విజయమ్మ దీక్షా స్థలం వద్ద పరిస్థితి ఉద్రిక్తం
posted on Jul 23, 2012 @ 2:51PM
విజయమ్మ సిరిసిల్ల దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. దీక్షా ప్రాంగణంపై తెలంగాణవాదులు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురు మహిళలై సభా వేదిక ముందు జై తెలంగాణ నినాదాలు చేస్తూ సభను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. తెలంగాణవాదులు పోలీసులు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. దీక్షా స్థలంలో గొడవ చేస్తున్న తెలంగాణవాదులున్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీక్షా స్థలం మొత్తం రణరంగంగా మారింది.