక్కు. అక్క‌డ స‌రిప‌డా ప‌డ‌క‌లు లేవు. ఒక్కో బెడ్ మీద ఇద్ద‌రిని, ముగ్గురుని ఉంచి వైద్యం చేస్తున్న దుర్బ‌ర ప‌రిస్థితులు. అనేక మందిని నేల పైనో, కుర్చీల్లోనో ఉంచి చికిత్స చేస్తున్న దృశ్యాలు కోకొల్ల‌లు. ఇక మందులు, ఆక్సిజ‌న్ కొర‌త గురించి చెప్ప‌న‌వ‌స‌ర‌మే లేదు. ఇంత దారుణ ప‌రిస్థితులు ఉంటున్నా.. ఏ ఒక్క ప్ర‌జాప్ర‌తినిధి అయినా అటువైపు క‌న్నెత్తి చూస్తున్నాడా? క‌నీసం ప‌ట్టించుకుంటున్నాడా? అలా చేష్ట‌లుడిగి ఉండే దానిక‌న్నా.. త‌మ వంతుగా ఎంతోకొంత ఉడ‌తా సాయం చేయొచ్చుగా. వారంతా త‌మ‌కు ఓటేసిన ప్ర‌జ‌లేగా. త‌మ‌ను గెలిపించిన ఓట‌ర్లేగా. వాళ్ల‌కు మంచి చేస్తే మ‌ళ్లీ వాళ్లు ఓట్ల రూపంలో త‌మ రుణం తీర్చుకుంటారుగా. కానీ, ఏ ఎంపీ కానీ, ఏ ఎమ్మెల్యే కానీ.. అలాంటి  మంచి చేసే పాపాన పోవ‌డం లేదు. అధికార పార్టీ నేతలైతే ప్రజలను గాలికొదిలేసి గుర్రపు స్వారీలు చేస్తూ జల్సాలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలే జనంలోకి వెళ్లే వాళ్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోనే బెడ్స్ కొర‌త తీవ్రంగా ఉంది. ఇక మండ‌లాలు, గ్రామాల్లో ప‌రిస్థితి మ‌రింత దారుణం. ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌క వ‌ర్గ ప‌రిధిలో తాత్కాలిక కొవిడ్ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందిగా? అన్నీ ప్ర‌భుత్వ‌మే చేయాలా? అన్నిటికీ ప్ర‌భుత్వ‌మే కావాలా? ఏం.. త‌మ ప‌ర‌ప‌తితోనో, త‌మ డ‌బ్బుతోనో.. ఏ ఫంక్ష‌న్ హాల్‌నో, ఏ బ‌డినో, ఏ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ప్రాంగ‌ణాన్నో తాత్కాలిక కొవిడ్ ఐసోలేష‌న్ కేంద్రాలుగా మార్చొచ్చుగా. గ్రామ‌, మండ‌ల స్థాయిలో.. ఎక్క‌డిక‌క్క‌డ‌.. ప‌దుల సంఖ్య‌లో బెడ్స్ ఏర్పాటు చేసి.. న‌లుగురు వైద్య‌ సిబ్బందిని అరేంజ్ చేసి.. కొవిడ్ ట్రీట్‌మెంట్ ఇప్పించొచ్చుక‌దా. రాష్ట్ర వ్యాప్తంగా రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్ల‌కు తీవ్ర కొర‌త ఉంది. ఎమ్మెల్యే, ఎంపీ ఫండ్స్ నుంచో.. లేక‌పోతే మీ సొంత నిధుల‌తోనో క‌రోనా మెడిసిన్‌కు ఆర్డ‌ర్ పెట్టి ప్రాంతాల వారీగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచొచ్చు క‌దా. త‌మ నియోజ‌క వ‌ర్గంలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు నిల్వ ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చుగా. త‌ప్పేముంది?  పాల‌కులు విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కాకుండా.. ఇంకెప్పుడు ఇలాంటి ప‌నులు చేస్తారు. డ‌బ్బులు ఖ‌ర్చు చేయాల్సింది ఇలాంటి స‌మ‌యంలోనే క‌దా. ఇప్పుడు కాక‌పోతే.. ఇంకెప్పుడు? ఎమ్మెల్యే, ఎంపీల‌కు నిధుల‌కు ఏమైనా కొర‌త ఉందా?  నెల‌కు ల‌క్ష‌ల్లో జీతాలు తీసుకుంటారు. అల‌వెన్సులు గ‌ట్రా అధిక మొత్తంలోనే ఉంటాయి. వారి చేతిలో ఎమ్మెల్యే ఫండ్‌, ఎంపీలాడ్స్ లాంటి నిధులు అందుబాటులో ఉంటాయి. ఒక‌వేళ వాటిని ఖ‌ర్చు చేయ‌డానికి రూల్స్ ఒప్పుకోక‌పోయినా.. ప్ర‌స్తుత క‌ష్ట‌కాలంలో త‌మ జేబుల‌ నుంచి సొమ్ములు తీసి ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడేందుకు ఖ‌ర్చు చేయ‌వ‌చ్చుగా.    ఎన్నిక‌ల వేళ‌.. అడ‌గ‌కున్నా.. పోలింగ్ చీటీలు ప‌ట్టుకొని.. వెతుక్కుంటూ వ‌చ్చి మ‌రీ చేతిలో వేల‌కు వేలు పెట్టి త‌మ‌కే ఓటేయ‌మ‌ని చెప్పి వెళ్తారే.. ఇప్పుడూ అలానే ఎక్క‌డెక్క‌డ క‌రోనా పేషెంట్లు ఉన్నారో లిస్టు తీసుకొని.. వారి ప‌రిస్థితి ఎలా ఉంది?  వారికి మందులు అందుబాటులో ఉన్నాయా? హాస్ప‌టిల్‌లో చేర్పించాల్సిన అవ‌స‌రం ఉందా?  బెడ్స్ ఉన్నాయా?  రెమ్‌డెసివిర్ స్టాక్ ఉందా? ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు స‌రిప‌డా ఉన్నాయా? ఐసోలేష‌న్ సెంట‌ర్స్ కావాలా? ఇలా రోగులకు కావాల్సిన వైద్య‌, ఆరోగ్య సేవ‌ల‌ను అందించే ప్ర‌య‌త్నాన్ని ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎందుకు చేయ‌డం లేదు?  బ‌రువంతా అధికారులు, వైద్య సిబ్బంది మీదే వ‌దిలేసి.. తాము మాత్రం ఎంచ‌క్కా ఏసీ గ‌దుల్లో సేద తీరుతుంటే.. ఇక్క‌డ ప్ర‌జ‌లు కొవిడ్‌తో పిట్ట‌ల్లా రాలిపోతుంటే.. త‌మ‌కు ప‌ట్ట‌డం లేదా మ‌హాప్ర‌భో. ఇప్ప‌టికైనా స్పందించండి.. కాస్త క‌నిక‌రించండి.. మ‌న‌వ‌తా ధృక్ప‌దంతో వ్య‌వ‌హ‌రించండి.. మీ నిధులు కొన్ని విదిలించండి.. ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడి పుణ్యం కట్టుకోండి. ఇది.. ఓ ఓట‌రు ఆవేద‌న‌. ప్ర‌జ‌ల ఆక్రంద‌న‌. మ‌రి, ఇది మీ చెవికి సోకుతుందా? ఈ మంచి మీ త‌ల‌కు ఎక్కుతుందా? క‌రోనా క‌ల్లోల స‌మ‌యంలో మీ వంతుగా ఉడ‌తాభ‌క్తి సాయానికి సిద్ధ‌మా?  మిమ్మ‌ల్నే అడుగుతోంది.. ఓ ఎమ్మెల్యే గారూ.. ఓ ఎంపీ గారూ.. విన‌బ‌డుతోందా....  

డబ్బుల కోసం తల్లిని చంపి.. చివరికి.. 

మల్లేష్, స్వరూప ఇద్దరు దంపతులు. వారి కుమారుడు హరి. అతని వయసు 26 సంవత్సరాలు. వారిది కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం రాసపల్లి. బతుకు దెరువుకోసం  30 ఏళ్ల కిందట నగరానికి వచ్చి హైదరాబాద్ కి వచ్చారు. చింతల్ పరిధి లో భగత్ సింగ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. మలేష్ సనత్ నగర్ లో  టైలరింగ్‌ దుకాణంతో జీవనం సాగిస్తున్నాడు. భార్య స్వరూప కూడా ఇంటి వద్ద టైలరింగ్‌ చేస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు హరి(26). కుమార్తెలకు వివాహం జరిపించారు. హరి ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. రెండేళ్లుగా ఓ పరిశ్రమలో పనిచేస్తున్నట్లు ఇంట్లోవారిని నమ్మించి ఉదయం టిఫిన్‌తో వెళ్లి సాయంత్రం తిరిగొచ్చేవాడు. ఇంట్లో పైసా ఇవ్వకపోగా దుబారా ఖర్చుల కోసం తల్లిదండ్రులను వేధించేవాడు.   మల్లేష్‌ ప్రతిరోజులాగే సోమవారం ఉదయం మల్లేష్‌ హరిని ద్విచక్రవాహనంపై బాలానగర్‌ నర్సాపూర్‌ కూడలిలో వదిలి వెళ్లిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి స్వరూప విగతజీవిగా పడి ఉంది. మెడకు టవల్‌తో ఉచ్చు బిగించి ఉంది. వెంటనే కుమారుడికి ఫోన్‌ చేయగా, బాలానగర్‌లో ఉన్నానని వస్తున్నానని చెప్పాడు. మంగళవారం మల్లేష్‌ జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె ఒంటిపై పుస్తెలతాడు, ఇంట్లో బంగారు నగలు, నగదు కనిపించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు నగల కోసం హత్యచేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు.    ఇంట్లోని పైఅంతస్థులో మల్లేష్‌ కుటుంబం నివాసముంటుండగా కింద రెండు పోర్షన్లు అద్దెకిచ్చారు. మధ్యాహ్నం భర్త ఫోన్‌ చేసినప్పుడు ఎప్పుడూ సందడిగా ఉండే ఇరుకైన వీధి, ఇంట్లో కింది పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న కుటుంబాలకు అలికిడి లేకుండా దొంగలు వచ్చే అవకాశం లేకపోవడంతో జులాయిగా తిరిగే హరిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు చింతల్‌ నుంచి బాలానగర్‌ వరకు సీసీ కెమెరాలను పరిశీలించగా హరి ఆ చుట్టుపక్కలే తచ్చాడినట్లు తేలింది. అతడిని విచారించగా నగల కోసం హత్య చేసినట్లు తేలింది.   జనాల్లో విలువలు లేకుండా పోతున్నాయి. చిన్న చిన్న విషయాలకు తాము చనిపోవడం, ఇంట్లో వాళ్ళను చంపడం లాంటి అఘాయిత్యాలకు పాలుపడుతున్నారూ. ఇలాంటి కేసులు రోజులు రోజుకి పెరిగిపోతున్నాయి. పని చేయకపోగా ఇంట్లో వాళ్ళదగ్గరే డబ్బులు అడగడం వాళ్ళు ఇవ్వకపోవడంతో వారిమీద కక్ష తీసుకోవడం. వారిని కడతేర్చడం మనం రోజు చూస్తున్నాం.       

