విజయమ్మ తెలంగాణలో దీక్ష చేస్తే తప్పేంటి: జగ్గారెడ్డి
posted on Jul 22, 2012 @ 4:14PM
సిరిసిల్లలో చేనేత కార్మికుల కోసం విజయమ్మ తెలంగాణలో దీక్ష చేస్తే తప్పేంటి అని కాంగ్రెస్ విప్ జగ్గారెడ్డి అన్నారు. జయమ్మ ధర్నాను అడ్డుకుంటామని టీఆర్‌ఎస్, జేఏసీలు ప్రకటించిన నేపథ్యంలో, జగన్ ఆర్మూరు వస్తే అడ్డుకోకుండా విజయమ్మను ఎందుకు అడ్డుకుంటారని కాంగ్రెస్ విప్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణాలో తిరగాలంటే టిఆర్ఎస్ పర్మిషన్ కావాలా, తెలంగాణాలో టిఆర్ఎస్ ప్రజాసామ్యన్ని ఖూని చేస్తుందని అన్నారు. టిఆర్ఎస్ ను తెలంగాణా ప్రజలు మర్చిపోతున్నారనే భయంతోనే విజయమ్మ దీక్షను అడ్డుకుంటామంటున్నరంటు ఆయన అన్నారు.