అవినీతిలో అగ్రస్థానం ఎవరిదో!  తెలుగు రాష్ట్రాల మధ్య పోరు..

‘అవినీతి సర్వాంతరయామి. అదొక ప్రపంచ సమస్య’...ఇది మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 40-45  ఏళ్ల క్రితం  ఎప్పుడో వెలిబుచ్చిన అభిప్రాయం. అలాగే,మరో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే నిజమైన లబ్దిదారులకు చేరుతోంది .. మిగిలిన 85 పైసలు మధ్య దళారీల జేబుల్లోకి పోతున్నాయని అన్నారు. ఇక ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ, అక్రమార్కులు విదేశాలకు తరలించుకుపోయిన అవినీతి సొమ్మును ఏడాదిలో వెనక్కి తీసుకోస్తానని మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. నిజానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో వెలుగు చూసిన అవినీతి కుంభకోణాలను నిచ్చెన మెట్లుగా చేసుకునే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అవినీతి రహిత పాలన అందిస్తామని మోడీ మాటిచ్చారు.  అయితే, గడచిన ఏడున్నర సంవత్సరాల మోడీ పాలనలో అవినీతి అదుపులోకి వచ్చిందా అంటే, లేదు. నిజానికి, ఇకొంత పెరిగింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ (టీఐ) 180 దేశాలో  నిర్వహించిన అధ్యయన నివేదిక ప్రకారం మన దేశం గతసంవత్సరం (2020) కంటే ఈ సంవత్సరం (2021)ఆరు మెట్లు దిగజారి, 86 వస్తానానికి చేరింది. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మన దేశంలో అవినీతి పెరిగిందే కానీ, తరగలేదు.    అదలా ఉంటే,తెలుగు రాష్ట్రాల్లో అవినీతిపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సర్వే ప్రకారం దేశంలో అవినీతిలో అగ్రస్థానం కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పనికి రేటు ఫిక్స్ చేసి మరీ లంచాలు వాసులు చేస్తున్నారని, లంచం   ఇవ్వనిదే చావు సర్టిఫికేట్ కూడా రావడం లేదని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తన స‌ర్వే నివేదికలో వెల్లడించింది. ఉభయ తెలుగు  రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో 70 శాతంపైగానే అవినీతి నెలకొందని తేలింది. అధికారులలో 80 శాతం మంది అవినీతిపరులే ఉన్నారన్న‌ ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని  స‌ర్వే రిపోర్టు పేర్కొంది. అత్యధికంగా రెవెన్యూ శాఖలో 85 శాతం అవినీతి ఉందని సర్వే స్పష్టం చేసింది. మూడో స్థానంలో పోలీస్ విభాగం అవినీతి 79 శాతం ఉందని తేల్చింది. అవినీతి నిర్మూలన కోసం పనిచేసే విజిలెన్స్ కమిషన్ , యాంటీ కరప్షన్ బ్యూరో వంటి వాటిపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తన సర్వే వివరాలను వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లోని రాజకీయ నేతల్లో 80 శాతం మంది అవినీతిపరులేనని ప్రజల తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సర్వే పేర్కొంది.  కాగా ఈనివేదికను విడుదల చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయ‌ణ‌ ప్రజలు ఎక్కువగా అనుసంధానం ఉండే విభాగాల్లోనే ఈ అవినీతి ఎక్కువగా కనిపిస్తోందన్నారు.దేశంలో అవినీతిపరులకు ఏళ్ళు పూళ్ళు గడిచినా శిక్షలు పడక పోవడం వలన రాజకీయ అవునీతి రోజు రోజుకు పెరిగిపోతోందే అభిప్రాయం వ్యక్త పరిచారు. తక్ష‌ణమే శిక్ష‌ పడితే ఇతరుల్లో భయం ఏర్పడుతుందని తద్వారా అవినీతి కొంత తగ్గుతుందని ఆయన అన్నారు,  ప్రభుత్వ విభాగాల్లో సాంకేతికతను ఉపయోగిస్తే అవినీతిని నియంత్రించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇన్ కంట్యాక్స్ విభాగాన్ని ఎలాగైతే అన్ లైన్ చేశారో అలాగే ప్రతి విభాగంలో టెక్నాలజీ ఉపయోగిస్తే అవినీతి నిర్మూలన సాధ్యం అవుతుతుందని పేర్కొన్నారు.  ఎన్నికల ఆవినీతికి అడ్డుకట్ట వేయకుండా అవినీతిని ఆదుపు చేయడం అయ్యే పనికాదని, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలలో గెలిచిన ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులకు లంచాలు ఇచ్చి ఉద్యోగాలు, పోస్టింగులు, బదిలీలు తెచ్చుకునే అధికారుల నుంచి నిజాయతీని ఆశించడం కూడా అత్యాశే అంటున్నారు,విజ్ఞులు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓటుకు ఆరు వేలు తీసుకోవడమే కాకుండా, యా డబ్బులకోసం ధర్నాలు చేయడం చూసిన తర్వాత, పెద్ద ఎత్తున అవినీతి ప్రయోజనాలు పొందుతోంది రాజకీయ న్యాకులు, అధికారులే అయినా, అవినీతిలో  సామాన్య ప్రజలకు మినహాయింపు ఇవ్వలేమని అంటున్నారు.

వైసీపీ అంటే.. 'ఏమీ చేత‌గాని ప్ర‌భుత్వం'.. వైఫ‌ల్యాల‌కు ఏపీ కేస్ స్ట‌డీ..

ఏపీ ఖ‌జానా ఖాళీ. ద‌మ్మిడి రాబ‌డి లేదు. ఒక్క అభివృద్ధి పథ‌క‌మూ లేదు. కొత్త‌గా పెట్టుబ‌డి కానీ, కంపెనీ కానీ వ‌చ్చింది లేదు. ఉద్యోగుల జీతాల‌కు డ‌బ్బులు లేవు. సంక్షేమ ప‌థ‌కాల‌కు నిధులు లేవు. కేంద్రం నుంచి అద‌న‌పు అప్పులు ముట్ట‌డం లేదు. ఇలా.. అన్నిట్లోనూ లేదు..లేదు..లేదు. అందుకే, వైసీపీ అంటే.. ఏమీ చేత‌గాని ప్ర‌భుత్వం అంటోంది బీజేపీ.  కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఏపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. ‘వైసీపీ అంటే.. ఏమీ చేతగాని ప్రభుత్వం’ అనేలా తయారైందని ఎద్దేశా చేశారు. జ‌గ‌న్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ నెల 28న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.  "కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రం నిధులివ్వకపోవడంతో కేంద్ర నిధులూ రావడం లేదు. ఉత్తరప్రదేశ్‌ తర్వాత ఎక్కువ నిధులు ఇచ్చింది ఏపీకే. కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టి రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేస్తున్నారు." అని జీవీఎల్ మండిప‌డ్డారు.    "వైసీపీ చేతకానితనంతో రాష్ట్రంలో అభివృద్ధి ఆగింది. ఓటీఎస్‌ పేరుతో కొత్త తరహా దోపిడీకి తెరలేపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆర్థిక వైఫల్యానికి కేస్‌ స్టడీలా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ఉంది" అని జీవీఎల్‌ ఆరోపించారు.

