విజయమ్మ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
posted on Jul 23, 2012 @ 2:13PM
సుప్రీం కోర్టులో వైఎస్ విజయమ్మకు చుక్కెదురైంది. జగన్‌లాగానే చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలన్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. గతంలో వేసిన కేసుల గురించి కోర్టుకు తెలియజేయలేదన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే పిటిషన్ వేసినట్లు న్యాయస్థానం మండిపడింది. రాజకీయ కక్షలను కోర్టు బయటే చూసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.