నేను పిచ్చివాడిని కాదు: కె.ఎ.పాల్
posted on Jul 22, 2012 @ 12:32PM
నేను పిచ్చి వాడిని కాదని, నాకు పిచ్చి లేదని చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి వస్తే ఇక్కడ చికిత్స చేయకుండా పిచ్చిఉందని ఎర్రగడ్డకు పంపుతున్నారని కె.ఎ.పాల్ ఆరోపించారు.పోలీసులు కక్ష గట్టి తనని ఎర్రగడ్డకు తీసుకెళ్తున్నారన్నారు. తనను చంపడానికి కుట్రచేస్తున్నారని పాల్ ఆరోపించారు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన హత్య కేసులో ఇప్పుడు తనని అరెస్ట్ చేయడమేంటని, ఇదంతా రాజకీయ కుట్ర అని కె.ఎ.పాల్ అన్నారు.