టార్గెట్ అశోక్.. చిక్కుల్లో వైసీపీ ఎంపీ.. లాక్ డౌన్ తప్పదా.. టాప్ న్యూస్@1PM

ధర్మాన్ని పాటించని జగన్ రెడ్డికి అనువంశిక ధర్మకర్తని గౌరవించడం ఏం తెలుస్తుంది? అని నారా లోకేష్ అన్నారు. గాడిదకు గంధం వాసన తెలియనట్టే! అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనం దోచి దాచుకునే వైసీపీ నేతలకు, నీతి నిజాయితీ, దానం గుణం గల మహారాజు అశోక్ గజపతిరాజు గొప్పతనం తెలియదన్నారు. నిబంధనలు ఉల్లంఘనపై ప్రశ్నించిన రాజుపైనే కేసు నమోదు చెయ్యడం హిందూ ధర్మంపై జరుగుతున్న పైశాచిక దాడికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. --- దేవాదాయ చట్టం రాష్ట్రంలో ఉందని.. అది లేకపోయి ఉంటే తను చైర్మన్ పదవి నుంచి ఈ ప్రభుత్వం ఎప్పుడో తొలగించేసి ఉండేదని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. దేవాలయాలకు దేవుడే యజమాని అని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వాడుతున్న భాష తనకు రాదన్నారు. తనపై ప్రభుత్వం వ్యక్తిగతంగా దృష్టి సారించిందని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. రామతీర్ధం కొండపై ఆలయ పునర్నిర్మాణ ముహూర్తం తేదీ నిర్ణయించే ముందు తెలియపరచమని చెప్పినా తన మాట పట్టించుకో లేదన్నారు. --- మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డే ప్రధాన సూత్రధారిగా సీబీఐ అధికారులు తేల్చారు. శివశంకర్ రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షల నిర్వహణపై రేపు పులివెందుల కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. న్యాయస్థానం ముందు ఇప్పటికే సీబీఐ దర్యాప్తు వివరాలను ఉంచింది. పదిరోజుల ముందే న్యాయస్థానానికి సీబీఐ వివరించింది. వివేకా గుండెపోటు, రక్తపు వాంతులతో చనిపోయాడని శివశంకర్ రెడ్డి చెప్పించినట్లు న్యాయస్థానానికి తెలిపింది -------- అవినీతిపరులకు శిక్ష పడితేనే ఇతరులు భయపడతారని సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ అన్నారు. తాము నిర్వర్తించాల్సిన విధులకు అధికారులు రేటు కడితే, పౌరులు ఉపేక్షించొద్దని సూచించారు. ప్రజలు ఎక్కువగా అనుసంధానం ఉండే విభాగాల్లోనే అవినీతి కనిపిస్తోందని, సాంకేతికతతో ఆ అనుసంధానాన్ని తగ్గిస్తే అవినీతి నియంత్రించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆదాయపు పన్ను వివరాలు ఆన్‌లైన్‌లో సమర్పిస్తున్న తరహాలో ఇతర విభాగాల్లోనూ సాంకేతిక సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. --- కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా.. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంత ఇళ్లకు కుళాయిలు, పీఏంజీఏవై కింద ఇళ్లు పూర్తి చేయడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని బీజేపీ నేత లంకా దినకర్ ఆరోపించారు. ఏపీలో 2014 నాటికి 4,193 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ  చొరవతో, కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ పట్టుదలతో 8,183 కిలోమీటర్లకు పెరిగిందన్నారు.  ------ కొవిడ్ ప‌రిస్థితుల‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచార‌ణ చేప‌ట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్ర‌మంలో.. క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై GV ఆంక్ష‌లు విధించాల‌ని కోర్టు పేర్కొన్న‌ది. రెండు, మూడు రోజుల్లో ఈ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచ‌న చేసింది.క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్, సంక్రాంతి వేడుక‌ల్లో జ‌నం గుమిగూడ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది.  --  పీవీ నరసింహరావు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పీవీ ఘాట్ దగ్గర ఆయనకు ఘనంగా నివాళులర్పించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పీవీ ఆర్థికంగా దేశంలో ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. బహు బాషా కోవిదుడని, అన్ని భాషల్లో మాట్లాడగల వ్యక్తి అని, ఈ దేశం గర్వించదగ్గ వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం పీవీ శత జయంతి వేడుకలు  ఘనంగా నిర్వహించిందన్నారు. ఢిల్లీలో కనీసం పీవీ ఘాట్ లేదని తలసాని విమర్శించారు ----- ఇంటర్ బోర్డ్ వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా పొన్నాల మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులను ప్రమోట్ చేయడం ఏంటి? ఫెయిల్ చేయడం ఎందుకని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుతో విద్యార్థులు నష్టపోతున్నారు. ---  జమ్మూకశ్మీరులో జమ్మూకశ్మీరులో జమ్మూకశ్మీరులో భారీ ప్రమాదం తప్పింది. ఉగ్రవాదులు శ్రీనగర్ రోడ్డుపై అమర్చిన 5కిలోల ఐఈడీ పేలుడు పరికరాన్ని సైనికులు కనుగొని దాన్ని ధ్వంసం చేశారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా గురువారం గాలిస్తుండగా శ్రీనగర్ వాన్ పోరా రోడ్డుపై అమర్చిన 5కిలోల ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం కనిపించింది. దీంతో ఆర్మీ బలగాలు ఈ ఐఈడీని ధ్వంసం చేశారు. -- సినిమా టికెట్ ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించడంపై సినీ హీరో నాని బహిరంగానే అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించిందని, ఇది సరైన నిర్ణయం కాదని అన్నారు. టికెట్ ధరలను తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించిందని చెప్పారు. సినిమా థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయని అన్నారు.

వైసీపీ ఎంపీకి సీబీఐ నోటీసులు! వివేకా కేసులో నెక్స్ట్ ఎవరో..? 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చిక్కుల్లో పడబోతున్నారా? ఆయనకు ఉచ్చు బిగిస్తోందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చిందని, త్వరలోనే ఆయనను ప్రశ్నించబోతుందనే ప్రచారం జరుగుతోంది. సీబీఐ నోటీసులపై ఎంపీ కార్యాలయం మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.  మాజీ మంత్రి వైఎస్ వివేకాంద రెడ్డి హత్యలో మొదటి నుంచి ఎంపీ అవినిష్ రెడ్డి పేరు వినిపిస్తోంది. వివేకా కుటుంబ సభ్యులు కూడా ఆయనపై అనుమానాలు వ్యక్తం చేశారు. విపక్షాలు కూడా వివేకా హత్య కేసులో కడప ఎంపీని ప్రశ్నించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చిందనే ప్రచారం సాగుతోంది. అవినాష్ రెడ్డిని ప్రశ్నించడానికి సీబీఐ సిద్ధమైందని తెలుస్తోంది. అవినాష్ రెడ్డి ఎంపీ కావడంతో ఆయనను ప్రశ్నించడానికి లోక్ సభ స్పీకర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే పార్లమెంట్ కార్యదర్శికి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారని.. అవినాష్ రెడ్డిని ప్రశ్నించేందుకు సీబీఐకి స్పీకర్ అనుమతి కూడా ఇచ్చారని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన తర్వాత.. ఆయనను సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.  వివేకా హత్య కేసులో ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనచురుడు దేవిరెడ్డి  శివశంకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్  తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీబీఐ పైనా, వైఎస్ వివేకా కుమార్తె పైనా ఆరోపణలు చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. కేసును ముందుకు తీసుకెళ్లకుండా ఒత్తిడి చేసే వ్యూహంలో భాగంగా ఇలా చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ క్రమంలో సీబీఐ అధికారులు కొద్ది రోజులు విచారణ నిలిపివేసి ఢిల్లీకి వెళ్లారు. తిరిగి వచ్చి ఇప్పుడు నేరుగా అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తుండటంతో.. ఈ కేసులో సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.   

ఎన్జీటీ బోనులో జగన్ సర్కార్! రుషికొండ తవ్వకాలపై సీరియస్.. 

విశాఖపట్నం రుషికొండ వద్ద ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చేపట్టిన సమీకృత పర్యాటక సముదాయం ప్రాజెక్టు నిర్మాణం పనులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది. రుషికొండ వద్ద ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు తీసేసి, కొండవాలును తొలగించి చదును చేస్తున్న క్రమంలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. ఈ కమిటీలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ), రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనాల ప్రాధికార సంస్థ (ఎస్ఈఐఏఏ), జిల్లా కలెక్టర్ ఉండాలని పేర్కొంది. ఈ కమిటీకి నోడల్ ఏజెన్సీగా ఎస్ఈఐఏఏ సమన్వయం చేయాలని సూచించింది. ఈ కమిటీ సభ్యులు త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. రుషికొండ వద్ద నిబంధనలకు వ్యతిరేకంగా మట్టిని తవ్వేస్తున్నారని, బృహత్తర ప్రణాళికను పట్టించుకోవడం లేదని, దీంతో పర్యావరణానికి తీరని హానీ కలుగుతోందని ఎంపీ రఘురామకృష్ణ రాజు ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. దీంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రంగంలోకి దిగింది. ఈ నెల 17న ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చేర్చింది. ఏపీ నగరాభివృద్ధి సంస్థ చట్టం ప్రకారం బృహత్తర ప్రణాళికలో పర్యావరణ సున్నిత ప్రాంతాన్ని పరిరక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఇలా హాని తలపెట్టడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నలుగురు సభ్యుల స్వతంత్ర కమిటీ రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ స్పష్టం చేసింది. విదేశీ, స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు సముద్రానికి అభిముఖంగా 65 ఎకరాల్లో సమీకృత పర్యాటక సముదాయం నిర్మించేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ముందుకొచ్చింది. సముద్రం అందాల్ని కొండపై నుంచే పర్యాటకులు వీక్షించేందుకు రుషికొండ ప్రాంతం అనువుగా ఉందని భావించడంతో సమీకృత పర్యాటక సముదాయం నిర్మించాలని ఏపీటీడీసీ నిర్ణయించింది. రుషికొండ ప్రాంతంలో ప్రస్తుతం హరిత బీచ్ రిసార్ట్, ఓ ప్రైవేట్ హొటల్ ఉన్నాయి. కొత్త ప్రాజెక్టు కోసం హరిత రిసార్ట్, ప్రైవేట్ హొటల్ ను తీసేసి, రుషికొండ కొండవాలును తొలగించి చదునుగా చేయాల్సి ఉంది. రుషికొండ పర్యాటకుల సముదాయ భవనాల్లో అతిథిగృహాలు, ఆడిటోరియం, కన్వెన్షన్ సెంటర్లు, భోజన హొటళ్లు, ఉల్లాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏపీటీడీసీ కార్యాచరణ రూపొందించింది. నిజానికి రుషికొండ వద్ద ఏపీటీడీసీ చేపట్టిన ప్రాజెక్టు విషయంలో పర్యావరణ నిపుణులు మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. సీఆర్జెడ్, పర్యావరణ, అటవీశాఖ అనుమతులు తీసుకున్నప్పటికీ ప్రస్తుతం రుషికొండ వద్ద జరుగుతున్న పనులు పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగేలా ఉన్నాయని వారు భావిస్తున్నారు. రుషికొండ కింద నుంచి పైవరకు సగానికి పైగా తొలిచేయడమే ఇలా నిపుణుల అనుమానాలకు తావిస్తోంది. ఒకప్పుడు ఎంతో పచ్చగా కనిపించే రుషికొండపై ఇప్పుడు ఆ పచ్చదనమే కనిపించకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి. కొండ చుట్టూ తవ్వడంతో మరోపక్కన బండరాళ్లు రోడ్డు మీదకి దొర్లిపడే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఆర్ జెడ్ అనుమతులను పైకి చూపించి, నిబంధనలకు వ్యతిరేకంగా కొండను తొలిచే పనులు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సముద్రం పక్కనే ఉన్న రుషికొండను ఇలా తొలిచేస్తే కొత్త సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. రుషికొండలో తవ్వేసిన మట్టిని సముద్ర తీరంలో డంప్ చేయడం పట్ల కూడా పర్యావరణ వేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.  రుషికొండ వద్ద ఏపీటీడీసీ చేస్తున్న పనులపై స్వతంత్ర కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందో.. తదుపరి పరిణామాలో ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సిందే.