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి  సోనియా గుడ్ బై...?

నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎట్టకేలకు పెదవి విప్పారు.ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె మనసు విప్పి మాట్లాడారు. ఈవీఎంల మీదనో. లేక మరెవరి మీదనో ఓటమి నెపాన్నినెట్టి  చేతులు దులిపేసుకోవడం కాకుండా, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  ఘోర పరాజయం పై ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ఈ ఓటమిని తేలిగ్గా తీసుకోలేమని,తీసుకోరాదని కొంచెం చాలా గట్టిగానే బాధను వ్యక్తపరిచారు.   అలాగే, ఈ ఓటమి నుంచి గుణ పాఠాలు నేర్చుకోవాలనీ అన్నారు. అలాగే, షరా మాములుగా, ఓటమి కారణాల విశ్లేషణకు ఓ చిన్న కమిటీ ఏర్పాటు చేస్తామని,ఆ కమిటీ అట్టే సమయం తీసుకోకుండా నివేదిక తయారు చేస్తుందని, సోనియా చెప్పారు. అంటే, వరసగా రెండు సార్లు లోక్’సభ ఎన్నికల్లో రుచి చూసిన మహా ఓటమి కంటే, అలాగే, యూపీ, బీహార్, గుజరాత్ వంటి కీలక రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల శాసన సభ ఎన్నికలలో ఎదురైన వరస ఓటముల కన్నా,ఈ తాజా ఎన్నికల ఓటమి భయంకరమైనదా, ఈ ఓటమి విషయంలోనే సోనియాగాంధీ ఇంతలా ఎందుకు స్పందించారు? నిజానికి గతంలో ఎదురైనా ఓటములతో పోలిస్తే, ఇదేమంత అనూహ్య ఓటమి, అసలే మింగుడుపడని ఓటమి కాదు. అయినా, ఆమె ఇంతలా దిగివచ్చి ఆత్మ పరిశీలన, ఇంటిని చక్కదిద్దుకోవడం వంటి వ్యాఖ్యలు ఎందుకు చేసినట్లు? ఇవి రాజకీయ వర్గాల్లో, వినవస్తున్నప్రశ్నలు.  నిజానికి, 2014. 2019 సార్వత్రిక  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ‘చారిత్రక ఓటమి’ని సొంత చేసుకుంది. 2014లో  పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కేవలం 44 సీట్లకుపరిమితం అయింది. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా పొందలేక పోయింది. అలాగే, 2019 లోనూ లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం రెండంకెల సంఖ్యను దాటలేదు. ఈ రెండు సందర్భాలలోనూ కాంగ్రెస్ పార్టీ కనీసం ఓ ఐదారు రాష్ట్రాలలో బోణీ అయినా కొట్టలేదు, ఒక్క సీటులోనూ గెలవలేదు. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే, ఒకప్పుడు దేశంలో అత్యధిక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వరసగా ఒక్కొక్క రాష్ట్రంలో అధికారాన్ని చేజార్చుకుంటూ వచ్చి, ప్రస్తుతం మూడు రాష్ట్రాలకే కాంగ్రెస్ అధికారం పరిమితం అయింది.  ఇవ్వన్నీ కూడా బాధించే ఓటములే, అయినా, ఆ అన్నిటికంటే, ప్రస్తుత ఓటమి మాత్రమే మహా ఓటమిగా కాంగ్రెస్ అధినాయకురాలు ఎందుకు భావిస్తున్నారు? ఇది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. ఇంతవరకు అంతో ఇంతో మిగిలిన ఆశలు కూడా ఈ ఓటమితో అవిరై పోయాయా? అలాగే, రాహుల గాంధీ సామర్ధ్యం మీద ఉన్న ఆశలు సైతం.. అడుగంటి పొయాయా?రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న కోరిక విషయంలోనూ, ఆమె అది అయ్యేది కాదన్న నిర్ణయానికి వచ్చారా? అందుకే సోనియా చేతులు ఎత్తేశారా? అంటే, పార్టీఅంతరంగికులు అవుననే అంటున్నారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకులు (గ్రూప్ అఫ్ 23) పార్టీలో సమూల మార్పులు అవసరమని, ఇంచు మించుగా రెండు సంవత్సరాల క్రితం ఆమెకు రాసిన లేఖ ప్రభావంతోనే ఆమె, పార్టీ పగ్గాలు వదిలే ‘అంతిమ’  నిర్ణయం తీసుకున్నారా? అంటే అందుకు కూడా ఇటు పార్టీ వర్గాలు, అటు రాజకీయ విశ్లేషకులు కూడా అవుననే సమాధానం ఇస్తున్నారు. ఈ ఎన్నికల ఓటమితో సోనియా గాంధీలో కాంగ్రెస్ పార్టీ మనుగడ పట్ల, పార్టీ పై కుటుంబ పెత్తనం కొనసాగింపు విషయంలోనూ మిగిలిన ఆశలు అడుగంటి పోయాయని అందుకే,ఆమె కాడి వదిలేసేందుకు సిద్దమయ్యారని రాజకీయ వర్గాల్లో వినవస్తోంది.  అదే విధంగా మమతా బెనర్జీ లేదా చంద్రబాబు నాయుడు వంటి మరో బలమైన ప్రాంతీయ పార్టీ జాతీయ నాయకుని సారధ్యంలో,  బీజేపీని సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు ప్రత్యాన్మాయ ఫ్రంట్ ఏర్పాటుకు జరుగతున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ అవరోధం కారాదన్న ఉద్దేశంతో కూడా, సోనియా గాంధీ వాస్తవ అవగాహనకు వచ్చారని, పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీపై గాంధీ నెహ్రూ కుటుంబం ఆధిపత్యాన్ని ‘త్యాగం’ చేసేందుకు ఆమె సిద్ధమయ్యారని అందుకే ఆత్మ పరిశీలన అవసరాన్ని నొక్కి చెప్పారని అంటున్నారు.  అదలా ఉంటే, సోనియా గాంధీ తమ ప్రసంగంలో మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. మిగిలిన విషయాలను పక్కన పెట్టి ముందుగా ‘మన ఇంటిని మనం చక్క దిద్దుకుందాం’ అని అన్నారు. సోనియా గాంధీ చేసిన, ‘ఇంటిని చక్క దిద్దుకుందామనే వ్యాఖ్యపై ఇప్పుడు పార్టీ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. నిజనికి పార్టీ సీనియర్ నాయకులు రాసిన లేఖలో కోరింది కూడా ఇదే.. అయిన దానికి కానీ దానికి మోడీని, బీజేపీని విమర్శించడం వలన ప్రయోజనం లేదని , ముందుగా ఇంటిని చక్కదిద్దుకుందామనే సీనియర్ నేతలు కోరారు. ఇప్పుడు సోనియా గాంధీ కూడా అదే మాట అన్నారంటే ,ఆమె కూడా సీనియర్ నేతల ఆలోచనలతో ఎకీభవిస్తున్నట్లే అనుకోవచ్చును.   నిజమే, ఇటీవల  జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ, ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది.చివరకు ప్రణబ్ దాదా వంటి ఉద్దండ నేతలను ఇచ్చిన పశ్చిమ బెంగాల్లో పార్టీ అసలు ఖాతానే తెరవలేదు. వామ పక్షాలతో పొత్తు పెట్టుకున్నా, పోటీ చేసిన స్థానాల్లో  మూడొంతులకు పైగా స్థానాల్లో పార్టీ అభ్యర్ధులు డిపాజిట్స్ కూడా కోల్పోయారు. కేరళ, అస్సాం రాష్త్రాలలో ఆశించిన విధంగా హస్తం పార్టీ అధికారం సాధించేలేక పోయింది. పుదుచ్చేరీలో ఉన్న అధికారం కోల్పోయింది. ఒక తమిళనాడులో మాత్రం, అది కూడా, డిఎంకేతో పొత్తు పుణ్యాన పరువు నిలుపుకుంది. కొద్దిగా మెరుగైన ఫలితాలు సాధించింది. ఈ నేపధ్యంలోనే సోనియా గాంధీ, బీజేపీ వ్యతిరేక శక్తుల సారధ్య బాధ్యతల నుంచి  తప్పుకోవడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ, ఫ్యామిలీ  కూడా అడ్డుగా నిలవరాదనే ఉద్దేశంతోనే, ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.  అయితే, సోనియా గాంధీ నిజంగా, పార్టీ పగ్గాలు వదులు కునేందుకు సిద్డమయ్యారా లేక మనసులో మరేదో ఉంచుకుని, పార్టీ నాయకత్వం పై మరో మారు విరుచుకు పడేందుకు సిద్దమవుతున్న సీనియర్లను ప్రస్తుతానికి శాంతింపప చేసేందుకు చేదు గుళికలకు షుగర్ కోట్ అద్దారా,అనేది ముందుగా అనుకున్న విధంగా జూన్,జులైలలో కాంగ్రెస్ నూతన అధ్యక్షుని ఎన్నిక   జరిగితే, గానీ, తెలియదు.అయినా, కాంగ్రెస్ పార్టీ పునర్జీవనం సాధ్యమా అంటే, అవుననే సాహసం ఎవరూ చేయడం లేదు. బీజేపే ఒడి పోవచ్చు, అధికారం కోల్పోవచ్చును, కానీ, కాంగ్రెస్ పార్టీకో పూర్వవైభవ స్థితి మాత్రం తిరిగిరాదు, అనే విశ్లేషకులు గట్టిగా అభిప్రాయ పడుతున్నారు.

