విజయమ్మ కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు
posted on Jul 23, 2012 @ 12:58PM
విజయమ్మ కాన్వాయ్‌ని పోలీసులు సోమవారం మెదక్ జిల్లా గజ్వెల్ సమీపంలోని కుకునూరుపల్లి వద్ద అడ్డుకున్నారు. విజయమ్మ చేనేత దీక్ష సందర్భంగా ఆమె భారీ కాన్వాయ్‌తో సిరిసిల్లకు హైదరాబాదు నుండి రాజీవ్ రహదారి వెంట బయలుదేరారు. అయితే పోలీసులు కుకునూరుపల్లి వద్ద ఆమె కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. విజయమ్మ వాహనం మినహా మిగతా వాహనాలకు అనుమతి లేదని పోలీసులు కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ఆమె కారు వెనుక కొన్ని వాహనాలను మాత్రమే రక్షణ కోసం అనుమతించారు.