జ‌గ‌న్ కోర్టుకు వెళ్ల‌క త‌ప్ప‌దా? హైద‌రాబాద్‌లో క్యాంప్ ఆఫీస్ రెడీ అందుకేనా?

ముఖ్య‌మంత్రి అయిన కొత్త‌లో జ‌గ‌న్‌ ప్ర‌తీ శుక్ర‌వారం నాంప‌ల్లి సీబీఐ కోర్టుకు హాజ‌ర‌య్యేవారు. వారం వారం కోర్టుకు వెళ్లే సీఎం అంటూ ప్ర‌తిప‌క్షాలు తెగ సెటైర్లు వేసేవి. కొన్నాళ్ల‌కు కోర్టుకు వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు తెచ్చుకున్నారు జ‌గ‌న్‌. ర‌ఘురామ పిటిష‌న్‌తో ఇప్పుడు మ‌ళ్లీ టెన్ష‌న్ మొద‌లైంది. సీబీఐ కేసుల్లో రోజువారీ విచారణ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు చెప్పాల్సి ఉంది. అది రిజర్వ్‌లో ఉంది. వాద‌న‌ల‌ను బ‌ట్టి చూస్తే.. ఆ తీర్పు జ‌గ‌న్‌కు అనుకూలంగా వచ్చే అవకాశం లేదని న్యాయ‌వాద వ‌ర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి అనే కారణంతో విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇక‌పై ల‌భించక‌పోవ‌చ్చని తెలుస్తోంది. తెలంగాణ‌ హైకోర్టు తీర్పుపై జ‌గ‌న్‌లోనూ ఉత్కంఠ పెరిగింది. అందుకే కాబోలు.. ఎందుకైనా మంచిద‌ని.. ముంద‌స్తు ఏర్పాట్ల‌లో ఉన్న‌ట్టుంది జ‌గ‌న్‌. హైద‌రాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా ఉన్న‌ లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌ను రెడీ చేస్తున్నారు. మైన‌ర్ రిపేర్లు చేసి.. స‌రికొత్త‌గా ముస్తాబు చేస్తున్నారు.  హైద‌రాబాద్‌లోని లేఖ్ వ్యూ గెస్ట్‌హౌజ్‌. ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్‌. స‌డెన్‌గా అది ఎందుకు రెడీ చేస్తున్న‌ట్టు?  ముఖ్య‌మంత్రి మాత్ర‌మే ఉప‌యోగించే ఆ క్యాంప్ ఆఫీసును ముస్తాబు చేస్తున్నారంటే.. అది ఆయ‌న ఉండేందుకేగా? అంటే, జ‌గ‌న్ హైద‌రాబాద్‌లో ఉంటారా? ఉంటే ఎందుకు ఉంటారు? అంటే, హైకోర్టు తీర్పు త‌న‌కు వ్య‌తిరేకంగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌నే అనుమానంతోనేనా? ఇక‌పై నాంప‌ల్లి సీబీఐ కోర్టులో రోజువారీ విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి వ‌స్తుంద‌నేనా? అంటూ చ‌ర్చ జ‌రుగుతోంది.  ఇక్క‌డో డౌట్ రావొచ్చు. జ‌గ‌న్ హైద‌రాబాద్‌కు రావాల్సి వ‌స్తే.. అక్క‌డే ఉండాల్సి వ‌స్తే.. ఆయ‌న‌కు ఇల్లు లేదా? లోట‌స్ పాండ్ ప్యాలెస్ లేదా? ప్ర‌భుత్వ క్యాంప్ ఆఫీస్‌లో ఎందుకు ఉంటార‌ని అనుకోవ‌చ్చు. అయితే, ప్ర‌స్తుతం లోట‌స్ పాండ్‌లో చెల్లి ష‌ర్మిల‌, త‌ల్లి విజ‌య‌మ్మ‌, బావ బ్ర‌ద‌ర్ అనిల్‌కుమార్‌లు ఉంటున్నారు. జ‌గ‌న్‌ లోట‌స్ పాండ్‌లో ఉంటే.. వారికి ఎదురుప‌డ‌క త‌ప్ప‌దు.. ముఖం ముఖం చూసుకోక త‌ప్ప‌దు. అది ఇష్టం లేకే.. వారికి త‌న ముఖం చూపించ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌కే.. జ‌గ‌న్ ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసును సిద్దం చేయిస్తున్నార‌ని అంటున్నారు.  రాష్ట్ర విభజన తర్వాత లేఖ్ వ్యూ గెస్ట్ హౌస్‌ను ఏపీకి కేటాయించారు. అప్ప‌టి సీఎం చంద్రబాబునాయుడు మొదట్లో అక్కడ్నుంచే కొంతకాలం పాలించారు. కొంత‌కాలం తర్వాత న‌వ్యాంధ్ర కోసం అమరావతి వెళ్లిపోయారు. ఆ తర్వాత క్యాంప్ ఆఫీసును పట్టించుకోలేదు. జగన్ సీఎం అయిన తర్వాత అందులో అడుగుపెట్ట‌లేదు. సెక్రటేరియట్ భవనాలను తెలంగాణ సర్కార్‌కు అప్పగించిన జగన్.. లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌ను మాత్రం ఏపీ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే ఉంచుకున్నారు. ఇప్పుడు హైద‌రాబాద్‌లోని ఆ ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్‌ను అధికారులు రెడీ చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. త్వ‌ర‌లోనే తెలంగాణ హైకోర్టు తీర్పు రానుండ‌టం.. రోజువారీ విచార‌ణ‌, జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త హాజ‌రు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌నే అనుమానంతోనే హైద‌రాబాద్‌లోని ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్.. లేక్ వ్యూ గెస్ట్ హౌజ్‌ను రెడీ చేయిస్తున్నారా? అని చ‌ర్చించుకుంటున్నారు.   

ఒమిక్రాన్ హాట్ స్పాట్ గా హైదరాబాద్! ఆంక్షలు విధించాలన్న హైకోర్ట్..

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. బుధవారం ఒక్కరోజే 14 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో... హైదరాబాద్ హాట్ స్పాట్ గా మారిందనే ఆందోళన వ్యక్తమవుతోంది.ఇప్పటి వరకు వైరస్ బాధితుల్లో 6 రిస్క్ దేశాల నుంచి, 31 మంది నాన్ రిస్క్ దేశాల నుంచి రాగా... మరొకరు కాంటాక్ట్ వ్యక్తి వైరస్ సోకింది. ఇప్పటికే ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ కు ఒమిక్రాన్ సోకింది. అతని కాంటాక్టులకు పరీక్క్షలు చేయించారు. వాళ్ల రిపోర్టులు రావాల్సి  ఉంది. సెకండరీ కాంటాక్ట్ వ్యక్తులకు ఒమిక్రాన్ నిర్దారణ అయితే వైరస్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.  కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఒమైక్రాన్ వైరస్ తీవ్రత దృష్ట్యా న్యూ ఇయర్ వేడుకలు, క్రిస్మస్ వేడుకలకు ఆంక్షలు విధించాలని  న్యాయస్థానం తెలిపింది. జనం గుంపులు గుంపులుగా గుమి గూడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల్లో ప్రభుత్వం  స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు  పేర్కొంది. ఎయిర్ పోర్ట్‌లో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనాలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయలని ధర్మాసనం ఆదేశించింది.  మరోవైపు జిల్లాలోనూ ఒమిక్రాన్ భయాందోళనలు పెరిగిపోయాయి. జనాలు సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ప్రజలు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించారు. ఇటీవల దుబాయ్ నుంచి గూడెం సొంత గ్రామానికి వచ్చిన వ్యక్తికి ఒమైక్రాన్ నిర్దారణ అయింది. తాజాగా అతని తల్లి, భార్యకు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో గ్రామంలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఎల్లారెడ్డి పేట మండలం, నారాయణపురంలో ఓ శుభకార్యంలో బాధితుడు పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 53 మంది నమూనాలను వైద్యాధికారులు సేకరించి, వారిని ఇళ్ళ నుంచి బయటకు రావద్దని ఆదేశించారు.