చంద్ర‌బాబే సీఎంగా ఉండి ఉంటేనా...  

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ఏమైంది? ఈ క‌రోనా క‌ల్లోలం ఏంటి?ఆక్సిజ‌న్ కొర‌త‌తో ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌ల ప్రాణాలు పోవ‌డ‌మేంటి? బెడ్స్, మెడిసిన్‌ లేక ఆసుప‌త్రుల్లో ఆ దారుణ ప‌రిస్థితులేంటి? టీకాల‌కూ కుల గ‌జ్జి అంట‌గ‌ట్టి.. ఈ రాజ‌కీయ కంపు ఏంటి? ఏపీలో ఈ అరాచ‌క‌మంతా ఏంటి? ఇది ఎవ‌రి వైఫ‌ల్యం? ఇంకెవ‌రి నిర్ల‌క్ష్యం? ముమ్మాటికీ మ‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిదే ఈ పాప‌మంతా అంటున్నారు ప్ర‌జ‌లు.  ఏపీ ప్ర‌జ‌లు క‌రోనాతో పిట్ట‌ల్లా రాలిపోతున్నా.. మ‌న ముఖ్య‌మంత్రి ప‌ట్టించుకున్న పాపాన పోవ‌డం లేదు. తాడేప‌ల్లిలోని ప్యాల‌స్ వీడి.. క‌దలి రావ‌డం లేదు. ఎంత చేత‌గాని త‌నం? ఎంత చేవ‌లేని ప్ర‌భుత్వం? ఆంధ్ర‌ప్ర‌దేశ్ కరోనా కోర‌ల్లో చిక్కుకుపోయి ఇంత‌గా అల్లాడిపోతుంటే.. మ‌రీ, ఇంత నిర్ల‌క్ష్య‌మా? మ‌రీ, ఇంత లెక్క‌లేని త‌న‌మా? అంటూ నిల‌దీస్తున్నారు ఆయ‌న‌కు ఓటేసిన జ‌నాలు.  ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు. ఆ త‌ర్వాత న‌మ్మి మోస‌పోయామ‌ని గ్ర‌హించారు. అందుకు ఫ‌లితం రెండేళ్లుగా అనుభ‌విస్తున్నారు. ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో తాము చేసిన త‌ప్పునకు పెద్ద శిక్షే అనుభ‌విస్తున్నారు. గ‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో జ‌గ‌న్‌ను పోల్చి చూసుకొని మ‌రింత‌ బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు సీఎంగా ఉండి ఉంటేనా.. అంటూ ఆయ‌న ప‌నితీరును గుర్తు చేసుకుంటున్నారు.  సీఎం చంద్ర‌బాబు డ్యాష్ బోర్డులో.. ఏపీ కొవిడ్ సిట్యూయేష‌న్ మొత్తం నిక్షిప్తం అయి ఉండేది. ఎక్క‌డ ఏ హాస్పిట‌ల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి.. ఏ జిల్లాలో ఎంత మంది పేషెంట్స్‌కి బెడ్స్ అవ‌స‌రం.. ఎన్ని టెస్టులు చేస్తున్నారు.. ఎన్ని కిట్స్ అద‌నంగా ఉన్నాయి.. ఎక్క‌డ ఆక్సిజ‌న్ అవ‌స‌రం.. అద‌న‌పు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి.. ఇలా నిత్యం.. "ఆప‌రేష‌న్ కొవిడ్" నిర్వ‌హిస్తూ ఉండేవారు చంద్ర‌బాబు. అధికారుల‌ను, వైద్య సిబ్బందిని ఉరుకులు ప‌రుగులు పెట్టించే వారు. తాను నిద్ర పోకుండా.. ఆఫీస‌ర్ల‌ను నిద్ర‌పోనీకుండా.. ఏపీలో కొవిడ్ కంట్రోల్ క‌మాండ్ సెంట‌ర్ నుంచి నిత్యం ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షించేవారు. గ‌తంలో హుధ్‌హుధ్ తుఫాను స‌మ‌యంలో ఎలాగైతే చంద్ర‌బాబు విశాఖ‌లోనే తిష్ట‌వేసి.. ప‌రిస్థితి మొత్తం బాగుచేసే వ‌ర‌కూ వ‌ద‌ల‌కుండా ప‌ని చేశారో.. ప్ర‌స్తుత కొవిడ్ స‌మ‌యంలోనూ బాబు ఉండి ఉంటే.. అలానే నిర్విరామంగా శ్ర‌మించేవారు. ఇప్ప‌టిలా ఏపీ నుంచి అంబులెన్సుల్లో తెలంగాణ‌కు రోగులు వెళ్లే దుస్థితి వ‌చ్చుండేది కాదు.  CBN సీఎంగా ఉండి ఉంటే.. ప్రజావేదిక.. కొవిడ్ వార్ రూమ్‌గా మారి ఉండేది. జిల్లా అధికారులంద‌రితో వార్ రూమ్ నుంచి 24/7 కనెక్ట్ అయ్యుండేవారు. జిల్లాకో మెడికల్ టీమ్ ఏర్పాటు చేసేవారు. ఎక్క‌డిక‌క్క‌డ గ్రామాలు, మండ‌లాలు, జిల్లాల వారీగా తాత్కాలిక‌ ప్రాంతీయ కొవిడ్ కేర్‌ సెంట‌ర్లు ఇబ్బ‌డిముబ్బ‌డిగా ఏర్పాటు చేసుండేవారు. ఆక్సిజ‌న్ కొర‌తే లేకుండా చేసుండేవారు. కేంద్రంతో ఎప్ప‌టిక‌ప్పుడు ట‌చ్‌లో ఉంటూ.. రాష్ట్రానికి కావ‌ల‌సిన ఆక్సిజ‌న్ నిల్వ‌ల‌ను ముందే రెడీగా ఉంచేవారు. అప్ప‌టిక‌ప్పుడు ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటుకు నాంది ప‌లికేవారు.  ప్ర‌స్తుతం ఏపీలో వ్యాక్సినేష‌న్ ఓ ప్ర‌హ‌స‌నంగా సాగుతోంది. వ్యాక్సిన్ కేంద్రాల ద‌గ్గ‌ర తోపులాట‌లు, గొడ‌వ‌లు. అదే చంద్ర‌బాబు సీఎంగా ఉండి ఉంటే.. వ్య‌వ‌హారం ఇలా కుక్క‌లు చింపిన ఇస్త‌రిలా అస్స‌లు ఉండ‌క‌పోయేది. వ్యాక్సినేష‌న్‌పై ఇప్ప‌టిలా కులం పేరుతో రాజ‌కీయ కంపు సృష్టించే వారు కానే కాదు. అంద‌రికీ స‌రైన రీతిలో.. ఓ ప‌ద్ద‌తిలో.. వ్యాక్సిన్ ఇచ్చుండేవారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో టెక్నాల‌జీని పూర్తి స్థాయిలో వినియోగించుకునేవారు. COVID టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తే... మీకు వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందో.. ఎక్కడ, ఏ స‌మ‌యంలో వ్యాక్సిన్ తీసుకోవాలో మీ మొబైల్ కి సమాచారం వచ్చుండేది. ఇప్ప‌టి జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారులా వ్యాక్సిన్ కొనుగోళ్ల‌పై మీన‌మేషాలు లెక్కించ‌కుండా.. ఇప్ప‌టికే పెద్ద సంఖ్య‌లో వ్యాక్సిన్ల‌కు గ్లోబ‌ల్ టెండ‌ర్లు పిలిచుండేవారు. ఏపీకి కావ‌ల‌సిన మేర వ్యాక్సిన్ నిల్వ‌లు రెడీగా ఉంచేవారు. రాష్ట్రంలో అంద‌రికీ వ్యాక్సినేష‌న్ పూర్త‌య్యే వర‌కు విశ్ర‌మించ‌క‌పోయేవారు చంద్ర‌బాబు. యావ‌త్ దేశం మ‌న రాష్ట్రం వైపే చూసి ఉండేది. ఏపీని రోల్ మోడ‌ల్‌గా తీసుకునేది. అలాంటి వ‌ర్క్ హాలిక్ చంద్ర‌బాబును కాద‌ని, జ‌గ‌న్‌రెడ్డిని ముఖ్య‌మంత్రిగా ఎన్నుకున్నందుకు ఇప్పుడీ అవ‌స్థ‌లు అంటున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు. 

