వర్షంలో కొనసాగుతున్న సి.ఎం గ్రేటర్ పర్యటన

హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తుంటే, సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తన గ్రేటర్ పర్యటనను అలాగే కొనసాగిస్తున్నారు. శేరిలింగంపల్లిలో ఆయన ఇందిరమ్మ బాటలో భాగంగా శనివారం రాజీవ్ గాంధీ ఆవాస్ యోజన పథకానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాదులో 1400 మురికివాడలు ఉన్నట్లు గుర్తించామని, వాటిని 9 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. శేరిలింగంపల్లిలో క్రీడామైదానాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఓ క్రీడా మైదానం ఏర్పాటు చేయనునన్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 11 పట్టణాల్లో రాజీవ్ ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. దశలవారీగా హైదరాబాదును అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.