అశోక్ గజపతిరాజు అరెస్ట్? రామతీర్థం ఘటనలో కేసు...

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు అరెస్టుకు రంగం సిద్దమైందని తెలుస్తోంది. అశోక్ గజపతిరాజు పై ఇప్పటికే కేస్ నమోదు చేశారు పోలీసులు. బుధవారం జరిగిన రామతీర్థం ఘటన పై రెండు సెక్షన్ల కింద అశోక్ పై నాన్ బెయిల్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ విధులకు భంగం కల్గించడం, గందరగోళం సృష్టించడం, డ్యామేజ్ చేయడం లాంటి అంశాలపై కేసు పెట్టారు. ఆయనతో పాటు మరికొందరి పైనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులోనే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే కేసులు విషయం లో గోప్యత పాటిస్తున్నారు విజయనగరం జిల్లా పోలీసులు.  బుధవారం జరిగిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై కోదండ రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో  ఉద్రిక్తత నెలకొంది. శంకుస్థాపన విషయం ధర్మకర్తల మండలితో చర్చించకపోవడంపై ఆలయ ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపన పూజలను ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స, వెల్లంపల్లి నిర్వహించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దేవాలయ నిర్మాణ కార్యక్రమాలు పూర్వం నుంచి రాజవంశీయులే చేసేవారని.. దీనికి విరుద్ధంగా మంత్రులు నిర్వహించడంపై అశోక్ గ‌జ‌ప‌తిరాజు మండిప‌డ్డారు.  పునర్నిర్మాణ, శంకుస్థాపన ఫలకాలను ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడాన్ని అశోక్ గ‌జ‌ప‌తిరాజు వ్య‌తిరేకించారు. ఆగ్ర‌హంతో ఆయన ఆ ఫ‌ల‌కాల‌ను తోసేశారు. ఈ క్రమంలో అధికారులు, అశోక్‌ మధ్య స్వల్ప తోపుతాట జ‌రగ‌డం ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. పూజల అనంతరం స్వామివారిని దర్శించుకుని రామ‌తీర్థం నుంచి అసంతృప్తిగా వెళ్లిపోయారు అశోక్ గ‌జ‌ప‌తిరాజు. ప్ర‌భుత్వం, మంత్రులు, అధికారుల తీరుపై భ‌క్తులు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించే అశోక్ గజపతిరాజుపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.  కోదండరాముని ఆలయం వ్యవహారం పూర్తిగా మాన్సాస్‌ ట్రస్టుకు సంబంధించిన అంశమని, ప్రభుత్వానికి ఏ రకంగానూ సంబంధం లేదని ట్రస్టు చైర్మన్ అశోక్‌గజపతిరాజు చెబుతున్నారు. ఆలయ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తిచేసిన తరువాత తనకు చెప్పడం బాధాకరమన్నారు. అది తమ పూర్వీకులు 400 సంవత్సరాల కిందట నిర్మించిన ఆలయమని గుర్తు చేశారు. గతంలో తాను విరాళం ఇచ్చిన చెక్కును కూడా ఈవో స్వీకరించలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 

వివేకా హత్య కేసులో సంచలనం.. అతనే కీలకమని సీబీఐ రిపోర్ట్! 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్.. వైఎస్ వివేకాంద రెడ్డి హత్య కేసులో సంచలన  పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసు దర్యాప్తులో వెలుగుచూసిన కీలక విషయాన్ని సీబీఐ వెల్లడించింది. దర్యాప్తులో వెలుగు చూసిన విషయాలకు సంబంధించిన వివరాలను న్యాయస్థానం ముందు ఉంచింది. వివేకా హత్య కేసులో సీబీఐ తాజాగా వెల్లడించిన వివరాలు కీలకంగా మారనున్నాయి.  కోర్టుకు సీబీఐ సమర్పించిన వివరాల ప్రకారం..  వివేకానందరెడ్డి హత్యకు కుట్ర, ఆయన గుండెపోటుతో చనిపోయారన్న ప్రచారం చేయాలన్న సిద్ధాంతానికి రూపకల్పన చేసిన వారిలో  వైసీపీ సీనియర్ నాయకుడు, సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ప్రధాన భాగస్వామి. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్టు తొలుత శివశంకర్‌రెడ్డే చెప్పారని తన నివేదికలో సీబీఐ వెల్లడించింది. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్టు ఆయనే మీడియాకు కూడా చెప్పారని తెలిపింది.  ఘటనా స్థలంలో ఆధారాలను శివశంకర్ రెడ్డి ధ్వంసం చేశారని, వివేకా శరీరంపై ఉన్న గాయాలన్నింటికీ గజ్జల జై ప్రకాశ్‌రెడ్డి అనే కాంపౌండర్‌తో బ్యాండేజీ వేయించి కట్టుకట్టించారని సీబీఐ తన రిపోర్టులో వివరించింది. కొందరు సాక్షులు ఇటీవల సోషల్ మీడియాలో కొత్తకొత్త పేర్లను తెరపైకి తీసుకొస్తూ దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సీబీఐ పేర్కొంది. ప్రస్తుతం జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న శివశంకర్‌రెడ్డికి బెయిలు ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసి పరారయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. వివేకాను చంపితే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని యాదటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్ దస్తగిరిలకు శివశంకర్‌రెడ్డి చెప్పారని కోర్టుకు సమర్పించిన తన నివేదికలో సీబీఐ పేర్కొంది.  వివేకా హత్యకేసు విషయంలో సీఐ శంకరయ్యను బెదిరించారంటూ సంచలన విషయాలు పొందు పరిచింది. వివేకా గుండెపోటు, రక్తపు వాంతులతో చనిపోయారని తాము చెబుతున్నామని, కాబట్టి ఈ వ్యవహారంలో నోరుమూసుకుని ఉండాలని శంకరయ్యను హెచ్చరించారని, సాక్షులను బెదిరించారని సీబీఐ తన రిపోర్టులో వెల్లడించింది. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఇచ్చిన తాజా నివేదిక సంచలనంగా మారింది. ఈ కేసులో పెద్దల హస్తం ఉందనే అనుమానాలకు బలం చేకూరుస్తోందని అంటున్నారు. 

హైకోర్ట్ అక్షింతలు.. ఆయనకు అలవాటుగా మారిపోయాయా? 

కొత్త విషయం కాదు. పాత కబురే. న్యాయస్థానాలు అక్షింతలు వేయడం. ప్రభుత్వాలు తుడిచేసుకు పోవడం, అంతటా ఉన్నదే అయినా, ఉభయ తెలుగు రాష్ట్రాలలో అది ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి అయితే చెప్పనే అక్కర లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజేపీలు కోర్టు బోనులో నిలబడి క్షమాపణలు వేడుకున్న సందర్భాలున్నాయి. అంతేకాదు, పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వివాదం  మొదలు ఇటీవల   ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పేరిట విధించే చలానాలకు సంబంధించి ఎన్నో వివాదాస్పద నిర్ణయాలను న్యాయస్థానాల జోక్యంతో ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సందర్భాలున్నాయి. అలాగే, తెలంగాణ ప్రభుత్వం పై ఆర్టీసీ సమ్మె టైంలో, ఇంటర్ స్టూడెంట్లు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినప్పుడు.. కరోనా విషయంగా, జీవో 111 విషయంలో, దళిత బంధు జీవో విషయంలో .. ఇంకా ఎన్నో సందర్భాలలో హైకోర్టు అక్షింతలు వేసింది.అయినా అటు ఏపీ  ప్రభుత్వం ఇటు తెలంగాణ సర్కార్, న్యాయస్థానాల అక్షింతలకు అలవాటు పది పోయాయా అన్న విధంగా వ్యవహరిస్తున్నాయే కానీ, పద్దతి మార్చుకోవడం లేదు.  ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ నిర్లక్ష్య ధోరణిని రాష్ట్ర హై కోర్టు ధర్మాసనం మరోమారు తీవ్రంగా తప్పుపట్టింది. అంతే కాకుండా, రూ.10 వేల జరిమానాను విధించింది.  విషయంలోకి వెళితే, 2016లో రెవెన్యూ కార్యదర్శిగా సోమేశ్ కుమార్, సాగు నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు జారీ చేసిన ఓ జీవోకు వ్యతిరేకంగా హై కోర్టులో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై అప్పటినుంచి హైకోర్టులో విచారణ జరుగుతూనేవుంది. ప్రభుత్వ వివరణ కోరుతూ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాల్సిందిగా కోర్టు పలుమార్లు ఆదేశించింది. అయినా ప్రభుత్వం స్పందించలేదు సరికదా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ వచ్చింది.  కాగా, ఈ కేసును బుధవారం విచారించిన సందర్భంగా  హైకోర్ట్ ధర్మాసనం నాలుగేళ్లుగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం మాత్రమే కాక వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించినా హాజరవ్వనందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్‌ను కూడా వేయలేదని గుర్తు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి  రూ.10 వేల జరిమానాను విధించింది. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి కరోనా సహాయ నిధికి జమ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణకు స్వయంగా హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. గత నెలలో జరిగిన విచారణ సందర్భంగా కూడా కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని స్పష్టం చేశామని.. లేనట్లయితే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో వ్యక్తిగతంగా హాజరుకావాలని వివరించామని కోర్టు తెలిపింది.. అయినా ఆ రెండూ జరగలేదని పేర్కొంది. వీటన్నింటినీ గుర్తు చేసిన ధర్మాసనం.. రూ.10 వేల జరిమానా విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. వచ్చే నెల 24న సీఎస్ స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.అయితే నలుగు సమ్వత్సరాల నుంచి స్పందించని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా అంటే అనుమానమే అంటున్నారు. కాగా, ఓ ప్రముఖ న్యాయవాది పేర్కొన్నట్లుగా కేసు మెరిట్స్, డీ మెరిట్స్ విషయం ఎలా ఉన్నా, కోర్టు ఆదేశాలను ఉల్లంగించడం ద్వారా ప్రభుత్వం సామాన్యులకు ఎలాంటి సంకేతాలు ఇస్తోందనేది ఆలోచించవలసిన విషయం. 