కరోనా పంజాకు ఇదే కారణమా..! 

మన దేశం లో  ప్రభుత్వం రోజు విడుదల చేస్తున్న కరోనా లెక్కలు తప్పుగా ఉన్నాయా..?  దేశంలో ప్రభుత్వాల లెక్కలు కరెక్ట్ గానే ఉన్నాయా ?  అంటే చాలా మందికి  ప్రభుత్వ లెక్కలపై అనుమానంగానే ఉంది. ఎందుకంటే మరణాలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వ లెక్కలు చాలా తక్కువగానే ఉన్నాయి. తాజాగా  మంది దేశ కరోనా లెక్కల పై ఒక దేశం కూడా కామెంట్ చేసింది.. భారత్‌లో కరోనా మరణాల లెక్కలో తప్పు ఉండాలి కామెంట్స్ చేసింది.  భారత్‌లో నేటి పరిస్థితికి తప్పుడు లెక్కలు, వ్యవస్థలను ముందుగా తెరవడమే కారణమని అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ (ఎన్ఐఏఐడీ) డైరెక్టర్, అధ్యక్షుడు బైడెన్ ముఖ్య సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. తప్పుడు లెక్కలే భారత్ కొంపముంచాయని అభిప్రాయపడ్డారు. కరోనా ఖతమైపోయిందని భావించి వ్యవస్థలను యథేచ్ఛగా తెరిచేశారని అన్నారు. భారత్‌లోని ప్రస్తుత పరిస్థితులు ఎన్నో అనుభవాలను నేర్పిస్తున్నాయని, ముఖ్యంగా పరిస్థితిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదని భారత్ అనుభవం చెబుతోందని నిన్న సెనేట్‌లోని సంబంధిత కమిటీకి చెప్పారు. ప్రజారోగ్యం పరంగా అవసరమైన సన్నద్ధత గురించి ఈ అనుభవం ద్వారా మనం తెలుసుకోవచ్చని అన్నారు. ప్రపంచంలో ఏమూల ఇలాంటి వైరస్ ఉన్నా అది అమెరికాకూ ముప్పు తెస్తుందని ఫౌచీ అన్నారు. అన్నారు.

ఈటల రాజేందర్ దూకుడు.. డీఎస్, అర్వింద్ తో చర్చలు 

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ దూకుడు పెంచారు. తన భవిష్యత్ కార్యాచరణలో భాగంగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ నేతలతో పాటు బీసీ సంఘాలతో వారం రోజుల పాటు మంతనాలు సాగించారు ఈటల రాజేందర్. ఇప్పుడు వివిధ పార్టీల నేతలను కలిసి చర్చిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను అన్ని పార్టీల నేతలను కలుస్తున్నానని, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్‌యూ లీడర్ల వరకూ అందరితోనూ చర్చిస్తానని చెప్పారు ఈటల రాజేందర్. మంగళవారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. భట్టీతో భేటీ కావడంతో ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది.   తన కార్యాచరణలో భాగంగా రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌తో మాజీ మంత్రి ఈటల రాజేందర్​ బుధవారం భేటీ అయ్యారు. దాదాపు గంటన్నరకుపైగా ఇద్దరూ చర్చించారు. భవిష్యత్తు రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. రాజకీయ పరిణామాలపై త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఈటల ఈ సందర్భంగా వెల్లడించారు. తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేతలను కలిసి కోరుతున్నానని ఈటల రాజేందర్​ స్పష్టం చేశారు. డీఎస్‌తో భేటీ అయిన సమయంలోనే అక్కడకు వచ్చిన డీఎస్​ తనయుడు, బీజేపీ ఎంపీ అరవింద్‌ను కూడా ఈటల కలిశారు. దాదాపు 20 నిమిషాలు ఇద్దరూ మాట్లాడుకున్నారు. వీళ్లిద్దరి మధ్య రాజకీయ అంశాలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.  మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు ఈటల రాజేందర్. కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. దీంతో ఈటల కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జరిగింది. అదే సమయంలో కొత్త పార్టీ పెట్టరని.. ఇప్పుడున్న పార్టీల్లోనే ఏదో ఒక దాంట్లో చేరుతారనే వాదన వచ్చింది. అయితే తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇవ్వని రాజేందర్... ఇప్పుడు వివిధ పార్టీల నేతలను కలుస్తుండటం ఆసక్తి రేపుతోంది. ఈటల తాజా కదలికలను బట్టి... ఆయన కొత్త పార్టీ పెట్టకపోవచ్చనే అభిప్రాయమే రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.

ఇక్కడ ఒకలా.. ఢిల్లీకి మరోలా! కొవాగ్జిన్ పై జగన్ డబుల్ గేమ్ 

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం  ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు... టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని లేఖలో తెలిపారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సంబంధించి...ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలు సహకరించిన విషయాన్ని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ఇతర వ్యాక్సిన్‌ ఉత్పత్తి కంపెనీలకు టెక్నాలజీని అందించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోడీని కోరారు. దీని ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. కొవాగ్జిన్ పై ప్రధాని మోడీకి సీఎం జగన్ రాసిన లేఖపై పలు సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొవాగ్జిన్ వ్యాక్సిన్ విషయంలో మొదటి నుంచి సీఎం జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కరోనా కల్లోల సమయంలోనూ దరిద్రపు కులాలు, చుట్టరికాలను లింకు కలుపుతూ మాట్లాడం వివాదాస్పదమైంది. భారత్ బయోటెక్ రామోజీ గారి కొడుకు వియ్యంకుడిదే... ఆయన చంద్రబాబు కు బంధువు.. వాళ్లకు అంతా తెలుసంటూ మాట్లాడారు జగన్. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఏంఆర్ తో  భాగస్వామ్యం లో ఉన్న భారత్ బయోటెక్ సంస్థను కొంత మంది వ్యక్తులకు ఆపాదించి  అత్యంత చౌకబారు విమర్శలు జగన్ రెడ్డి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ సీఎం వ్యాఖ్యలు తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను దిగజార్చడమేననే విమర్శలు వస్తున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో  కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం..  కొవాగ్జీన్ టీకాను భారత్ బయోటెక్, ఐసీఏంఆర్ కలిసి ప్రభుత్వ , ప్రైవేట్ భాగస్వామ్యం  విధానంలో అభివృద్ధి చేశాయి. ఒప్పందం ప్రకారం భారత్ బయోటెక్ సంస్థ తమ నికర అమ్మకాల పై 5% రాయల్టీ ఐసీఏంఆర్ కు చెల్లించాలి. వ్యాక్సిన్ తయారి మేధోసంపత్తి హక్కులు భారత్ బయోటెక్, ఐసీఏంఆర్ లు సంయుక్తంగా పంచుకునే విధంగా ఉభయ సంస్థల మధ్య ముందస్తు అంగీకరం ఉంది. అయితే భారత్ బయోటెక్ కి ఐసీఏంఆర్ నిధులు సమకూర్చలేదు. కాని 22 చోట్ల మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ 28500 మంది పై జరపడానికి నిధులు ఇచ్చింది. కొవాగ్జీన్ మరియు కోవిషీల్డ్  పై వివిధ పరిశోధనల కోసం ఐసీఏంఆర్ 11  కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ప్రధాని మోడీకి రాసిన లేఖలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడానికి ఐసీఏంఆర్ ద్వారా మేధోసంపత్తి సహకారంతో సాధ్యమైనంత ఏక్కువ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయమని కోరారు. ఇదే మంచిదే కాని కొంత మంది సంబంధం లేని వ్యక్తులకు భారత్ బయోటెక్ ని ఆపాదించి ఎందుకు ప్రకటనలు చేశారన్నది ఆయన తెలపాల్సి ఉంది. జగన్ లేఖ రాసేటప్పటికే  కేంద్ర ప్రభుత్వం కోవాగ్జీన్ ఉత్పత్తి పెంచడానికి సాంకేతికంగా అనుభవం ఉన్న ృ The Department of Biotechnology (DBT) సహకారంతో ఇప్పటికే పని మొదలు పెట్టింది, హైదరాబాద్ లోని శాంత బయోటెక్ తో కూడా ఇప్పటికే భారత్ బయోటెక్ టీకాల ఉత్పత్తి పెంచడానికి  కలిసి ముందుకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది. ఇవన్ని తెలిసి కూడా తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కొవాగ్జిన్ వ్యాక్సిన్ పై ప్రధానికి జగన్ లేఖ రాశారనే విమర్శలు వస్తున్నాయి. తెలుగు  మీడియా ముందు మీరు ఒకలా మాట్లాడుతూ.. ఇంగ్లీషు లేఖలు మరియ ట్వీట్లు మరోలా చేస్తూ ఢిల్లీకి ఇంకో రకంగా లేఖలు రాస్తూ జగన్ అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారనే టాక్ వస్తోంది.  మరోవైపు కేంద్ర ప్రభుత్వం టీకాలు ఇవ్వలేదని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపు గ్లోబల్ టెండర్లు వెళతామని సీఎం చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే గ్లోబల్ టెండర్లకి ఎలా వెళతారో ఎవరికీ అర్ధం కావడం లేదు. 45 ఏండ్లు పైబడిన వారికి కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రా వాట నిష్పత్తి ప్రకారం టీకాలు ఇస్తుంది. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ ఆరోగ్య సంస్థలు నేరుగా కంపెనీల టీకాల మొత్తం ఉత్పత్తిలో 50%  కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే డబ్బున్న రాష్ట్రాలు ముందు చూపుతో అధిక టీకాలు కొనుగోలు  చేస్తే, ముందు చూపు లేని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం అక్కడి ప్రజలకు శాపం కాకుడదని కేంద్ర ప్రభుత్వం 18 - 44 సంవత్సరాల వయస్సు దేశంలో ఉన్న  ప్రజల ఆయా రాష్ట్రం నిష్పత్తి ప్రకారం రాష్ట్రాలకు వాటా కల్పించినది. ఇప్పుడు డబ్బు చెల్లించి టీకాలు కంపెనీల ఉత్పత్తి లో మన వాటా తెచ్చుకోవాలి. అయితే తమకు వాటాకు సంబంధించిన వ్యాక్సిన్ కోసం ముందస్తుగా ఆర్డరు చేయలేకపోయింది జగన్ రెడ్డి సర్కార్. అడ్వాన్స్ చెల్లింపులు ద్వారా టీకాల డెలివరీ షెడ్యూల్ కోసం అగ్రిమెంట్ చేసుకోకుండా కాలయాపన చేసి, ఇప్పుడు అటొక రాయి - ఇటొక రాయి వేసి ఇంకా సమయం వృధా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  వ్యాక్సిన్ కోసం అడ్వాన్స్ చెల్లింపులు ఎక్కడ అని విపక్షాలు ప్రశ్నించడంతో.. జగన్ సర్కార్ అడ్డంగా బుక్కై పోయింది. దీంతో తమ వైఫల్యాలను, తప్పులను కప్పిపుచ్చడానికి జగన్మోహన్ రెడ్డి కొత్త కుట్రలకు తెర తీశారనే ఆరోపణలు వస్తున్నాయి. పదే పదే పాడిందే పాటరా పాసిపల్ల దాసరి అన్నట్లుగా.. కులాల కుంపటి రాజేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. తన దిగజారుడు చర్యలతో అచేతన ముఖ్యమంత్రి గా జగన్మోహనరెడ్డి మిగిలారనే ప్రచారం జరుగుతోంది.   

