ప్రేమ విఫలం.. పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యయత్నం
posted on May 18, 2021 @ 3:59PM
అది ఖమ్మం జిల్లా. ముదిగొండ మండలం. గోకినేపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన దరిపల్లి రాజుతో ప్రేమలో పడింది.. ఆ సమయంలో ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. దాదాపు ఐదు సంవత్సరాలుగా వారి ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే ఈ మధ్యన తనను పెళ్లి చేసుకోవాలని చెప్పింది ఆ యువతి. అప్పటి నుండి ఆ యువతీ ఎంత చెప్పినా వినకుండా ముఖం చాటేసుకొని తిరుగుతున్నాడు రాజు.. ఆమె చాలా సార్లు పలకరించింది అయినా ఫలితం లేదు.. ఇలా కాదు అని ఆ యువతి ఒక నిర్ణయానికి వచ్చింది. న్యాయం కోసం చివరికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది,.
అతడితో తనకు వివాహం జరిపించాలని గత నెల 25న ముదిగొండ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. తనకు తల్లిదండ్రులు లేరని తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు పట్టించుకోలేదని యువతి ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆమె మనస్తాపం చెందింది. ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించడం.. పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోకపోవడంతో ఆవేదన చెందింది. దీంతో మంగళవారం ముదిగొండ పోలీసల్ స్టేషన్ కు పరుగు మందు డబ్బా పట్టుకొని వచ్చింది. పోలీస్ స్టేషన్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీస్ స్టేషన్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతిని చికిత్స నిమిత్తం పోలీసులు వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి నుంచి ముదిగొండ పోలీస్ స్టేషన్ కు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ముదిగొండ పోలీసులు చెప్పడం గమనార్హం. అయితే చికిత్స పొందుతున్న ఆమె తనకు న్యాయం చేయాలని కోరింది.
కరోనా ఒక వైపు.. భార్య కాన్పుకు మరోవైపు.. డబ్బులు లేక చివరికి ఉరి..
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుంతలం చేసింది. కరోనాసెకండ్ వేవ్ తో ప్రజలపై విరుచుకుపడింది. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్యుడికి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు అయింది. కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆరు నెలలుగా డబ్బులు లేక తన భార్య కాన్పుకు సంబంధించి డెలివరీకి డబ్బులు లేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. నికి సంబంధించిన పూర్తి వివరాలు సిద్దిపేట టూ టౌన్ సీఐ పరుశురాంగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా చందాపూర్ గ్రామానికి చెందిన పడాడ ప్రశాంత్(25), నాగమణి భార్యాభర్తలు. కొన్నాళ్లుగా సిద్దిపేటలో ఉంటూ ఆటో నడుపుకుంటున్నాడు. కరోనా, లాక్డౌన్ఎఫెక్ట్తో ఆటో నడవక, దాని ఈఎంఐలు కట్టడానికి, కుటుంబ పోషణకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టేందుకు బైక్‌ను అమ్మేశాడు.
దీనికితోడు భార్య డెలివరీ టైం దగ్గరపడడంతో వారం క్రితం ఆమెను టౌన్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశాడు. ఆదివారం ఆమెను డిశ్చార్జ్ చేయాల్సి ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. తనలో తను మదనపడుతూ మానసికంగా కుంగిపోయాడు. చేతిలో పైసలు లేవనే బాధలో పత్తి మార్కెట్ దగ్గర లోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య అంజలి కన్నీరుమున్నీరయ్యింది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.