బాలినేని భవిష్యత్తు.. ఇక బందరు బస్టాండేనా?

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఎపిసోడ్‌ కారణంగా రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అవుతుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై పలు ఆరోపణలు ఉన్నాయి... కానీ అవి సుబ్బారావు గుప్తా ఇష్యూ అంత రచ్చ కాలేదని.. అవి పూర్తిగా పోలిటికల్ సర్కిల్‌కే పరిమితమైయ్యాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాని సుబ్బారావు గుప్తా విషయంలో బాలినేనితోపాటు ఆయన అనుచరులు వ్యవహరించిన తీరుపై తెలుగు ప్రజలు గుర్రుగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  నిజాయితీగా వ్యాపారం చేసుకునే సుబ్బారావు గుప్తా.. బాలినేని శ్రీనివాసరెడ్డికి అనుచరుడుగా.. ఫ్యాన్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. మంత్రి వాసన్న జన్మదినం సందర్భంగా గుప్తా చేసిన కామెంట్లు.. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడం.. ఆ తర్వాత సుబ్బారావు గుప్తాపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుడు సుభానీ దాడి చేసి బండ బూతులు తిట్టడం.. సుబ్బారావుని మొకాళ్ల మీద కూర్చోబెట్టి.. మంత్రి బాలినేని వాసన్నకు క్షమాపణలు చెప్పిచడం వరకు చోటు చేసుకున్న ఎపిసోడ్ అంతా అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌పై మంత్రి వాసన్న.. ఓ ప్రెస్ మీట్ పెట్టి.. సుబ్బారావు గుప్తా విషయంలో ఇలా జరిగి ఉండాల్సింది కాదంటూ.. కొద్దిగా సన్నాయి నొక్కులు నొక్కినా సరిపోయేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. జరగాల్సిందంతా జరిగి పోయిన తర్వాత... సుబ్బారావు గుప్తాను మంత్రి వాసన్న విజయవాడ పిలుపించుకుని.. సుబ్బారావు కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడారంటూ మీడియోలో వైరల్ అయింది. అయితే బాలినేని నివాసంలో సీఎం జగన్ జన్మదిన వేడుక సందర్భంగా మంత్రి వాసన్నే స్వయంగా కేక్ కట్ చేసి.. సుబ్బారావు గుప్తాకు తినిపించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.  అయితే మంత్రి వాసన్న ఇలా వ్యవహరించడం కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే అని రాజకీయ విశ్లేకులు స్పష్టం చేస్తున్నారు. అలాగే బాలినేని మరో అనుచరుడు, ఫ్యాన్ పార్టీ మైనారిటీ నాయకుడు సుబానీపై పోలీసులు కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత అతడు స్టేషన్ బెయిల్‌పై విడుదల కావడం కూడా మంత్రి వాసన్న తెర వెనుక రాజకీయంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బాధితుడు సుబ్బారావు గుప్తా.. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ పోలీసులను డిమాండ్ చేయడం కొసమెరుపు. మంత్రి గారు అభయ హస్తం ఇస్తే.. బాధితుడు ఇలా పోలీసులను ఎందుకు ఆశ్రయిస్తాడని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.         మరో వైపు సుబ్బరావు గుప్తాపై దాడిని ఆర్య వైశ్య నాయకులు సైతం ఖండిస్తున్నారు. ఆ సంఘం నేతలు పలువురు ఇప్పటికే గుప్తాని ఆయన కుటుంబ సభ్యులను సైతం పరామర్శించారు. సుబ్బారావుకు తొలుత దెబ్బలు రుచి చూపించి.. ఆ తర్వాత కేకు తినిపించి.. కేకు రుచి చూపించారంటూ ఈ ఎపిసోడ్‌పై సోషల్ మీడియాలో టాక్ వైరల్ అవుతోంది. గతంలో బాలినేని మంత్రిగా పని చేశారు. కానీ నాడు ఆయనపై అంతగా ఆరోపణలు లేవన్న సంగతి తెలిసిందే. కానీ రెండో సారి ఆయన ఏమంటా మంత్రి పదవి చేపట్టారో.. నాటి నుంచి ఆయనపై సమస్యలు.. విమర్శులు సైతం ముసురుకున్నాయి. మంత్రి పదవి చేపట్టిన కొద్ది రోజులకే ఆయన పీఏ ఏకంగా . మంత్రి వాసన్న సంతకం ఫోర్జరీ చేసి బదిలీల సిఫార్సు లేఖలు ఇచ్చిన వ్యవహారం నాడు పెద్ద దుమారాన్నే రేపింది. అలాగే గతేడాది ఒంగోలుకు చెందిన ఫ్యాన్ పార్టీ నేత ఒకరు ఆరు కోట్ల రూపాయిల నగదు తరలిస్తూ.. చెన్నై సరిహద్దుల్లో పోలీసులకు దొరికిపోయాడు. అయితే సదరు సొమ్ము బాలినేని వాసన్న హవాలా సొమ్ము అంటూ ప్రతిపక్షాలు నానాయాగీ చేసి వదిలాయి. ఆ సొమ్ము తనది కాదని మంత్రి వాసన్న స్పష్టం చేసినా.. విపక్షాలు.. మాత్రం ఆయనపై విమర్శలు ఆపలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  ఇక ఒంగోలు నగర శివారులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భూ ఆక్రమణలకు తెర తీశారు. దీని వెనక బాలినేని హస్తం ఉందంటూ స్థానికంగా పెద్ద ప్రచారం జరిగింది... జరుగుతోంది. బాలినేని ఇమేజ్‌ను ఇవన్నీ కొద్దో గోప్పో డ్యామేజ్ చేస్తే.. సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ మాత్రం మంత్రి వాసన్న పోలిటికల్ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఈ మొత్తం ఏపిసోడ్‌తో మంత్రి బాలినేని వాసన్న రాజకీయ భవిష్యత్తు.. ఇక బందరు బస్టాండేనన్న టాక్ సోషల్ మీడియా సాక్షిగా జోరుగా వైరల్ అవుతోంది.

ఒక్కరోజే 14 ఒమిక్రాన్ కేసులు.. తెలంగాణ లాక్ డౌన్ తప్పదా!

ఒమిక్రాన్ వైరస్ తెలంగాణలో విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి పెరిగింది. తాజాగా నమోదైన కేసుల్లో రెండు రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన కేసులు కాగా.. మిగితా 12 నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన వారిలో నిర్దారణ అయింది. ఒమిక్రాన్ కేసుల్లో ప్రస్తుతం దేశంలో మూడో స్థానంలో ఉంది తెలంగాణ. ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాత తెలంగాణలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కాంటాక్ట్ కు కూడా ఒమిక్రాన్ సోకడం కలకలం రేపుతోంది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్దారణ కాగా.. అతనికి చికిత్స చేసిన ఓ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ కు ఒమిక్రాన్ సోకింది. ఆ డాక్టర్ భార్యకు కూడా కరోనా పాజిటివ్ రాగా.. ఒమిక్రాన్ రిపోర్టు రావాల్సి ఉంది. ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండటంతో వైద్య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలో ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ రోజున ఆంక్షలు విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలుస్తోంది. వైద్య వర్గాలు కూడా ప్రభుత్వానికి ఈ దిశగా ప్రతిపాదనలు చేశాయని చెబుతున్నారు. 

ఒమిక్రాన్ పుట్టుకకు హెచ్ఐవీకి లింక్?

