శ్రీలంకపై 21 పరుగులతో భారత్ గెలుపు
posted on Jul 22, 2012 @ 11:30AM
మహింద రాజపక్స స్టేడియంలో శనివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 21 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనిసేన 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 314 పరుగుల భారీ స్కోరు సాధించింది. సెహ్వాగ్ (97 బంతుల్లో 96; 10 ఫోర్లు), విరాట్ కోహ్లి (113 బంతుల్లో 106; 9 ఫోర్లు) చక్కటి బ్యాటింగ్‌తో సెంచరీ చేశాడు. సెహ్వాగ్ సెంచరీ మిస్ అయినా, కోహ్లితో కలిసి రెండో వికెట్‌కు 173 పరుగులు జోడించాడు. రైనా (45 బంతుల్లో 50; 3 ఫోర్లు, 1 సిక్సర్), ధోని (29 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్సర్) కలిసి ఐదో వికెట్‌కు 79 పరుగులు జోడించిన భారత బ్యాట్స్‌మెన్ లంకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. శ్రీలంక జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసి ఓడిపోయింది. సంగక్కర (151 బంతుల్లో 133; 12 ఫోర్లు) మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో వన్డే మంగళవారం ఇదే వేదికలో జరుగుతుంది.