యజ్ఞం చేస్తే కొవిడ్ మాయం.. బీజేపీ మంత్రి కొత్త మంత్రం

దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఇండియాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాలకుల నిర్లక్ష్యం వల్లే కొవిడ్ విజృంభించిందని వైద్య సంస్థలు చెబుతున్నాయి. అయినా మన నేతల తీరు మారడం లేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ పై చిల్లర మాటలు మాట్లాడుతూ జనాలను గందరగోళ పరుస్తున్నారి.  కొవిడ్ మహమ్మారికి సంబంధించి మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కొవిడ్ మూడో వేవ్ రాకుండా ఉండేందుకు  నాలుగు రోజుల పాటు యజ్ఞం నిర్వహించాలని ఆమె సూచించారు. ఇండోర్ నగరంలో కొవిడ్ కేర్ సెంటరును ప్రారంభించిన మంత్రి ఉషాఠాకూర్ మాట్లాడుతూ  ఈ వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ శుద్ధి కోసం నాలుగు రోజులు యజ్ఞం చేయండి.. ఇది యజ్ఞ చికిత్స. పూర్వ కాలంలో, మన పూర్వీకులు మహమ్మారిని వదిలించుకోవడానికి యజ్ఞ చికిత్స చేసేవారు.. ఇది పర్యావరణాన్ని శుద్ధి చేస్తోంది, దీనివల్ల కొవిడ్ మూడో వేవ్ భారతదేశాన్ని తాకదు.. అని బీజేపీ మంత్రి ఉషా వ్యాఖ్యానించారు.  మంత్రి ఉషా ఇటీవల ఇండోర్ విమానాశ్రయంలో విగ్రహం ముందు కర్మలు చేశారు. కరోనా పోవాలంటూ ఈ కర్మలు చేశానని చెప్పారు. గతంలో మంత్రి కొవిడ్ సంరక్షణ కేంద్రాన్ని సందర్శించినపుడు మాస్కు ధరించలేదని విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా యజ్ఞం చేస్తో కోవిడ్ పోతుందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై జనాలు ఫైరవుతున్నారు. ఇలాంటి నేతల వల్లే దేశానికి ఈ గతి పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వాక్సిన్ బ్లాక్ దందా.. డోసుకు రూ. 600 

దేశం అంత కరోనా వాక్సిన్ లేక జనాలు అవస్థలు పడుతూ. ఎలాగైనా  తమ ప్రాణాలు కాపాడుకోవాలని ఆసుపత్రుల ముందు పడిగాపులు కాస్తున్నారు. వాక్సిన్ లేదని రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తేశాయి.. మరో వైపు కేంద్ర ప్రభుత్వం వాక్సిన్ సరఫరా చేయలేదని చెపుతున్నాయి. కొంత మంది వ్యక్తులు వాక్సిన్ తో ప్రజల ప్రాణాలతో బ్లాక్ దందా  చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా విజయవాడలో ఓ ప్రైవేట్ వైద్యుడు వాక్సిన్ వేస్తూ. ఒక వ్యాక్సిన్ డోస్ కు రూ .600 అంటూ కారులోనే చికారు చేస్తే టీకాలు వేస్తున్నాడు.   కొవిడ్ టీకాల కొరతను అడ్డగోలుగా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించాడో వైద్యుడు. ఒక్కో డోసుకు ధరను నిర్ణయించి కారులోనే దుకాణం తెరిచేశాడు. విజయవాడలో నిన్న వెలుగుచూసిందీ ఘటన. నగరంలోని సత్యనారాయణపురం  గిరి వీధిలో ఓ వైద్యుడు ఒక్కో డోసుకు రూ. 600 వసూలు చేస్తూ కారులోనే టీకాలు వేస్తున్నాడు. విషయం తన దృష్టికి రావడంతో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తి అక్కడికి చేరుకుని వైద్యుడిని నిలదీయడంతో కారుతో సహా అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. అప్రమత్తమైన కార్పొరేటర్ బైక్‌పై కారును వెంబడించారు. రామవరప్పాడు రింగ్ సెంటర్‌లో కారును ఆపి వైద్యుడిని పట్టుకున్నారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు కారును తనిఖీ చేశారు. అందులో టీకా వేయించుకున్న ముగ్గురు భీమవరం వ్యక్తులు కనిపించారు. అలాగే కొన్ని సూదులు, ఇంజక్షన్లు లభించాయి. కారులోని వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి వివరాలు సేకరించారు. జి. కొండూరులో పనిచేసే ఓ వైద్యుడు తమతోపాటు మరికొందరికి టీకాలు వేసినట్టు వారు చెప్పారు. కారులో వ్యాక్సిన్లు కనిపించకపోవడం, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు వారి ముగ్గురితో పాటు వైద్యుడిని కూడా వదిలిపెట్టేశారు. ఒక వైపు ప్రజలు ప్రాణ భయం తో భయపడుతుంటే.. కొంత మంది వ్యక్తులు వాక్సిన్ తో ప్రజల ప్రాణాలతో బ్లాక్ దందా  చేస్తున్నారు. అసలు ప్రభుత్వాల దగ్గర లేని వాక్సిన్ వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది ప్రజలు ఆలోచిస్తూ ఆందోనళ పడుతున్నారు.   

కొడుకుని చంపిన తండ్రి.. ఎందుకో తెలుసా..?  

ఇప్పుడు ఉన్న సమాజం లో డబ్బు మనిషిని ఎంతకైనా దిగరాజూస్తుంది. డబ్బుకి  ఫీలింగ్ ఉండవ్   ఎమోషన్స్ ఉండవ్, ఓన్లీ క్యాలుకులేషన్ మాత్రమే ఉంటాయి. మద్యం, డబ్బు మత్తులో మనిషి ఎంతటికైనా తెగిస్తాడు. ఎవరినైనా కడతేరుస్తాడు. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి. గుమ్మడిదల మండలం. కొత్తపల్లి గ్రామం. ఆ దంపతులు గడ్డమీది శ్రీనివాస్‌గౌడ్‌, పద్మ, వారి కుమారుడు సాయికిరణ్ గౌడ్.  వయసు (23) సంవత్సరాలు. అందరూ కూలి పనులు చేస్తూ జీవితం కొనసాగిస్తుంటారు. రోజు మాదిరిగానే సోమవారం ముగ్గురూ పనులు చేసుకుని రాత్రి ఇంటికి చేరుకున్నారు. తండ్రిని డబ్బు కావాలని కుమారుడు కావాలని అడగడంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఇద్దరూ వాదులాడుకుంటుండగా తల్లి పద్మ అరిచింది. అది వైనిపించుకోలేదు. పద్మ భయపడి బయటకు వెళ్లి తెలిసిన వారింట్లో పడుకుంది.  కట్ చేస్తే.. రాత్రి ఇంట్లో నుండి వెళ్లిపోయిన పద్మ మంగళవారం ఉదయం వచ్చి చూసింది. కుమారుడు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు.  ఆ తల్లి ఒక్కసారిగా షాక్ తిన్నది. బిడ్డను, తండ్రి కర్రతో తీవ్రంగా కొట్టాడని ఆమె గమనించిన కొద్ది సేపటికే సాయికిరణ్‌ మృతి చెందడంతో తల్లి బోరుమని విలపించింది. అక్కడే ఉన్న శ్రీనివాస్‌గౌడ్‌ను ఆమె కోపంతో రాయితో కొట్టడంతో గాయపడి బయటకు వెళ్లి పోయాడు.  అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని జిన్నారం సీఐ లాలునాయక్‌ సందర్శించి వివరాలను సేకరించారు. గ్రామ వీఆర్‌ఏ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయకృష్ణ తెలిపారు. హైదరాబాద్ లో భారీ పేలుడు..  హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌ జయరాంనగర్‌ చౌరస్తా వద్ద భారీ పేలుడు సంభవించింది. ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న బ్యాగ్‌ను విసరడంతో ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఓ పూజసామగ్రి దుకాణం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. పేలుడు శబ్దం సుమారు కిలోమీటర్‌కుపైగా వినిపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. బ్యాగ్‌తో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని చేతిలో మరో బ్యాగు ఉండడంతో పోలీసులు ఇంకో బ్యాగ్‌ను తెరవడానికి డాగ్‌ స్క్వాడ్‌ రప్పించారు. అందులో చెత్తఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తనకు బ్యాగ్‌ బాలానగర్‌లో దొరికిందని, దానిని తీసుకువస్తుండగా కుక్కలు మొరగడంతో పడేసినట్లు అనుమానితుడు పోలీసులతో చెప్పాడు. దీంతో క్లూస్‌ టీమ్‌ సాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లాక్ డౌన్ దెబ్బకు.. వైన్స్ లు ఖాళీ.. 