కరోనా, డెల్టా వేరియంట్లు ప్రపంచాన్ని అతలాకుతం చేసేశాయి. కరోనా తీవ్రత కాస్త తగ్గడంతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది ప్రపంచం. ఇంతలోనే పులి మీద పుట్ర అన్నట్లు ప్రపంచ దేశాల్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరింత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 90 దేశాలకు పైగా ఒమిక్రాన్ వైరస్ వ్యాపించింది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ మూలాల్లో అత్యంత ప్రమాదకరమైన ఎయిడ్స్ వ్యాధి ఉందట. ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుకకు హ్యూమన్ ఇమ్యూనో డెఫిసియన్సీ వైరస్ (హైచ్ఐవీ) కారణం అని దక్షిణాఫ్రికా పరిశోధకులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీంతో జనంలో ఆందోళన మరింత పెరుగుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికాలో ముందుగా బయటపడింది. అయితే.. అది ఎలా పుట్టుకొచ్చింది? అనే దానిపై మాత్రం ఎవరూ స్పష్టత ఇవ్వలేకపోయారు. కరోనా వైరస్ నుంచి ఒమిక్రాన్ గా ఎలా రూపాంతరం చెందింది అనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. దాంతో పాటుగా ఒమిక్రాన్ కు ఇతర లక్షణాలు ఏవైనా ఉన్నాయా? అని తెలుసుకునేందుకు కూడా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పరిశోధకులు మరింత ఆందోళన కలిగించే వివరాలు వెల్లడించారు. ఒమిక్రాన్ మూలంలో హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ తో సంబంధాలు ఉండే అవకాశాలు లేకపోలేదని వారు ఓ నిర్ధారణకు వచ్చారు. హెచ్ఐవీ సోకిన మహిళకు కరోనా సోకిందని, దాంతో కరోనా వైరస్ లో మార్పులు జరిగి ఒమిక్రాన్ గా రూపాంతరం చెంది ఉండే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే.. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల పరిశోధనలను ప్రస్తావిస్తూ.. ఒమిక్రాన్ కు హెచ్ఐవీకీ సంబంధం ఉందని చెబుతున్న శాస్త్రవేత్తల అభిప్రాయాలు అత్యంత ఆమోదయోగ్యంగా ఉన్నాయట. ఈ విషయాన్ని బీబీసీ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. కేంబ్రిడ్జి యూనివర్శిటీకి చెందిన డాక్టర్ కెంప్ బృందం కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. హెచ్ఐవీ ఉన్నవారిలో కరోనా విజృంభించేందుకు చాలా అనుకూల పరిస్థితులు ఉంటాయని కెంప్ బృందం తెలిపింది. దక్షిణాఫ్రికాలో హెచ్ఐవీ బాధితులు ఎక్కువగా ఉన్నందున అక్కడే కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ గా మారి ఉండవచ్చని కెంప్ టీం అంచనా వేసింది. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న కొందరిలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించడం ఆందోళన కలిగించే అంశమే. ఒమిక్రాన్ కు ఇంత శక్తి ఎలా వచ్చింది? ఎందుకు అంత వేగంగా విస్తరిస్తోంది అనే ప్రశ్నలకు జవాబు ప్రస్తుతానికైతే దొరకడం లేదు. ఏదైనా అనుమానం వస్తే.. దాని అంతు తేల్చే వరకు శాస్త్రవేత్తలు చూస్తూ కూర్చోరు. దానికి కారణాలు ఏంటి అనే వాటికి జవాబులు రాబట్టే వరకూ నిద్రపోరు. అలా చేసిన పరిశోధనల కారణంగానే ఒమిక్రాన్ మూలాల్లో హెచ్ఐవీ ఉందనే విషయం వెల్లడైంది. కాగా.. దక్షిణాఫ్రికా పరిశోధకులు ఇప్పుడు ఒమిక్రాన్ కూ హెచ్ఐవీలో మూలాలు ఉండొచ్చనే దానిపై మరింత నిశితంగా.. లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇలా ఉండగా.. ఒమిక్రాన్ వేరియంట్ అందరి అంచనాలకు మించి చాలా కాలం పాటు ఉనికిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతుండడం గమనార్హం.

సీక్రెట్ పై సీరియస్.. ఎవరిని వదల.. ముందస్తు ముచ్చట.. టాప్ న్యూస్@7PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమమంలో ఇచ్చిన విభజన హామీల అమలుకు పదేళ్ల సమయం పడుతుందని కేంద్ర హోంశాఖ తెలిపింది. టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానం ఇచ్చింది. విభజన హామీల అమలు పనులు కొన్ని పలు దశల్లో ఉన్నాయని పేర్కొంది. హామీల అమలుపై హోంశాఖ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తోందని పేర్కొంది. ఇప్పటివరకు కేంద్రహోం శాఖ 25 సమీక్షలు నిర్వహించిందని తెలిపింది. -----జీవోఐఆర్టీ వెబ్‌సైట్‌లో జీవోలు ఎందుకు పెట్టట్లేదని ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సాఫీగా జరిగిపోయే ప్రక్రియకు ఆటంకం కల్పించడంపై సీరియస్ అయింది. వెబ్‌సైట్‌లో ప్రభుత్వ జీవోలను ఉంచకపోవడంపై తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం విడుదల చేసే జీవోల్లో ఐదు శాతం మాత్రమే వెబ్ సైట్‌లో ఉంచుతున్నారని వాదించారు. ------- ‘‘నా తల్లిని విమర్శించడం బాధించింది. నా తల్లిపై ఆరోపణలు చేసిన వారిని వదిలిపెట్టం’’ అని టీడీపీ నేత నారా లోకేశ్‌ హెచ్చరించారు. మంగళగిరిలోని పలు వార్డుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు లోకేష్. నిడమర్రు రోడ్డులో డంపింగ్‌ యార్డును ఆయన పరిశీలించారు. డంపింగ్‌ యార్డు మారుస్తామని చెప్పి ఎమ్మెల్యే మాట తప్పారని దుయ్యబట్టారు. వరద బాధితులను ఆదుకుంటే ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు.  ------- ఆలయ సంస్కృతి, సంప్రదాయాలకు వైసీపీ తిలోదకాలు ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రామతీర్థంలో అశోక్ గజపతిరాజును అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంత్రి వెల్లంపల్లి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శంకుస్థాపనపై ధర్మకర్తల మండలితో చర్చించకపోవడం జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు నిదర్శనమన్నారు.  ----- కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో వాదనలు వినబోనని జడ్జి  జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ స్పష్టం చేశారు. కేసు విచారణను మరో బెంచ్‌కి పంపాల్సిందిగా సీజేకి సమాచారం పంపారు. బుధవారం కేసు విచారణ సందర్భంగా కొండపల్లి కౌన్సిలర్ల తరపు న్యాయవాది, బెంచ్‌తో వాదనకు దిగడంతో విచారణను న్యాయమూర్తి వాయిదా వేసి వెళ్లారు. ------- తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర నేతలతో  జరిగిన సమావేశంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని వ్యాఖ్యానించారని సమాచారం. కేసీఆర్ ముందస్తు ఎన్నికలు వెళ్లొచ్చని  అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. తనకున్న ఇన్‌పుట్స్ ఆధారంగానే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని బీజేపీ నేతలు భావిస్తున్నారు ---- గుంటూరు జిల్లా అమరావతి పీఎస్‌లో వైసీపీ నేత వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో పోలీసులపై బూతు పురాణం అందుకున్నాడు. ఇసుక రవాణా చేస్తున్న తన ట్రాక్టర్‌ను ఆపారంటూ పోలీస్‌ స్టేషన్‌కు వైసీపీ నేత తాగొచ్చాడు. విషయం బయటకు రాకుండా వైసీపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సోషల్‌ మీడియాలో వైసీపీ నేత బూతు పురాణం వైరల్‌గా మారింది.   ------- ఏపీలో రెండో ఒమైక్రాన్‌ కేసు నమోదయింది. తిరుపతిలో మహిళకు ఒమైక్రాన్‌ పాజిటివ్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కెన్యా నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి తిరుపతికి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఒమైక్రాన్‌ బాధిత మహిళను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు ------ హైదరాబాద్ నగరంలోని 10 పబ్‌లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 31లోగా పబ్‌లను కట్టడి చేయాలని సూచించింది. రెసిడెన్షియల్ ప్రాంతంలో పబ్‌లకు అనుమతి ఇస్తున్నారంటూ.. దాన్ని సవాల్ చేస్తూ దాకలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో 10 పబ్‌లకు నోటీసులు జారీ చేసింది.పబ్‌ల అరాచకాలపై జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్ సభ్యులు పిటిషన్‌ వేశారు. ----- పార్లమెంటు శీతాకాల సమావేశాలు విజయవంతమయ్యాయని కేంద్రం ప్రకటించింది. అయితే విపక్షాలు మాత్రం పెదవి విరిచాయి. ఉభయసభల్లో ఎలాంటి చర్చ లేకుండానే హడావిడిగా బిల్లులు ఆమోదించారని, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై చర్చించాలని తాము కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నాయి. షెడ్యూల్ తేదీ కంటే ఒకరోజు ముందుగా బుధవారంనాడు పార్లమెంటు సమావేశాలు నిరవధింగా వాయిదా పడ్డాయి.

కన్న తల్లిని ఇంటి నుంచి గెంటేసిన మున్సిపల్ చైర్మెన్..

