భయమే చంపేసింది..
posted on May 18, 2021 @ 3:46PM
అతడు ఒక ఉపాధ్యాయుడు. అతని పేరు లోకేష్. అతనికి సంవత్సరం కింద పెళ్లి అయింది. ఆ ఉపాద్యాయుడు మొదటి నుండే భయస్తుడు. అతనికి ఈ మధ్య కాలం లో అతనికి కరోనా వచ్చింది. ఇక అంతే అతడు సినిమాలోని ఓ సీన్ రిపీట్ అయింది. అతడు సినిమాలో త్రివిక్రమ్ ఇచ్చిన డెఫినేషన్ గుర్తుండే ఉంటుంది. ‘దెయ్యం కంటే భయం మా చెడ్డది’. ఇది అక్షర సత్యం. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ నృత్యం చేస్తున్న ఈ తరుణంలో కరోనా భయం చాలా మందిని బలితీసుకుంటోంది. కరోనా సోకితే ఖతమే అన్న భ్రమలో, ప్రజలు ఆందోళనల చెందుతున్నారు. ఇది ఇలా ఉండగా కొందరు భయాందోళనలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ధైర్యంగా అనారోగ్య సమస్యను ఎదుర్కోవాల్సింది పోయి.. భయానికి తమ జీవితాలను అప్పగిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది. అదేంటో మీరే చూడండి.
అది కర్ణాటకలోని మైసూరు జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. మైసూరు జిల్లాలోని కేఆర్‌నగర్ పరిధిలో ఉన్న కోగిలూరు గ్రామానికి చెందిన లోకేశ్(26) ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాడు. లోకేశ్‌కు ఏడాది క్రితం ఓ యువతితో వివాహమైంది. లోకేశ్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు అయినప్పటికీ మొదటి నుంచి కొంత భయస్తుడు. ఈ మధ్య లోకేశ్‌కు కరోనా లక్షణాలు కనిపించాయి. టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. తీవ్ర మనోవేదన చెందిన లోకేశ్ తనకు భయంగా ఉందని కుటుంబ సభ్యుల వద్ద వాపోయాడు. ఏం పర్లేదని, చాలామంది కరోనా నుంచి కోలుకున్నారని.. కంగారు పడొద్దని కుటుంబ సభ్యులు లోకేశ్‌కు ధైర్యం చెప్పారు. వైద్యశాఖ అధికారులు కూడా భయపడవద్దని, సక్రమంగా మందులు తీసుకుంటూ.. పౌష్టికాహారం తింటే కరోనాను జయించవచ్చని లోకేశ్‌కు చెప్పారు. ఇలా ఎంతమంది చెప్పినా లోకేష్‌ను కరోనా భయం వదల్లేదు. మాములుగానే కొంత భయస్తుడు కావడంతో కరోనా మహమ్మారి అతనిని మరింత భయపెట్టింది. మూడు రోజులుగా కరోనా సోకిందన్న భయంతో తీవ్ర మనోవేదన చెందిన లోకేశ్ కోగిలూరు నుంచి అత్తారింట్లో ఉన్న భార్య దగ్గరకు వెళతానని ఇంటి దగ్గర చెప్పాడు. వైరస్ సోకిందని.. ఇప్పుడు వెళ్లవద్దని ఎవరు చెప్పినా వినిపించుకోలేదు. బైక్‌పై అత్తారింటికి వెళ్లాడు.
ఇంటి ముందు బైక్ ఆపి.. ఇంట్లో ఎవరినీ కలవకుండా తన దగ్గర ఉన్న ఫోన్‌ను ఇంట్లో పెట్టి అక్కడి నుంచి బయటకు వెళ్లాడు. బయటకు వెళ్లిన లోకేశ్ ఎంతకూ తిరిగిరాకపోవడంతో భార్య, అత్తమామలు అతని కోసం గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో లోకేశ్ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు హాసన్ జిల్లాలోని కేరళపుర దగ్గర ఉన్న కావేరినది దగ్గర లోకేశ్ మృతదేహాన్ని గుర్తించారు. కరోనా సోకిందన్న మనోవేదనతో కావేరి నదిలో దూకి లోకేశ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేల్చారు. ఇలా ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్న లోకేశ్ జీవితం కరోనా భయం వల్ల అర్ధాంతరంగా ముగిసిపోయింది. కరోనా సోకినప్పటికీ భయపడవద్దని, ఆత్మ స్థైర్యంతో మహమ్మారిని జయించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.