సిరిసిల్ల విజయమ్మ దీక్షకు రంగం సిద్ధం
posted on Jul 23, 2012 @ 10:05AM
వైఎస్ విజయమ్మ దీక్షకు సర్వం సిద్ధమైంది. దీక్షకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీలు చేసిన అనంతరమే అనుమతి ఇస్తున్నారు. టీఆర్‌ఎస్ నాయకులు దీక్షను అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున బలగాలు మోహరించారు. సిరిసిల్లకు వచ్చే అన్ని ప్రధాన రహదారుల్లో వాహనాలను పోలీసులు క్షుణ్టంగా తనిఖీ చేస్తున్నారు. పట్టణం మొత్తం పోలీస్ బలగాలతో నిండిపోయింది. సిరిసిల్లకు వచ్చే దారి పొడవునా ప్రత్యేక బలగాలు మోహరించారు.