అతను అధికార పార్టీ నాయకుడు. పట్టణానికి ప్రధమ పౌరుడు. పట్టణ ప్రజల రక్షణ బాధ్యతలు చూసే గౌరవప్రదమైన పదవిలో ఉన్న ఆ నాయకుడు అత్యంత నీచంగా ప్రవర్తించాడు. సభ్య సమాజం తల దించుకునేలా వ్యవహరించాడు. కన్న తల్లిపైనే దాడి చేశాడు. ఏకంగా ఇంటి నుంచి గెంటేశాడు. ఆస్తి కోసం ఈ దారుణానికి ఒడిగట్టాడు ఆ వైసీపీ నేత. కన్న తల్లిని ఇంటి నుంచి మున్సిపల్ చైర్మెన్ గెంటేస్తున్న ఫోటోలు,దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  ఈ దారుణ ఘటన కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది. మున్సిపల్ చైర్మెన్ రఘు.. తల్లిదండ్రులపై దాడికి తెగబడ్డాడు. తల్లిని ఇంటి నుంచి గెంటివేశాడు. ఆస్తి కోసం తల్లిదండ్రులతో కొన్ని రోజులుగా రఘు గొడవపడుతున్నాడు. ఈ క్రమంలోనే వారిపై దాడి చేశాడు. ఆస్తి కోసం రఘు తమను వేధిస్తున్నాడని తల్లి సరోజ ఎమ్మిగనూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసింది. ఇంటికొచ్చి తమపై దాడి చేస్తున్నాడని, కుమారుడితో తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో తెలిపింది. మున్సిపల్ చైర్మెన్ నుంచి  తమకు రక్షణ కల్పించాలని ఆమె ఎస్పీకి విజ్ఞప్తి చేసింది. గత మూడు నెలలుగా ఆస్తి కోసం తన కొడుకు వేధిస్తున్నాడని పోలీసులకు వెల్లడించింది ఆ తల్లి. కన్న తల్లిని మున్సిపల్ చైర్మెన్ గెంటేసిన ఘటన ఎమ్మిగనూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది. కన్న తల్లిపైనే కిరాతకంగా దాడి చేసిన వ్యక్తి తమకు చైర్మెన్ గా ఉండటం దౌర్బాగమని ఎమ్మిగనూరు  ప్రజలు మండిపడుతున్నారు. కన్నతల్లిపై దాడి చేసిన మున్సిపల్ చైర్మెన్ పై కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతలతో కుటుంబ సభ్యులకు కూడా రక్ణణ లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. మున్సిపల్ చైర్మెన్ తీరు తమకు  తీవ్ర ఇబ్బందికరంగా మారిందని జిల్లా వైసీపీ నేతలు కలవరపడుతున్నారు. 

టెస్లా స్మార్ట్‌ఫోన్‌.. ధ‌ర ఎంత‌? ఫీచ‌ర్స్‌ ఏంటి?

టెస్లా. ఎల‌క్ట్రిక్ కార్లు, అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లు, శాటిలైట్లు.. లేటెస్ట్‌గా స్మార్ట్‌ఫోన్లు. అన్నిట్లోనూ ఎలాన్ మ‌స్క్ మార్క్ త‌ప్ప‌క క‌నిపిస్తుంది. రొటీన్‌కు భిన్నంగా, మిగ‌తా వాటికంటే సంథింగ్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. అందుకే, టెస్లా కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్ రాబోతోందంటే ప్ర‌పంచ వ్యాప్తంగా ఆస‌క్తి పెరిగింది. మార్కెట్‌ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆ ఫోన్‌ పేరేంటి? ధరెంత ఉంటుంది? ఏమేం ఫీచర్లు ఉంటాయి? ఫోన్‌ను ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు? లాంటి విశేషాల‌పై నెటిజన్లు ఇంట్రెస్టింగ్‌గా సెర్చ్ చేస్తున్నారు. ఇంత‌కీ టెస్లా ఫోన్ ప్ర‌త్యేక‌త‌లేంటంటే.... మోడల్‌ పై/పీ (Model Pi/P) పేరుతో టెస్లా ఫోన్ రాబోతోంద‌ని తెలుస్తోంది. కంప్లీట్ గేమింగ్ ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్ రిలీజ్‌ చేయనుంది. పైభాగంలో నేవీ బ్లూ.. వెన‌క‌ స్కై బ్లూ క‌ల‌ర్‌లో ఫోన్ ఉంటుంద‌ని అంటున్నారు. ఐఫోన్‌కు యాపిల్ సింబ‌ల్ ఉన్న‌ట్టు.. ఈ ఫోన్ వెనుక వైపు ‘T’ అక్షరంతో టెస్లా లోగో ఉంటుందని వార్త‌లు వ‌స్తున్నాయి.  టెస్లా ఫోన్‌లో 108 ఎంపీ కెమెరాతో పాటు మరో రెండు కెమెరాలు ఉంటాయట. 6.5 ఇంచెస్‌ స్క్రీన్‌.. 4K రిజల్యూషన్ డిస్‌ప్లే.. స్నాప్ డ్రాగన్‌ 898 ప్రాసెసర్‌.. 2 టీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ ఉంటుంద‌ట‌. అయితే, టెస్లా ఫోన్‌ ఓఎస్‌ గురించి వివ‌రాలు మాత్రం ర‌హ‌స్యంగా ఉంచుతున్నారు. కొత్త ఓఎస్‌ను తీసుకొస్తారా?  లేక‌, అండ్రాయిడ్‌లాంటి వాటితోనే ప‌ని కానిచ్చేస్తారా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ప్రస్తుతం టెస్ట్ మోడ్‌లో ఉన్న టెస్లా ఫోన్‌.. వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి రిలీజ్ కానుంది.  టెస్లా స్మార్ట్‌ఫోన్‌ ధర 800 డాలర్ల నుంచి 1,200 డాలర్ల మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 60 వేల నుంచి రూ. 90 వేలు ఉండొచ్చు. టెస్లా ఫోన్.. యాపిల్ ఐఫోన్‌, శాంసంగ్‌, వ‌న్‌ప్ల‌స్ ఫోన్స్‌కు గ‌ట్టి పోటీ ఇవ్వ‌డం ఖాయం. అయితే, టెస్లా ఫోన్ గేమింగ్ సెగ్మెంట్లో రానుండటంతో వేటి మార్కెట్ వాటికే అంటున్నారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు? బీజేపీ నేతలకు సిగ్నల్స్..

2018లో తెలంగాణ ముందస్తు ఎన్నికలు వచ్చాయి. మొదటి టర్మ్ లో అసెంబ్లీలో ముందుగానే రద్దు చేశారు కేసీఆర్. 2019 జూన్ వరకు గడువున్నా .. దాదాపు 10 నెలల ముందుగానే 2018 ఆగస్టులో అసెంబ్లీని డిసాల్వ్ చేశారు. దీంతో తెలంగాణలో ఆరు నెలల ముందుగా అంటే 2018 డిసెంబర్ తొలి వారంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక రెండో టర్మ్ లోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. ఇటీవల కాలంలో కేసీఆర్ దూకుడు పెంచడం, వరుస సమావేశాలు నిర్వహించడం, జిల్లాల పర్యటనలకు సిద్ధమవడంతో .. ముందస్తు ఎన్నికల ప్రచారానికి బలం చేకూరింది. తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనూ సిట్టింగులపై టికెట్లు ఇస్తానని చెప్పారు కేసీఆర్. త్వరలో ఎన్నికలు రాబోతున్నందు వల్లే గులాబీ బాస్ ఆ ప్రకటన చేశారనే చర్చ సాగుతోంది. కేసీఆర్ తీరు ముందస్తు ఎన్నికలకు అవకాశం ఉందన్న సంకేతాలు ఇస్తుండగా.. తాజాగా కేంద్రం పెద్దల నుంచి అలాంచి సిగ్నలే వచ్చింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది.  తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమైన అమిత్ షా.. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని వ్యాఖ్యానించారని సమాచారం. కేసీఆర్ ముందస్తు ఎన్నికలు వెళ్లొచ్చని  అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. తనకున్న ఇన్‌పుట్స్ ఆధారంగానే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు.  త్వరలోనే  తాను తెలంగాణకు వస్తానని, రెండు రోజుల పర్యటిస్తానని కూడా రాష్ట్ర బీజేపీ నేతలకు చెప్పారు అమిత్ షా. కేసీఆర్ సర్కార్ పై గట్టిగా పోరాడాలని కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశనం చేశారు. కేసీఆర్ అసత్యప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు టీఆర్‌ఎస్ చేస్తున్న ప్రయత్నాలపై అమిత్ షా సీరియస్‌ అయ్యారనే తెలుస్తోంది. రాష్ట్ర మంత్రుల చావు డప్పు కొట్టడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించినట్టుగా సమాచారం. మొత్తంగా రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా చేసిన కామెంట్ల ప్రకారం తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేంద్రానికి స్పష్టమైన సమాచారం ఉందని తెలుస్తోంది. అందుకే కమలం నేతలు కూడా దూకుడు పెంచారని అంటున్నారు. 

మతమార్పిడి నిరోధక చట్టం.. కమలం కంటే ‘రెండాకులు’ఎక్కువే..

