లండన్ ఒలంపిక్స్ లో అభిషేక్ బచ్చన్
posted on Aug 8, 2012 @ 11:02AM
ఓమెగా వాచ్ కంపెనీ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. అథ్లెటిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లతో పాటు ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ మ్యాచ్‌లను అభిషేక్ ప్రత్యక్షంగా తిలకించాడు. ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడడం ఆనందంగా ఉందన్నాడు. మరీ ముఖ్యంగా 100 మీటర్స్ స్ప్రింట్ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడాలన్న తన కాంక్ష నెరవేరిందని ఫిల్మ్ స్టార్ తెలిపాడు. ఒలింపిక్స్ జ్యోతి ర్యాలీలో తన తండ్రి అమితాబ్ పాల్గొనడం అది మరో మరుపురాని సంఘటన అని అభిషేక్ గుర్తు చేశాడు.