చంద్రబాబుకి షాకిచ్చిన చుండూరి రవి
posted on Jul 23, 2012 @ 3:25PM
ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. జిల్లాకు చెందిన నేత, టిడిపి రాష్ట్ర కార్యదర్శి చుండూరి రవి సోమవారం టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి పంపించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్టీఆర్ అభిమానులను అణిచివేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.