అమ్మాయి గొంతు నులిమి ర్యాగింగ్ చేసిన విద్యార్థినులు
posted on Jul 22, 2012 @ 2:55PM
విజయనగరం జిల్లాలో గొట్లాం దగ్గర ఉన్న గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న శ్యామల అనే విద్యార్థిని నిద్ర పోతున్న సమయంలో సహచర విద్యార్థినులు ఆమె గొంతు నులిమి ర్యాగింగ్ చేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కళాశాల యాజమాన్యం, బంధువులు బాధితురాలు శ్యామలను వెంటనే ఆసుపత్రికి తరలించారు.కళాశాల యాజమాన్యం, బంధువులు బాధితురాలు శ్యామలను వెంటనే విశాఖపట్నం కెజిహెచ్ ఆసుపత్రికి తరలించారు.శ్యామల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.