మరో బీజేపీ పాలిత రాష్ట్రం మతమార్పిడి నిరోధక బిల్లు తీసుకొచ్చింది.  ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు మతమార్పిడి నిరోధక చట్టాలు చేసి అములు చేస్తున్నాయి. ఇపుడు ఆ జాబితాలో మరో  బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటక  చేరింది. అయితే,దేశాన్ని హిందూ రాష్రం బగా ప్రకటించాలని చూస్తున్న బీజేపీ, పాలిత రాష్ట్రాలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు.ఇదేమి విచిత్రం కాదు. ఉహించనిదీ కాదు. నిజానికి ఇది ఎప్పుడో జరగవలసిందే కానీ, శాసన మండలిలో మెజారిటీ లేక పోవడం వలన కర్ణాటక ప్రభుత్వం ఇంతవరకు కొంత జాప్యం చేసింది. ఇటీవల జరిగిన మండలి ఎన్నికల్లో పెద్దల సభలో అధికార బీజేపీకి ఆధిక్యత రావడంతో జాప్యం చేయకుండా మతమార్పిడి నిరోధక బిల్లు మంగళవారం(డిసెంబర్ 21) శాసనసభలో  ప్ర‌వేశ‌పెట్టింది. అయితే బీజేపే పాలిత రాష్ట్రాల కంటే, చాలా చాలాముందుగా 2002లోనే అంటే, నిండా రెండు దశాబ్దాల ముందుగా తమిళనాడు ప్రభుత్వం, మత మార్పిడి నిరోధక చట్టాని తీసుకొచ్చింది. కన్యాకుమారి, రామనాథపురం జిల్లాలలో జరిగిన మత ఘర్షణలు నేపధ్యంగా అప్పటి  ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చించి.  అయితే అప్పుడు కూడా, ఇప్పుడు కర్ణాటకలో మతమార్పిడుల నిరోధక బిల్లును వ్యతిరేకించిన విధంగానే, కాంగ్రెస్, డిఎంకే పార్టీల సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అయినా, బిల్లు సభలో భారీ మెజారిటీ (140/72)తో ఆమోదం పొందింది. ఆ సందర్భంలో విపక్షాల, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సభ్యుల విమర్శలకు సమాధానం చెపుతూ,ముఖ్యమంత్రి జయలలిత, ‘మత మార్పిడులు భారత దేశానికి హానికరం. నాకే అధికారం ఉంటే ఒక్కక్షణం ఆలోచించకుండా, మత మార్పిడులను అడ్డుకుంటాను’  అంటూ మహాత్మా గాంధీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. నిజానికి తమిళ నాడు చట్టం అంతగా కోరలున్న చట్టం కాదు. చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా  కన్యాకుమారి, రామనాథపురం జిల్లాలలో ఈరోజుకు కూడా ఫిషర్మెన్ (మత్సకారుల)పేదరికాన్ని పావుగా చేసుకుని మత మార్పిడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే, నాస్తిక భావజాలం పునాదిగా ఏర్పాడిన ద్రవిడ పార్టీలు (డిఎంకే అన్నా డిఎంకే) రాజకీయ అధిపత్యం కొనగుతున్న రాష్ట్రంలో  మతమార్పిడి నిరోధక చట్టం, అది కూడా , హిందుత్వ  భావజాల బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే  రెండు దశాబ్దాల ముందు రావడం నిజంగా కొంత ఆశ్చర్యకరమే.. అయితే, పరిస్థితులు అలా వచ్చాయి. అందుకే చట్టం చేయవలసి వచ్చిందని విశ్లేషకులు అంటారు.   కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన మత స్వేచ్ఛ హక్కు బిల్లు 2021, ఇంతవరకు ఇతర రాష్ట్రాలు తెచ్చిన చట్టాలకు భిన్నమైనది, కఠినమైనది అంటున్నారు. అందుకే, విపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు, బిల్లును వ్యతిరేకిస్తున్నాయి, బిల్లుకు డిసెంబర్ 20 (సోమవారం) కర్ణాటక మంత్రి మండలి ఆమోదం తెలిపింది .అనంత‌రం అసెంబ్లీ ముంద‌కు వ‌చ్చింది. బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిడిల‌ను నిషేధించేందుకు ఈ బిల్లును ప్ర‌భుత్వం తీసుకొచ్చింది.అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు, కార్యకర్తలు, పౌరులు మరియు న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లుని ఒక‌సారి పరిశీలిస్తే, ఈ చట్టం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో ప్రవేశపెట్టిన వాటి కంటే మరింత కఠినమైంది. మ‌త‌మార్పిడిల‌కు పాల్ప‌డితే కర్ణాటకలో కనీస శిక్ష మూడు నుండి ఐదు సంవత్సరాలతో పాటు… కనిష్టంగా రూ.25,000 జరిమానా విధించబడుతుంది. ఉత్తరప్రదేశ్‌లో కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.15,000 జరిమానా మాత్ర‌మే విధించ‌నున్నారు. వివాహం ద్వారా కానీ వివాహం తర్వాత మత మార్పిడిని నిషేధించడంతో పాటు, కొత్త బిల్లు ‘వివాహ వాగ్దానం’ ద్వారా మతవాగ్దానం’ ద్వారా మత మార్పిడిని కూడా నిషేధిస్తుంది.కర్ణాటక మతస్వేచ్ఛ హక్కు బిల్లులోని సెక్షన్ 3 ప్రకారం ఎవరైనా “ప్రత్యక్షంగా లేదా ఇతరత్రా ఒక మతం నుండి మరొక వ్యక్తిని మతం మారడం లేదా మార్చడానికి ప్రయత్నించడం ద్వారా జరిమానా విధిస్తుంది. బలవంతం, మోసపూరిత మార్గాల ద్వారా లేదా వివాహ వాగ్దానం లాంటి వాటి ద్వారా మతమార్పిడులకు సహకరించే కుట్ర చేసిన వారికి కూడా జరిమానా విధించబడుతుందని బిల్లు పేర్కొంది. ఇది బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ఇలాంటి ఇతర చట్టాలకు భిన్నంగా ఉంది. కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు ప్రకారం.. సామూహిక మతమార్పిడులకు పాల్పడే వారికి మూడు నుంచి పదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. షెడ్యూల్డ్ కులాల వ్యక్తి మైనారిటీ రిలిజియన్ గ్రూపులోకి మారితే అతను రిజర్వేషన్లతో సహా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను కోల్పోతాడు. కాగా, ఈ బిల్లును రాష్ట్రంలోని క్రిష్టియన్ సంస్థల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది.

దేశంలో మ‌ళ్లీ లాక్‌డౌన్‌!.. ప్ర‌ధాని మోదీ కీలక మీటింగ్‌..

ఇండియాలో ఒమిక్రాన్ కేసులు 215కి చేరాయి. 15 రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు క‌ల‌వ‌ర పెడుతున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో అత్యధికంగా 57 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా.. మహారాష్ట్ర 54, తెలంగాణ 25, కర్ణాటక 19, రాజస్థాన్‌ 18, కేరళ 15, గుజరాత్‌లలో 14 కేసులు రిజిస్ట‌ర్ అయ్యాయి. కశ్మీర్‌లోనూ మూడు కేసులు వ‌చ్చాయి. యూపీ, ఒడిశా, ఏపీలలో రెండు కేసులు వచ్చాయి. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, చండీగఢ్‌, లద్దాఖ్‌ లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇలా దేశ‌వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టం.. త్వ‌ర‌లోనే క్రిస్‌మ‌స్‌, న్యూఇయ‌ర్ వేడుక‌లు ఉండ‌టంతో కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది. ఇప్ప‌టికే రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌గా.. మ‌రోవైపు, గురువారం ప్ర‌ధాని మోదీ కీల‌క స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ భేటీలో మ‌రోసారి లాక్‌డౌన్ విధించే అంశాన్ని ప‌రిశీలిస్తారా? లేక‌, క్రిస్‌మ‌స్‌కు ఆంక్ష‌లు పెట్టి.. న్యూఇయ‌ర్‌కు 24గంట‌ల పాటు లాక్‌డౌన్ పెడ‌తారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.  ఇప్ప‌టికే ఒమిక్రాన్‌పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. డెల్టా రకం కంటే కొత్త వేరియంట్‌కు 3 రెట్లు ఎక్కువగా వ్యాపిస్తున్న‌ట్టు హెచ్చరించింది. కొవిడ్‌ వార్‌ రూమ్‌లను మ‌ళ్లీ యాక్టివ్ చేయాల‌ని.. కేసులు పెరిగితే జిల్లా, స్థానిక స్థాయిల్లో కఠిన చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించింది.  ఒమిక్రాన్ క‌ట్ట‌డికి రాష్ట్రాల‌కు కేంద్రం ప‌లు సూచ‌న‌లు చేసింది. పరిస్థితులను బ‌ట్టి రాత్రి కర్ఫ్యూ విధించడం,  ప్రజలు గుమిగూడకుండా చూడటం, వివాహాలు, అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్యను పరిమితం చేయడం, పరీక్షలు పెంచడం లాంటివి చేయాలని తెలిపింది. ఇదే స‌మ‌యంలో గురువారం ప్ర‌ధాని మోదీ కీల‌క స‌మీక్ష నిర్వ‌హించ‌నుండ‌టంతో.. ఈ క‌ఠిన నిబంధ‌న‌లే కేంద్రం అధికారికంగా అమ‌లు చేస్తుందా?  పాక్షిక లాక్‌డౌన్ లాంటి చ‌ర్య‌ల‌కు దిగుతుందా?  క్రిస్‌మ‌స్‌, న్యూఇయ‌ర్ వేడుక‌ల్లో కేసులు పెర‌గ‌కుండా ఆంక్ష‌లు విధిస్తుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. గురువారం మ‌ళ్లీ పీఎం మోదీ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడ‌తారా? మ‌రోసారి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేస్తారా?