జగన్ చెబితే ఇక్కడికి వచ్చా: విజయమ్మ

సిరిసిల్ల చేనేత దీక్షాలో విజయమ్మ మాట్లాడుతూ సిరిసిల్లలోని నేతన్నలను ఓదార్చమని జగన్మోహన రెడ్డి చెబితే తాను ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. త్వరలోనే జగన్ ముఖ్యమంత్రి అయి సువర్ణ యుగం తీసుకువస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఆప్పుడు చేనేత కార్మికుల కోసం జగన్ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని చెప్పారు. కేంత్ర ప్రభుత్వ విధానాలతో రైతులు, చేనేత కార్మికులు అల్లాడుతున్నారని చెప్పారు. చేనేత వస్త్రాలంటే రాజశేఖర రెడ్డికి ఇష్టం అని, ప్రభుత్వం తన ఖజానా నింపుకోవడానికి పన్నులు, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచివేసిందని విమర్శించారు.

విజయమ్మ తెలంగాణలో దీక్ష చేస్తే తప్పేంటి: జగ్గారెడ్డి

సిరిసిల్లలో చేనేత కార్మికుల కోసం విజయమ్మ తెలంగాణలో దీక్ష చేస్తే తప్పేంటి అని కాంగ్రెస్ విప్ జగ్గారెడ్డి అన్నారు. జయమ్మ ధర్నాను అడ్డుకుంటామని టీఆర్‌ఎస్, జేఏసీలు ప్రకటించిన నేపథ్యంలో, జగన్ ఆర్మూరు వస్తే అడ్డుకోకుండా విజయమ్మను ఎందుకు అడ్డుకుంటారని కాంగ్రెస్ విప్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణాలో తిరగాలంటే టిఆర్ఎస్ పర్మిషన్ కావాలా, తెలంగాణాలో టిఆర్ఎస్ ప్రజాసామ్యన్ని ఖూని చేస్తుందని అన్నారు. టిఆర్ఎస్ ను తెలంగాణా ప్రజలు మర్చిపోతున్నారనే భయంతోనే విజయమ్మ దీక్షను అడ్డుకుంటామంటున్నరంటు ఆయన అన్నారు.

శ్రీలంకపై 21 పరుగులతో భారత్ గెలుపు

మహింద రాజపక్స స్టేడియంలో శనివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 21 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనిసేన 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 314 పరుగుల భారీ స్కోరు సాధించింది. సెహ్వాగ్ (97 బంతుల్లో 96; 10 ఫోర్లు), విరాట్ కోహ్లి (113 బంతుల్లో 106; 9 ఫోర్లు) చక్కటి బ్యాటింగ్‌తో సెంచరీ చేశాడు. సెహ్వాగ్ సెంచరీ మిస్ అయినా, కోహ్లితో కలిసి రెండో వికెట్‌కు 173 పరుగులు జోడించాడు.  రైనా (45 బంతుల్లో 50; 3 ఫోర్లు, 1 సిక్సర్), ధోని (29 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్సర్) కలిసి ఐదో వికెట్‌కు 79 పరుగులు జోడించిన  భారత బ్యాట్స్‌మెన్ లంకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. శ్రీలంక జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసి ఓడిపోయింది. సంగక్కర (151 బంతుల్లో 133; 12 ఫోర్లు) మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో వన్డే మంగళవారం ఇదే వేదికలో జరుగుతుంది.