మందు  బాబులం  మేము  మందు  బాబులం  మందు  కొడితే  మాకు  మేమే  మహారాజులం  అరేయ్  కళ్ళు  తగి  గంతేస్తాం సారా  తగి  చిందేస్తాము  మందంత  దిగేదాకా  లోకలేయ్  పాలిస్తాం  మందేస్తే  ముందు  వెనక  లేదని  ఈ  మందు   లేని  సర్కారే  బందన్న.. ఈ పాట చాలా ఫేమస్.. ఎందుకంటే ఈ పాటలో చెప్పింది నూటికి నూరుపాలు నిజం. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లి పోయాయి. మొన్నటివరకు ఎట్టి పరిస్థితిలోను లాక్ డౌన్ పెట్టాను అని చూపిన కేసీఆర్ సార్ కూడా చివరికి  హై కోర్టు నిర్ణయానికి తలొంచి  నేటి నుండి 10 దినాలు తెలంగాణాలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.. గిప్పుడు అసలు విషయానికి పోదాం..  ఒక వైపు కరోనా విజృంభిస్తుంది లాక్ డౌన్ పెట్టండి అని చాలా మంది దేశంలోని, రాష్ట్రము లోని ప్రభుత్వాలను విమర్శించారు. ప్రభుత్వాలకు ప్రజా ఆరోగ్యం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండాపోయిందని ఇంకొంత మంది. దాని వెనుక ఎవరి స్వార్థం ఉందో అందరికి తెలుసు. ఆసలు విషయానికి వస్తే  నిన్న కేసీఆర్ సార్ 10 దినాలు  లాక్ అని చెప్పిందో లేదో.. జనాలు ఆగం ఆగం అయ్యిరు.. ఎక్కడ జూసిన లైన్ గట్టిర్రు . లైన్ అంటే ఏ కిరణం షాప్ ముందో రేషన్ షాప్ ముందో అనుకునేరు.. మందు షాప్ ల ముందు జనాలు చీమల బారులు ఉన్నారు. కరోనా గురించి ఆలోచించకుండా. 10 దినాలు మందు లేకుంటే పానాలు పోతాయి అన్న రీతిలో జనాలు పరుగులు తీశారు.  అసలే తెలంగాణ ప్రజలకు సుక్క లేకుంటే ముద్దా దిగదాయే.. మరో వైపు దేశం లో మందులో అమ్మకాల్లో మన తెలుగు రాష్ట్రాలు రెండు పోటీ పడుతున్నాయి. నిన్న ఒక్క రోజు దాదాపు అన్ని వైన్ షాప్స్ లో లిక్కర్ అయిపొయింది. దాదాపు నిన్న ఒక్క రోజు నెల రోజుల స్టాక్ అయిపోయి ఉంటుంది. మందు బాబులు నిన్న సృష్టించిన తతంగం అంత ఇంత కాదు.. ఒక్కొక్కరు అయితే కాటన్స్ కాటన్స్ తీసుకెళ్లారు. లాక్ డౌన్ దెబ్బకు వైన్స్ షాక్ లో ఉన్న స్టాక్ అంత ఖాళీ అయింది. ప్రాణాలు పోతున్నాయి అన్న.. పోయే ముందు కాస్త పెగ్గు వేసి పోతాను అన్నట్లుగా తయారు అయ్యారు జనాలు. ఏం చేస్తాం కలికాలం అందులోను కరోనా గాలం..  మందు బాబులకు ముందు చూపు చాలా ఎక్కువని వినడం తప్ప ఎప్పుడు చూడలేదు.. నిన్న ఆ సరదా కూడా తీరింది. లాక్ డౌన్ అనగానే సంచులు వేసుకొని వైన్ప షాప్స్ ముందు లైన్ కట్టరు మందు బాబులు, మే నెలలో పదోవ తేదీ వరకు రోజుకు దాదాపు రూ. 61  కోట్ల సరుకు అమ్మితే , నిన్న ఒక్క రోజే రూ. 125  కోట్ల అమ్మకాలు జరిగాయి. ఇది ఇలా ఉండగా రోజు ఉదయం 6 గంటల నుండి 10 వరకు వైన్ షాపులు తెరిచి ఉండడం విశేషం.    

కొవాగ్జిన్ కు కులాల లింక్! జగన్ రెడ్డి కుట్రలపై జనాల ఫైర్ 

ఆడ లేక మద్దెల ఓడు.. ఈ సామెత పూర్వకాలం నుంచి పాపులర్. ఎవరైనా తాను చేయాల్సింది చేయలేనప్పుడు... ఆ ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవడానికి ఇతరత్రా మార్గాలు వెతుక్కుంటారు. అందుకోసం వెతికే సాకులను ఆడ లేక మద్దెల ఓడు అంటూ విమర్శలు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇప్పుడు అచ్చం అలానే ఉంది. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్, కరోనా రోగులకు చికిత్స అందించడంలో పూర్తిగా విఫలమైన జగన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు అర్ధంపర్ధం లేని వాదనలు చేస్తూ అడ్డంగా బుక్కై పోతున్నారు సీఎం జగన్ రెడ్డి. తాజాగా వ్యాక్సినేషన్ పై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన కుట్రలను, అసలు నైజానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయనే టాక్ వస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ సరఫరాలో  అంతా కేంద్రమే చేస్తుందని చెబుతున్నారు జగన్ రెడ్డి. అదే సమయంలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ ఎండీకి.. బంధుత్వాలు లింక్ పెట్టి తన కుల కుతంత్రాన్ని బయటపెట్టుకున్నారు. వ్యాక్సిన్ల కేటాయింపు కేంద్రానిదే అంటూనే... భారత్ బయెటెక్ ఎండీ కృష్ణ ఎల్లాకు...  చంద్రబాబు, రామోజీరావు బంధుత్వం అంటూ కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు. నిజానికి చంద్రబాబుకు..కృష్ణ ఎల్లాకు బంధుత్వం లేదు.  కాని మంగళవారం  ఓ సమావేశంలో మాట్లాడుతూ వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటి అని రాష్ట్రంలో ఉన్న వారికి..దేశంలో ఉన్న వారికి అందరికీ తెలుసు. భారత్ బయోటెక్ రామోజీ గారి కొడుకు వియ్యంకుడిదే... ఆయన చంద్రబాబు కు బంధువు.. వాళ్లకు అంతా తెలుసంటూ మాట్లాడారు జగన్.  ఇటీవలే వ్యాక్సిన్ల కేటాయింపు పూర్తిగా కేంద్రం చేతిలో ఉందని ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి . రాష్ట్రాలకు కూడా ఎంత వ్యాక్సిన్లు ఇవ్వాలన్నది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారని తెలిపారు.తాజాగా మాత్రం  బంధుత్వాలను తీసుకురావడం అందరిని విస్మయ పరుస్తోంది. దేశంలో తయారు అవుతున్న వ్యాక్సిన్లలో 50 శాతం వాటాను నేరుగా కేంద్రం తీసుకుని..మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలకు అమ్ముకునే వెసులుబాటు ఆయా తయారీ సంస్థలకు ఇస్తూ కేంద్రం కొద్ది రోజుల క్రితం విధాన నిర్ణయం తీసుకుంది. అంతా కేంద్రం చేస్తుంటే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంధుత్వాల ప్రస్తావన ఎందుకు తెచ్చారన్నది అంతుపట్టడం లేదు. ఏ రాష్ట్రానికి ఎంత వ్యాక్సిన్లు అమ్మాలన్నది కూడా జగన్ చెప్పినట్లు కేంద్రమే డిసైడ్ చేసేటప్పుడు భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లా చంద్రబాబుకు బంధువు అయితే ఏంటి?. రామోజీరావు కొడుకు వియ్యంకుడు అయితే ఏంటి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.  భారత్ బయోటెక్ పై సీఎం జగన్ చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. కృష్ణ ఎల్లా రామోజీకి బంధువైతే చంద్రబాబు ఎలా బంధువు అవుతాడో ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంటే చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. రామోజీ కొడుకు వియ్యంకుడి సంస్థలో ఏం జరుగుతుందో రామోజీకి తెలుస్తుందట.. కాని తన భార్య భారతీ రెడ్డి చైర్మెన్ గా ఉన్న సాక్షిలో ఏం జరుగుతుందో జగన్ రెడ్డికి తెలియదట అంటూ సెటైర్లు వేస్తున్నారు. సాక్షిలో ఏం రాస్తున్నారో తనకు తెలియదంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్లను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కౌంటరిస్తున్నారు కొందరు నెటిజన్లు.  అవును భారత్ బయోటెక్ రామోజీ గారి కొడుకు వియ్యంకుడిదే... ఆయన చంద్రబాబు కు బంధువు అయివుండవచ్చు...! అయితే ఏంటి..?? ఏంచెప్పాలనుకుంటున్నారు జగన్ రెడ్డి అంటూ ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ కంపెనీ ఆంధ్రాలో ఉంటే మూయించేద్దామనుకున్నారా.. తెలంగాణాలో ఉంది కాబట్టి కుదరలేదని ప్రజలకు చెబుతున్నారా..?? అంటూ నిలదీస్తున్నారు. కొవాగ్జిన్ కోసం మీరసలు ఆర్డరు పెట్టారా..??పెడితే ఎన్ని పెట్టారు..??అప్పు అడిగారా..?? అని అడుగుతున్నారు నెటిజన్లు.  హెటిరోడ్రగ్స్ ఎవరిది..?? అరవిందో ఎవరిది..?? రాంకీ ఫార్మా ఎవరిది..??వాళ్ళకెంత దోచి పెడుతున్నారు..??అంతా దొబ్బి కూడా వాళ్ళు ప్రజలకు కంటి తుడుపు గా ఏమైనా చేసారా‌..?? అంబులెన్సు లు అప్పగించారు మీ జైలు మేట్ బంధువు కు.కానీ వారు రోడ్డు మీద మృతదేహాలనొదిలేసి పోతున్నారు..!! రోడ్డు ప్రమాదం జరిగి గిలగిల కొట్టుకుంటున్నా కాని అందుబాటులోకి రావటం లేదు. పాపం నడి రోడ్డుమీద ప్రాణాలు వదులుతున్నారు..!! ఇప్పుడు కరోనా పీడితుల హాహాకారాలు,వారి బాధను,అవసరాన్ని,అత్యవసరాన్ని సొమ్ము చేసుకోవటం కళ్ళకు కనపడటం లేదా..?? మీచావు మీరు చావండని వదిలేయలేదా..?? అంటూ సీఎం జగన్ ను కడిగిపారేస్తున్నారు ఏపీ జనాలు. రెమిడిసర్ ఇంజెక్షన్లు నల్లబజారు కు తరలించి అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు.ఇది శవాలను పీక్కుతినటం కాదా జగన్ రెడ్డి అంటూ నిలదీస్తున్నారు.  కోవిడ్ వ్యాక్సిన్ పై ఒక ముఖ్యమంత్రి నోట నుంచి బంధుత్వాలు లింకు కలుపుతూ మాటలు వినటం నిజంగా దౌర్భాగ్యమే అంటున్నారు నెటిజన్లు. ఇంకా కులాన్ని,చంద్రబాబుని అడ్డం పెట్టుకుని నెట్టుకొద్దామంటే కుదరదని స్పష్టం చేస్తున్నారు. మీ సత్తా,మీ పాలనాదక్షత, మీవివేకం జనాలకి,మీపార్టీ వారికి  కూడా స్పష్టంగా అర్ధమయ్యింది జగన్ రెడ్డి గారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రజలను కాపాడుకోవడం చేతకాక పోతే పదవి నుంచి దిగిపోవాలంటూ.. రిజైన్ జగన్ అంటూ పోస్టులు పెడుతున్నారు ఏపీ నెటిజన్లు. 

