జగనన్నకు బర్త్‌డే విషెష్ చెప్పని తల్లిచెల్లి.. కంప్లీట్‌గా తెగదెంపులేనా?
posted on Dec 21, 2021 @ 2:58PM
ఏపీ వ్యాప్తంగా సీఎం జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. జిల్లాల్లో వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు, కేకులతో హంగామా చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. బర్త్‌డే గ్రాండ్‌గానే జరుగుతోంది. ఇంతకీ, అసలైన వాళ్లు జగన్‌కు విషెష్ చెప్పారా? చెప్పాల్సిన వాళ్లు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారా? అంటూ ఏపీ ప్రజలు ఇంట్రెస్టింగ్‌గా న్యూస్ సెర్చ్ చేస్తున్నారు. నెటిజన్ల క్యూరియాసిటీ చంద్రబాబు విషెష్ చెప్పారా? లేదా? అని కాదు.. జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల.. శుభాకాంక్షాలు చెప్పారా లేదా అని ఆరా తీస్తున్నారు. వాళ్లిద్దరూ జగనన్నకు విషెష్ చెప్పలేదని తెలిసి వైసీపీ ఫ్యాన్స్ ఉసూరు మంటున్నారు.
అవును, జగన్‌కు ఇది హ్యాపీ బర్త్‌డే కాకపోవచ్చు. కన్నతల్లి.. తోడబుట్టిన చెల్లి.. తోడుగా లేనప్పుడు అది వేడుక ఎలా అవుతుంది? కొడుకు పుట్టినరోజు నాడు కూడా తల్లి విజయమ్మ తాడేపల్లి ప్యాలెస్‌కు రాలేదంటే.. ఆ కన్నతల్లి ఎంత కడుపుమంటతో ఉండి ఉంటుంది? జగనన్న వదిలిన బాణం.. షర్మిల గుండెల్లో గుచ్చుకొని.. ఆమె విలవిల్లాడి.. పుట్టింటిని వదిలి.. మెట్టింటికి షిఫ్ట్ అయిపోయిన సోదరి షర్మిల సైతం.. జగనన్నకు బర్త్‌డే విషెష్ చెప్పకపోవడం దారుణం. ఆమె ఎంతగా హర్ట్ అయి ఉంటే.. చెల్లిని ఎంతగా బాధపెట్టి ఉంటే.. పుట్టినరోజు నాడు కూడా పట్టింపులు, పంతానికి పోయింటారో ఊహించుకోవచ్చు. బద్ద శత్రువు చంద్రబాబులాంటి వారే హ్యాపీ బర్త్‌డే జగన్ అంటూ విషెష్ చెప్పగా.. విజయమ్మ, షర్మిలమ్మలు.. జగన్‌కు కనీసం మాట వరుసకైనా శుభాకాంక్షలు చెప్పకపోవడాన్ని బట్టి చూస్తే.. ఆ తల్లీకూతుళ్లు జగన్‌పై ఎంత అసంతృప్తి, అసహనం, ఆవేదనతో ఉన్నారో అర్థం అవుతోందని అంటున్నారు.
వైఎస్ కుటుంబంలో కుంపట్లు కొత్తకాకపోయినా.. లేటెస్ట్‌గా జగన్ బర్త్‌డే సందర్భంగా అవన్నీ మరోసారి తెరమీదకు వస్తున్నాయి. గతంలో వైఎస్సార్ జయంతి, వర్థంతిల నాడు కూడా.. వైఎస్సార్ సమాధి సాక్షిగా.. ఇలానే జరిగిందని గుర్తు చేస్తున్నారు. తండ్రి సమాధే వైఎస్సార్ ఫ్యామిలీ వార్‌కు వేదికైంది. ఆ తర్వాత ఓ మీడియా ఇంటర్వ్యూలో షర్మిల మాట్లాడుతూ.. తమ మధ్య అంతగా పెద్ద గొడవలేమీ లేవని.. ఉన్నవన్నీ చిన్నచిన్న ఇష్యూలేనని.. కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అవుతాయంటూ కాస్త సాఫ్ట్ కార్నర్‌గానే ఆన్సర్ ఇచ్చారు. కానీ, అవన్నీ ఉట్టి మాటలేనని.. జగన్‌తో షర్మిలకు బాగా చెడిందని బర్త్‌డేతో తేలిపోయింది. జగన్ నిజ స్వరూపం బాగా తెలిసిన.. మొదటినుంచీ దగ్గరుండి చూసిన.. తల్లిచెల్లిలే జగన్‌ను రిజెక్ట్ చేశారంటే.. మనోడి నైజం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఏపీ ప్రజలు సైతం ఇప్పుడిప్పుడే జగన్ ఆగడాలపై ఓ అంచనాకు, క్లారిటీకి వస్తున్నారు. మరో రెండున్నరేళ్లు భరించడం కష్టమంటున్నారు.