బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకున్న జగన్
posted on Jul 23, 2012 @ 12:43PM
జగన్ సుప్రీం కోర్టులో వేసిన తన బెయిల్ పిటిషన్‌ను సోమవారం వెనక్కి తీసుకోనున్నారు. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ జగన్ ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈడి దర్యాఫ్తు జరుగుతున్న దృష్ట్యా జగన్ తన బెయిల్ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకోవడానికి సిద్ధమయ్యారు. బెయిల్ మంజూరు చేయడానికి హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.