చంద్రబాబుపై మరో రెండు కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం రేపుతోంది. హాస్పిటల్స్ బెడ్లు లేక, ఆక్సిజన్ అందక కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. తిరుపతి రుయాలో మరణ మృందగం మోగుతోంది. రుయాలో రెండు రోజుల్లో 48 మంది చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా భయంతో జనాలు వణికిపోతుండగా.. వారికి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రజల ప్రాణాలను గొలికొదిలేసి.. కక్ష రాజకీయాలపై ఫోకస్ చేసింది. ఏ టీడీపీ లీడర్ పై ఎలాంటి కేసు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు ఎలా అరెస్ట్ చేయాలనే అంశాలపైనే జగన్ రెడ్డి సర్కార్ ఫోకస్ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ నేతల వరుస అరెస్టులు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. టీడీపీ నేతలే కాదు ఆ పార్టీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును వదలడం లేదు వైసీపీ సర్కార్.  మూడు రోజుల క్రితమే ఆయనైప కర్నూల్ లో కేసు నమోదు చేయగా.. తాజాగా  మరో రెండు కేసులు నమోదయ్యాయి. కరోనాపై లేనిపోని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ  న్యాయవాదులు చేసిన ఫిర్యాదుపై గుంటూరు, నరసరావుపేట పోలీస్ స్టేషన్లలో చంద్రబాబు పై కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ప్రమాదకరమైన ఎన్440కె రకం వేరియంట్ వెలుగుచూసిందని, ఇది సాధారణ వైరస్ కంటే 10-15 రెట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవని, ప్రజల్లో మానసిక వేదన, అధైర్యం కల్పించాయని పేర్కొంటూ, జిల్లా కోర్టు న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో  కేసు నమోదైంది. నరసరావుపేటలోనూ చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. ఇది కూడా కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుతోనే. చంద్రబాబు, ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు కలిసి కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పట్టణానికి చెందిన న్యాయవాది రాపోలు శ్రీనివాసరావు చేసిన ఫిర్యాదుపై నర్సారావుపేట పోలీసులు నేతలిద్దరిపై కేసులు నమోదు చేశారు. వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు.

మరో చీలిక దిశగా  అన్నాడీఎంకే అడుగులు ?

