చీఫ్ మినిస్టర్, పీసీసీ చీఫ్ తో మంత్రుల కమిటీ భేటీ

గాంధీభవన్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణతో ధర్మాన నేతృత్వంలోని మంత్రుల కమిటీ మధ్యంతర నివేదికను స్సమర్పించింది.అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించిన కమిటీ, నామినేటేడ్ పదవులను వెంటనే భర్తీ చేయాలని, మహిళా సంక్షేమం కోసం మరిన్ని కొత్త పథకాలను ప్రవేశ పెట్టాలని కమిటీ సూచించింది.గ్రామస్తాయినుంచి పార్తె౩ఎ ప్రక్షాలన జరగాలి, ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స తో సహా పై స్థాయి అధికారులందరూ మీడియాకు అందుబాటులో ఉండాలి, పార్టీకి సొంత చానలే గానీ పత్రికగానీ ఉండాలి, పేద వర్గాల అమ్మాయిల వివాహాలకు ప్రభుత్వమే ప్యాకేజీ క్రింద తాళిబొట్లు, బట్టలు అందజేయాలని కమిటీ సూచిచింది,

మంత్రి పార్థసారథి పై వారెంట్‌ ను ఉపసంహరించుకున్నకోర్ట్

రాష్ట్ర మంత్రి పార్థసారథి కి నాంపల్లి ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు సోమవారం నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. 2002లో మంత్రి ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2003లో మూడు లక్షల రూపాయల జరిమానా విధించారు. ఆ జరిమానాను మంత్రి పార్థసారధి చెల్లించలేదు.అంతేకాకుండా కోర్టు వాయిదాలకు కూడా ఆయన హాజరుకాలేదు.దాంతో కోర్టు వారెంట్ జారీ చేసింది.అయితే నిన్న రాష్ట్ర మంత్రి పార్థసారథి పై జారి చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను ఈరోజు  నాంపల్లి ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు ఉపసంహరించుకుంది.

జగన్ కి త్వరలో మంచి రోజులు వస్తాయి:మోహన్ బాబు

అక్రమాస్తుల కేసులో అరస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని సినీ నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణువర్థన్ బాబు మంగళవారం ములాఖత్ సమయంలో కలుసుకున్నారు. అదే సమయంలో జగన్ తల్లి విజయమ్మ కూడా అక్కడే ఉన్నారు. అయితే జగన్‌ను కలవడంలో రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని,కుటుంబాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలవల్లే కలిసినట్లు చెబుతున్నారు. తాను జైలులో తన మేనల్లుడు జగన్‌ను,అత్యంత సన్నిహితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌లను కలిశానని చెప్పారు.వారిని చూసిన తరువాత ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదన్నారు.జగన్‌కు త్వరలో మంచి రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు మహాభారత యుద్ధం జరుగుతున్నట్లుగా ఉందన్నారు. జగన్ ని చూసి తన గుండె బరువెక్కిందని అన్నాడు. ఢిల్లీలో చాల మంది శకునులు ఉన్నారని అన్నారు. ఎందరు ఎన్ని ఎత్తులు వేసినా చివరకు న్యాయం,ధర్మమే గెలుస్తుందని చెప్పారు. త్వరలో జగన్,నిమ్మగడ్డ బయటకు రావాలని తాను షిరిడీ సాయినాథుని కోరుకున్నానని అన్నారు.     

జైల్లో జగన్ ని కలిసిన సినీ నటుడు మోహన్ బాబు

అక్రమాస్తుల కేసులో అరస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని సినీ నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణువర్థన్ బాబు మంగళవారం ములాఖత్ సమయంలో కలుసుకున్నారు. అదే సమయంలో జగన్ తల్లి విజయమ్మ కూడా అక్కడే ఉన్నారు. అయితే జగన్‌ను కలవడంలో రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని, కుటుంబాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలవల్లే కలిసినట్లు చెబుతున్నారు. అయితే మోహన్ బాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. జగన్‌ను కలవడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్న అన్ని పార్టీలను తొలుస్తోంది. గతంలో కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతి రెడ్డితో కలిసి మోహన్ బాబు ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే.

ఉధృతంగా ప్రవహిస్తున్న పెనుగంగా

 మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతోపాటు జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెనుగంగకు ఉధృతంగా వరద నీరు వచ్చి చేరుతోంది. పెన్‌గంగతో పాటు ప్రాణహిత నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది.ఆయా మండలాల్లోని గ్రామాలలో పంటలు నీట మునిగాయి.మహారాష్ర్టలోని యావత్మాల్ జిల్లాలో గల జాయక్‌వాడి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయనుండటంతో ప్రాణహిత, పెన్‌గంగ నదుల్లో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.కాగా సిర్పూర్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య వరద ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.