అనుకున్నదే జరుగుతోంది. ఇంతకాలం అధికారం ఫెవికాల్’ల పనిచేయడంతో, ఏదోలా కలిసున్న,అన్నా డీఎంకే, వైరి వర్గాలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో మళ్ళీ పాత పగలలకు పదును పెడుతున్నాయి. పార్టీ అగ్రనేతలు పన్నీర్సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య విభేదాలు మళ్ళీ మరోమారు తెరమీదకు వచ్చాయి. గతంలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం కుస్తీపట్లు పట్టిన, ఇరు వర్గాలు ఇప్పుడు ప్రతిపక్ష నేత పదవి కోసం, సెల్వం,స్వామి వర్గాలు పట్టుపడుతున్నాయి. సోమవారం జరిగిన పార్టీ శాసన సభా పక్ష సమావేశంలో పన్నీర్ సెల్వం, తమ వర్గానికి చెందిన మాజీ స్పీకర్ పీ. ధనపాల్’ను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయాలని ప్రతిపాదించారు. అందుకు అంగీకరించలేదు.  అయితే, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి వర్గం, అందుకు అంగీకరించలేదు. మ్స్స్జీ ముఖ్య మంత్రినే  ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలని, అదేవిధంగా,మాజీ ఉప ముఖ్యమంత్రి పనీర్ సెల్వంని శాసన సభా పక్షం ఉప నాయకుడిగా ఎన్నుకోవాలని పట్టు పట్టారు. అంతే, కాదు అప్పటికప్పుడే, ఓటింగ్ కూడా నిర్వహించారని, ఓటింగ్’లో పార్టీ ఎమ్మెల్యేలు 66 మందిలో 61 మంది పళని స్వామికి జై కొట్టారని పార్టీ వర్గాల సమాచారం. దీంతో, ఖంగుతిన్న పన్నీర్ సెల్వం సమావేశం నుంచి వెళ్ళిపోయారు. ఉప నాయకుని పదవినీ తిరస్కరించారు.   నిజానికి, గతంలో జయలలిత అండతోనే పనీర్ సెల్వం, కేసుల్లో ఇరుకున్న ఆమెకు డమ్మీగా మాత్రమే అలాగే, ప్రజల్లోనూ పలుకుబడి లేదు. అందుకే, జయలలిత మరణంతో సెల్వం చాప్టర్ క్లోజ్ అయి పోయింది. ఇందుకు  జయ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలే  సాక్ష్యంగా నిలుస్తాయి.అప్పట్లో కూడా సెల్వం కొంత కాలం పాటు, తానూ లేస్తే మనిషిని కాదు అనంట్లుగా వ్యవహరించారు.  ముఖ్యమంత్రి పీఠం కోసం  ప్రయత్నించి విఫల మయ్యారు. చివరకు ఉపముఖ్యమంత్రి పదవితో సర్దుకు పోయారు. ఇప్పడు మరో సారి, అదే సీన్ రిపీట్ అవుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.అయితే,అప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటీపడిన నాయకులు ఇప్పుడు ప్రతిపక్ష నేత పదివి కోసం పోటీ పడుతున్నారు.అదొక్కటే తేడా, మిగిలిన సీన్ అంతా  సేమ్ టూ సేమ్  అంటున్నారు.  అయితే, డిప్యూటీ లీడర్ పదవిని తిరస్కరించిన పన్నీర్ సెల్వం, వెనక్కి తగ్గరాదని అనుకుంటే, పార్టీలో ముసలం తప్పదని, కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. నిజంగా, అదే జరిగితే, పార్టులో చీలిక వచ్చినా ఆశ్చర్య పోనవసరలేదని అంటున్నారు. నిజానికి ఇంతకూ ముందే అనుకున్నట్లుగా జయ లలిత మరణంతోనే అన్న డిఎంకే రెండు వర్గాలుగా చీలిపోయింది. అధికారం అతుకుతో ఇంతాకాలం అలా కలిసి ఉన్న పార్టీ, ఇప్పడు అధికారం కోల్పోవడంతో కధ మళ్ళీ మొదటి కొచ్చింది. పైకి బాగానే ఉన్నా.. పార్టీలో మాత్రం అభిప్రాయభేదాలకు కొదవ లేదని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. పన్నీర్, పళనిస్వామి వ్యవహారం ఇలా ఉంటెఉంటే, జయమరణం,తర్వాత జైలు జీవితానికే పరిమితం అయిన శశికళ, మొన్నటి ఎన్నికలకు ముందు జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. అయితే, ఆమె వ్యూహాత్మకంగానే కావచ్చు,రాజకీయ సన్యాసం ప్రకటించారు. కానీ, ఆమె సమీప సహచరుడు దినకరన్ సారధ్యంలోని ఏఎంఎంకే పోటీలో నిలిచింది. దినకరన్ పోటీ చేయడం వలన, అన్నాడీఎంకేకు బలమైన కంచుకోట అయిన దక్షిణ తమిళనాడులో తేవర్ వర్గం ఓట్లు.. అన్నాడీఎంకే, ఏఎంఎంకేల  మధ్య చీలిపోయాయి. ఈ ప్రభావంతో అనేక స్థానాలను డీఎంకేకు కోల్పోవలసి  వచ్చింది. ఈ నేపధ్యంలో, శశికళ, దినకరన్ కలిసి పన్నీర్సెల్వంకు మద్దతు ఇచ్చే అవకాశమూ లేకపోదని చెబుతున్నారు.మొత్తానికి, అన్నాడిఎంకేలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు, పార్టీలోనే కాకుండా,  తమిళ రాజకీయాల్లో అనూహ్య మార్పులకు కారణం కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా భయంలో జనాలు.. జల్సాల్లో వైసీపీ లీడర్లు 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మరణాలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఆక్సిజన్ అందక రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లాలో కడపలోనూ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ కొరతతో పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా భయంతో జనాలు హడలిపోతున్నారు.  కరోనా కల్లోల సమయంలో జనాలకు అండగా నిలవాల్సిన నేతలు జల్సాలు చేస్తున్నారు. ఇలాంటి విపత్కార పరిస్థితుల్లో ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కరోనా బాధితులకు అండగా ఉంటూ.. వారికి మేమున్నామనే భరోసా ఇవ్వాలి. కానీ వైసీపీ ఎమ్మెల్యేల రూటే సపరేట్‌గా ఉంది. కడప జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రజల బాధలను గాలికొదిలేసిన వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం గుర్రాలపై స్వారీ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రాజంపేట మండలం ఆకేపాడులో మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఎస్టేట్‌లో వైసీపీ నేతలు సరదాల్లో మునిగితేలారు. అమర్‌నాథ్ రెడ్డితోపాటు ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు సరదాగా ఎస్టేట్‌లో ఎంజాయ్ చేశారు. అమర్‌నాథ్ రెడ్డికి చెందిన గుర్రాలను తీసుకుని ఎస్టేట్‌కు దగ్గరలో ఉన్న చెయ్యేరు నది పరిసరాల్లో గుర్రపుస్వారీ చేస్తూ ఎంజాయ్ చేశారు.  అధికార పార్టీ నేతలు గుర్రాలపై స్వారీ చేస్తూ జల్సాలు చేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైసీపీ నేతల తీరుపై  స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాలు భయంతో చస్తుంటే పట్టించుకోకుండా సరదాల్లో మునిగిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సీఎం సొంత జిల్లాలోనే వైసీపీ నేతల పరిస్థితి ఇలా ఉంటే... రాష్ట్రమంతా ఎలా ఉంటుందో ఊహించవచ్చు.  ఇలాంటి నేతలను ఎన్నుకున్నందుకు సిగ్గుపడుతున్నామంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.     

తెలంగాణ లాక్ డౌన్ లో మినహాయింపులు ఇవే..

తెలంగాణలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ అమలు కానుంది. 20 గంటల పాటు సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయనున్నారు. ఇందుకోసం తెలంగాణ సర్కార్ పక్కాగా మార్గదర్శకాలు రూపొందించింది. ఉదయం మినహాయింపు ఇచ్చిన నాలుగు గంటల సమయంలోనే నిత్యావసరాలు సమకూర్చుకోవాలని సూచించింది. తెలంగాణ లాక్ డౌన్ లో మినహాయింపులు ఇవే..   - వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు,  రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు.  - తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది.  - వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.  - గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది.  -విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి.  - జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది.  - జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి.  - కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు - ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు - ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి. - ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి. - గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి.  - అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి - అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి. - తెలంగాణ చుట్టూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం - ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ  ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది.  - ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.  - కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది.  - సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు మూసి వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.  -పైన తెలిపిన మినహాయింపులను పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని క్యాబినెట్ ఆదేశించింది. - మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి..  10 రోజులపాటు లాక్ డౌన్. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు . కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది.  - మే 20వ తేదీన క్యాబినెట్ తిరిగి సమావేశం అవుతుంది. లాక్ డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. - యుద్ధ ప్రాతిపదికన.. వ్యాక్సిన్ ప్రొక్యూర్ మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది.  - ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేట్ రంగంలో కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను  క్యాబినెట్ ఆదేశించింది.  - అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం. ప్రతిరోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం. - రెమిడిసివర్ ఇంజక్షన్ ఉత్పత్తిదారులతో క్యాబినెట్ సమావేశం నుంచే ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరిన సీఎం.  - ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారు. 

రిజైన్ జగన్! ట్విట్టర్ లో ట్రెండింగ్ 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం తీవ్ర రూపం దాల్చింది. రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతుండగా... వందకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న లెక్క కంటే రెండు, మూడు రెట్లు అధికంగానే కేసులు, మరణాలు నమోదవుతున్నాయని చెబుతున్నారు. బెడ్లు దొరక్క, బెడ్లు ఉన్నా ఆక్సిజన్ లేక కరోనా రోగులు అంతా చూస్తుండగానే చనిపోతున్నారు. సోమవారం రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక పదుల సంఖ్య రోగులు చనిపోవడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. జగన్ సర్కార్ పై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.  రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక కొవిడ్ రోగులు చనిపోయిన ఘటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డే బాధ్యత వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది. రుయా ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ట్విటర్‌లో #ResignJagan హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. మంగళవారం మధ్యాహ్నం వరకే   #ResignJagan హ్యాష్‌ట్యాగ్ తో 20 వేలకు పైగా ట్వీట్లు చేశారు.  ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తిరుపతి రుయాలో మరణ మృదంగం మోగిందని ఓ ట్విటరాటీ ఆరోపించారు. తనకు కన్నీళ్ళు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇంత బాధ్యతారహితంగా ఎలా వ్యవహరించగలుగుతోందని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని సమర్థించేవారిపై పరుష పదజాలాన్ని ఉపయోగించారు. ఆంధ్ర ప్రదేశ్ నిజంగా విపత్తులో ఉందని మరో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు.  విజయనగరం, అనంతపురం జిల్లా హిందుపురం హాస్పిటల్స్ లోనూ ఆక్సిజన్ అందక కొవిడ్ రోగులు చనిపోయారు. వరుసగా జరుగుతున్న ఘటనలతో సామాజిక మాధ్యమాల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నాయకత్వ లోపం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. కోవిడ్-19 రెండో ప్రభంజనం వచ్చినప్పటి నుంచి కనీసం ఒకసారైనా ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఆయన బయటకు రావడం లేదని ఆరోపిస్తున్నారు. 

కాంగ్రెస్ లోకి ఈటల రాజేందర్! భట్టీ విక్రమార్కతో మీటింగ్ 

తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈటల కొత్త పార్టీ పెట్టబోతున్నారని కొందరు చెబుతుండగా.. ఇప్పుడు పార్టీల్లోనే ఏదో ఒక దాంట్లో చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన ఈటల.. రోజులు గడుస్తున్నా ఇంకా రాజీనామాపైనా నిర్ణయం తీసుకోలేదు. తన నియోజకవర్గ నేతలు, బీసీ సంఘాలు, తనకు సన్నిహితంగా ఉన్న నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించినా... రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై మాత్రం క్లారిటీ రాలేదు.  ఈటల ఏం చేయబోతున్నారని చర్చ సాగుతున్న సమయంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో  ఈటల రాజేందర్‌ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్‌లో భట్టి నివాసానికి వెళ్లి ఆయన సమావేశమయ్యారు ఈటల. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై భట్టి విక్రమార్కతో ఈటల చర్చించినట్లు సమాచారం. భట్టీ, ఈటల చర్చలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ లో చేరికపై భట్టితో రాజేందర్ మాట్లాడుతున్నారని కొందరు చెబుతున్నారు. అలాంటేది లేదని ఈటల అనుచరులు అంటున్నారు. ఎలాంటి ప్రాధాన్యత లేకుండా భట్టీతో ఈ సమయంలో రాజేందర్ సమావేశం కావడం ఉండదని, ఖచ్చితంగా కీలక అంశంపైనే ఇద్దరు చర్చించారని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించారు.  ఆ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో కార్యకర్తలు, నేతలతో చర్చించిన ఆయన.. తాజాగా హైదరాబాద్‌లో పలువురు ముఖ్యులను కలిసేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే భట్టి విక్రమార్కతో ఈటల సమావేశమైనట్లు తెలుస్తోంది.